Nindu Noorella Saavasam Serial Today Episode: స్వామీజీ తనను చూడటంతో ఆరు భయపడుతుంది. ఎందుకు ఆయన నావైపే చూశారు. నేను ఆయనకు కనిపించానా గుప్త గారు అని అడుగుతుంది. అవునని గుప్త చెప్పగానే ఆరు షాక్ అవుతుంది.
గుప్త: నువ్వు ఈ లోకం విడిచి వెళ్లుటకు విధి నిర్ణయించింది బాలిక. ఎప్పటి వలే ఇప్పుడు కూడా నువ్వు విధికి ఎదురు వెళ్లకు బాలిక. లేదంటే నువ్వు నీ కుటుంబం చాలా సమస్యలు ఏదుర్కోవాల్సి వస్తుంది. ఏమీ మాట్లాడకుండా నాతో నువ్వు మా లోకానికి రమ్ము బాలిక
ఆరు: మనోహరి కన్న కూతురినే వదిలేసిన కసాయి అని తెలిసి కూడా నా పిల్లలను వదిలేసి నేను ఎలా రాగలను గుప్త గారు
మనోహరి: ఓసేయ్ ఆరు నా గురించి నాకు తెలిసినదాని కన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది. నా గురి ఎప్పటికీ తప్పదని తెలుసుకో
అంటూ బాల్కనీలోకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంట్లోకి వెళ్లిన స్వామిజీ భాగీని చూసి ఇంత కాలానికి గమ్యం చేరావా తల్లి అంటాడు. అందరూ షాక్ అవుతారు.
స్వామీజీ: మీ పెళ్లి కోసం విధి చాలా పెద్ద ఆట ఆడింది. ఎన్ని కష్టాలు వచ్చినా మీ బంధాన్ని వదలకండి. ఈ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది.
నిర్మల: మనోహరి అని నా పెద్ద కోడలి స్నేహితురాలు స్వామిజీ.
స్వామిజీ: చావు కోరి వచ్చిన స్నేహమా..? చావు కూడా వేరు చేయలేని స్నేహమా చెప్పమ్మా మనోహరి నీ స్నేహం ఎటువంటిది. స్నేహం ప్రాణాలు ఇస్తుందా..? ప్రాణాలు తీస్తుందా..?
అని స్వామిజీ అడగ్గానే మనోహరి టెన్షన్‌తో భయపడుతుంది.
స్వామిజీ: నిర్మలమ్మ మీ సమస్య ఏంటో చెప్పమ్మా
నిర్మల: ఇంట్లో ఒక దాని తర్వాత ఒకటి ప్రమాదం వస్తుంది. ఏదో ఒక ప్రమాదం కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. దోషం ఏమైనా ఉందేమోనని తెలుసుకుని నివారణ చేసుకుందామని పిలిపించాం స్వామి
స్వామిజీ: నీ అనుమానం నిజం నిర్మలమ్మ. దోషం జరిగింది. మీ మనసులో ఉన్న అనుమానమే నిజం అయింది.
భాగీ: అంటే తప్పు జరిగిందా..? స్వామి.. మేము ఏ తప్పు చేయలేదు. తెలియకుండా ఏదైనా చేసి ఉంటే చెప్పండి స్వామి పరిహారం చేసుకుంటాం
రాథోడ్: ఏమైంది స్వామి బయటకే చూస్తున్నారు. ఇందాక వచ్చేటప్పుడు కూడా బయట అలా చూశారు
స్వామిజీ: నేను చెప్పే విషయం మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు.. సంతోషాన్ని ఇవ్వవచ్చు.. మనసును బాధ పెట్టవచ్చు కానీ మీ కుటుంబ క్షేమం కోరే మనిషిని కాబట్టి చెప్తున్నాను.. ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి పోలేదు. ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది.
అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు.
శివరాం: అదెలా సాద్యం అవుతుంది స్వామి. మనిషి చనిపోయాక ఆత్మ, పరమాత్మలో లీనం అవుతుంది కదా
స్వామిజీ: అదెలా జరగుతుంది శివరాం. అమ్మాయి ఆస్తికలు ఇంకా నదిలో కలపలేదు కదా..? ఆస్థికలు దాచుకుని ఆత్మకు మోక్షం కలగాలంటే ఎలా సాధ్యపడుతుంది.
స్వామిజీ మాటలకు అమర్ షాక్ అవుతాడు. అంటే స్వామిజీ ఆరు ఇక్కడే ఉందా అని అడుగుతాడు. అవునని ఇక్కడే ఎక్కడైనా ఉండొచ్చని చెప్తాడు స్వామి. దీంతో అమర్ ఇల్లంతా వెతుకుతూ బయటకు గార్డెన్‌లోకి వెళ్తాడు. అమర్ పక్కనే ఆరు వచ్చి నిలబడి ఉంటుంది. అమర్ గట్టిగా ఆరు అని పిలుస్తూ ఏడుస్తుంటాడు. ఆరు ఏడుస్తుంది. అమర్‌ను లోపలికి తీసుకురమ్మని శివరాం, భాగీకి చెప్తాడు. భాగీ బయటకు వస్తుంటే గుప్త పరుగెత్తుకెళ్లి ఆరును పక్కకు తీసుకెళ్తాడు. లోపల ఉన్న మనోహరి ఏదో ఒకటి చేసి ఆరు అస్థికలు నదిలో కలిపేలా చేయాలని బాధపడ్డట్టు నటిస్తుంది. రాథోడ్ మాత్రం మంచి మనసున్న మేడం వల్ల ఈ ఇంటికి చెడు జరుగుతుందంటే నేను నమ్మను అంటాడు. దీంతో స్వామిజీ అవునని తను ఈ ఇంటికి రక్షణగా నిలబడిందని కానీ ఆస్థికలు నదిలో కలపడం మన ధర్మం అని చెప్పి వెళ్లిపోతాడు స్వామిజీ. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!