Nindu Noorella Saavasam Serial Today Episode: రాథోడ్ ఫంక్షన్ కోసం స్టేజీ రెడీ చేస్తుంటాడు. అక్కడికి రామ్మూర్తి వస్తాడు. రాథోడ్‌ను స్పీడుగా చేయమని అతిథులు వస్తున్నారని చెప్తాడు. రాథోడ్ చేస్తున్నాను సార్ అని చెప్తాడు.
రాథోడ్: అది కాదు సార్ ఇంట్లో శని దేవతను పెట్టుకుని బయటి నుంచి ఎంత మంది ముత్తైదువలు వస్తే మాత్రం ఏం లాభం
రామ్మూర్తి: నువ్వు ఎవరి గురించి అంటున్నావు రాథోడ్
రాథోడ్: ఇంకెవరి గురించి సార్ ఆ రాక్షసి మనోహరి గురించి మిస్సమ్మకు బిడ్డ పుట్టినప్పటి నుంచి తన చూపే వేరేగా ఉంది సార్. ఎప్పుడు చూడు బిడ్డను క్రూయిల్‌గా చూస్తుంది. మీరేమో దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు పోయి పోయి మిస్సమ్మకు బిడ్డకు ఆమెతోనే దిష్టి తీయించారు
రామ్మూర్తి: రాథోడ్ నేను ఆ దుర్మార్గురాలితో దిష్టి తీయించింది తనను ఎక్కువ చేయడానికి కాదు. ఏ చేతులతో అయితే అరుందతిని పైకి పంపించిందో అదే చేతులతో మళ్లీ ఈ ఇంట్లోకి అరుందతికి స్వాగతం చెప్పడానికి
రాథోడ్: ఆ విషయం నాకు అర్థం అయింది సార్ .. కానీ తను ఎలాంటిదో మీకు తెలుసు కదా..? తను ఈ ఇంట్లో ఉండటం ఇంకెంత మాత్రం బిడ్డకు క్షేమం కాదు. సార్ వెంటనే మా సార్‌కు చెప్పి వెంటనే ఇంట్లోంచి వెళ్లగొట్టండి
రామ్మూర్తి: ఆ పని ఎప్పుడెప్పుడు చేద్దామా..? అని నాకు ఉంది రాథోడ్
రాథోడ్: మరి ఎందుకు సార్ ఆగుతున్నారు.. ఆవిడ గురించి నన్నైనా సార్‌కు చెప్పమంటారా…? లేక మీరే చెప్తారా..?
రామ్మూర్తి: కాదు రాథోడ్ తన గురించి అల్లుడి గారికి చెప్పొద్దని భాగీ నా దగ్గర మాట తీసుకుంది
రాథోడ్: లేదు సార్ మాట గీటా పక్కన పెట్టండి మనం రిస్క్ తీసుకోవద్దు.. అప్పట్లో అరుందతి మేడం కూడా ఆ దుర్మార్గురాలిని అమాయకంగా నమ్మింది. ఆ తప్పు మళ్లీ జరగకూడదు..
రామ్మూర్తి: అలాగని భాగీని కాదని మళ్లీ అల్లుడి గారితో మనం ఏమీ చెప్పకూడదు కదయ్యా..?
రాథోడ్: అయితే మిస్సమ్మతోకే చెప్పిద్దాం సార్. వీలైనంత త్వరగా ఆ మనోహరిని ఈ ఇంటి నుంచి పంపిచేద్దాం.
రామ్మూర్తి: సరే ఈ ఫంక్షన్ అయిపోని రాథోడ్ అల్లుడి గారితో చెప్పమని మనమే చెబుదాం.. భాగీ చెప్పిందా సరేసరి లేదంటే ఆ రాక్షసి గురించి మనమే అల్లుడి గారికి చెబుదాం..
రాథోడ్: అంతే సార్ ఎక్కువ రోజులు పామును పక్కలో పడుకోబెట్టుకోకూడదు. ఆ మనోహరి విషసర్పానికి మించిన పాము..
రామ్మూర్తి: ఎంత విష సర్పం అయినా.. చలి చీమల చేత చిక్కి ఎప్పటికైనా చావడం కాయమని ఈ ఫంక్షన్ అయ్యాక చూడు.. ఆ మనోహరి ఇక ఇక్కడ ఉండనే ఉండదు..
అంటూ రామ్మూర్తి చెప్తాడు. దీంతో రాథోడ్ నవ్వుతుంటాడు. అయితే ఇద్దరూ ఇలా మట్లాడుకోవడం చాటు నుంచి చంభా వింటుంది. వెంటనే మనోహరికి చెప్పాలని పరుగెడుతుంది. మనోహరి బయట గేటు దగ్గర నిలబడి పంతులుకు స్వాగతం పలుకుతుంది. నేను చెప్పిందంతా గుర్తుందా పంతులు గారు అని అడుగుతుంది. గుర్తుందని పంతులు చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. చంభా వచ్చి రాథోడ్, రామ్మూర్తి మాట్లడుకున్న విషయం చెప్తుంది. మనోహరి నవ్వుతుంది. తర్వాత పంతులు భాగీని పక్కకు తీసుకెళ్లి చిన్న పాప వల్ల అమ్ముకు ప్రాణగండం ఉందని చెప్తాడు. ఆ విషయం విని భాగీ షాక్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!