Illu Illalu Pillalu Serial Today Episode నర్మద, ప్రేమలు వల్లీకి ఉద్యోగం గురించి అడుగుతారు. అత్తయ్యగారికి సాయం చేయడానికి ఉండిపోయా.. లేదంటే నేను ఉద్యోగానికి వెళ్లేదాన్ని అని వల్లీ అంటుంది. దాంతో వేదవతి ఏంటమ్మా నువ్వు లేకుండా నేను ఇంటి పనులు చేసుకోలేనా.. నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్లమ్మా.. నువ్వు లేకపోయినా ఐదుగురు పిల్లలను పెంచానమ్మా నువ్వు వెళ్లు అని అంటుంది. దాంతో నర్మద, ప్రేమలు నువ్వు వెళ్లి చక్కగా జాబ్ చేసుకో అక్క అని అంటారు.
వేదవతితో పాటు సాగర్, ధీరజ్, చందు అందరూ పెద్ద చదువు చదివి వేస్ట్ చేయడం ఎందుకు మంచి జాబ్ చేసుకో అని చెప్తారు. మామయ్య గారి వైపు నుంచి నరుక్కురావాలి అని మనసులో అనుకొని ఇంటి పెద్ద అయిన మామయ్య గారు ఒప్పుకోవాలి.. దేవుడిలాంటి మామయ్య గారి మాటే నాకు వేదవాక్కు.. మామయ్య గారు ఒక్క మాట చెప్తే రేపటి నుంచి నేను వెళ్లకపోతే అప్పుడు అడగండి అని రామరాజుని జాబ్‌కి వెళ్లాలా అని అడుగుతుంది. దాంతో రామరాజు వెళ్లమ్మా అని చెప్తాడు. వల్లీ బిత్తరపోతుంది. నీకు ఉద్యోగం చేయాలి అని ఇష్టం ఉంటే నేను ఎందుకు కాదు అంటానమ్మా అని అంటాడు. ప్రేమని వద్దు అన్నారు కదా అంటుంది వల్లీ. ప్రేమ చదువుతూ జాబ్ చేస్తా అంటే వద్దు అన్నాను.. అయినా తనని వద్దు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కానీ నువ్వు హ్యాపీగా చేసుకోమ్మా అని అంటారు.
ప్రేమ వల్లీతో అక్క రేపు నీ సర్టిఫికేట్లు ఇవ్వు మంచి జాబ్‌కి అప్లే చేద్దాం అని అంటుంది. ఇక రాత్రి నర్మద నిద్రలో లేచే సరికి పక్కన సాగర్ ఉండడు. రాత్రి 12 అయింది ఈ టైంలో సాగర్ ఎక్కడికి వెళ్లాడు అని బయటకు వెళ్తుంది. సాగర్ రాత్రి పెద్ద వర్షంలో కూర్చొని ఉంటాడు. నర్మద చూసి సాగర్ దగ్గరకు పరుగులు పెడుతుంది. ఈ టైంలో వర్షంలో ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. గదిలోకి తీసుకెళ్లి తల తుడుస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. నేను సాధించాలి అనుకున్నది చేయాలి అనుకున్నది చేయలేకపోతున్నా కదా అని బాధ పడతాడు. సాగర్ నువ్వు చేతకానివాడివి అసమర్ధుడువి అంతకన్నా కాదు.. అని ధైర్యం చెప్తుంది. సాగర్‌ని దగ్గరకు తీసుకుంటుంది.
వల్లీ తల్లిదండ్రులను ఐస్ గడ్డ మీద నిల్చొపెడుతుంది. నాకు వచ్చిన కోపానికి మీకు అపరిచితుడు సినిమాలో శిక్షలు అన్నీ వేయాలి కానీ ఇలా ఐస్‌తో సరిపెట్టా అని అంటుంది. ఇద్దరూ ఐస్ మీద నిల్చొలేక విలవిల్లాడిపోతారు. కాసేపు ఇలాగే ఉంటే ఐస్ గడ్డ నుంచి ఐస్ బాక్స్‌లోకి పోతామే అని కిందకి దిగుతారు. ఏమైందని వల్లీని అడుగుతారు. దాంతో తనని ఉద్యోగానికి వెళ్లమని చెప్పారని అంటుంది. చావు తెలివి తేటలు ఉన్న నాకు ఇది ఒక కష్టమా ఆ సర్టిఫికేట్ గురించి నేను చూసుకుంటా అని భాగ్యం చెప్తుంది.
ప్రేమ చదువుకుంటూ ఉంటే ధీరజ్ ప్రేమ కోసం గిఫ్ట్ తీసుకొని వస్తాడు. ఏంటా అని ప్రేమ చూస్తే అందులో పోలీస్ డ్రస్ ఉంటుంది. ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. నువ్వు కచ్చితంగా పోలీస్ అవుతావ్ ఆ నమ్మకం నాకు ఉంది అందుకే కాబోయే పోలీస్‌కి ఈ కామన్ మెన్ గిఫ్ట్ అని అంటాడు. ప్రేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. పోలీస్ డ్రస్‌లో ప్రేమ రాగానే ధీరజ్ చూస్తూ ఉండిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.