Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ తన తండ్రిని పుట్టింటిలో డ్రాప్ చేసి రావడం వల్లీ ధీరజ్‌కి చూపిస్తుంది. ధీరజ్ షాక్ అయి అలా ఉండిపోతాడు. తర్వాత ధీరజ్ ఏం అనకుండా ఓ చోట అలా సైలెంట్‌గా ఉంటే వల్లీ చూసి ధీరజ్ ఇలా సైలెంట్‌గా ఉండటానికి వీల్లేదు.. ప్రేమ ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. మంట పెట్టేద్దాం అని అనుకుంటుంది.
ధీరజ్ దగ్గరకు వెళ్లి ప్రేమ వాళ్ల నాన్నని తీసుకురావడం గురించి ఆలోచిస్తున్నావా.. వాళ్ల నాన్న అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి.. ఎక్కడో తాగి పడిపోయిన తన తండ్రిని తీసుకొచ్చింది.. ఇది మంచి విషయమే కానీ వాళ్లు మంచోళ్లు కాదు కదా..మళ్లీ వాళ్లు ఈ విషయంతో మీ నాన్నతో గొడవ పడి మళ్లీ మీనాన్న చొక్కా చింపేసి నడిరోడ్డు మీద అవమానిస్తారు. ప్రేమ ఇవన్నీ ఆలోచించాలి కదా.. ప్రేమ తండ్రి కోపం తెలిసి కూడా ఇలా చేయడం ఏం బాలేదు.. ప్రేమ మనిషి ఇక్కడున్నా మనసు అంతా పుట్టింటి దగ్గరే ఉండిపోయింది. దాని వల్ల మీ నాన్నకి అవమానాలు అని ధీరజ్‌కి ఎక్కించి వెళ్లిపోతుంది.
ప్రేమ వల్లీ ధీరజ్‌తో మాట్లాడి రావడం చూస్తుంది. ధీరజ్‌ని భోజనానికి పిలుస్తుంది. ధీరజ్ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతాడు. ప్రేమ ధీరజ్‌తో నీ కోపానికి మౌనానికి కారణం నాకు తెలుసు. మా నాన్న నా వల్ల మందుకి బానిస అయ్యారు. ఎక్కడో తాగి పడిపోయారు. తీసుకురావడానికి ఎవరూ లేరని మా అమ్మ టెన్షన్ పడుతుంటే నేను వెళ్లాను.. నీకు ఈ విషయంలో కోపం ఉంటే నా మీద చూపించు కానీ ఇలా మౌనంగా ఉండకు అని అంటుంది. అయినా ధీరజ్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
సాగర్ ఓ టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతూ ఉంటే సాగర్ ఫ్రెండ్ టిప్ టాప్గా వచ్చి పక్కన కూర్చొంటాడు. తనో స్టాక్స్‌లో డబ్బు పెట్టి కోట్లు సంపాదించానుని తన దగ్గర చాలా కార్లు అన్నీ ఉన్నాయని చెప్పడంతో సాగర్‌కి గవర్నమెంట్ జాబ్ కొనడానికి డబ్బు ఏర్పాటు అవుతుందని ఆశతో తండ్రి షాప్ అతనికి ఇవ్వమని చెప్పిన 2 లక్షల్లో ఒక లక్ష అతనికి వచ్చి వారంలో ఇవ్వమనిఅంటాడు. వారంలో నీకు 3 లక్షలు వస్తాయని అతను చెప్తాడు. సాగర్ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక షాప్ అతనికి లక్ష ఇస్తాడు. మీ నాన్న రెండు లక్షలు పంపిస్తా అన్నాడు లక్ష ఏంటి అని ఆయన షాక్ అవుతాడు.
సాగర్ రాత్రి తన ఫ్రెండ్‌కి లాభాలు వస్తాయని సంతోషంతో ఫోన్ చేస్తే అతని ఫోన్ కలవదు. నమ్మి మోసపోయానా.. లక్ష పోయిందా అని సాగర్ చాలా టెన్షన్ పడతాడు. నర్మద వచ్చి ఏమైందని అడుగుతుంది. సాగర్ నర్మద మీద అరుస్తాడు. నేను రైస్ మిల్లులో పని చేస్తున్నా అని నువ్వు ఫీలవుతున్నావా అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ సాగర్ అంటే నువ్వు నామోషీగా ఫీలవుతూ ఎవరితో అయినా నీ బాధ పంచుకున్నావా అని అడుగుతాడు. నీకు అన్నీ సమాధానం చెప్తా కానీ నీతో ఇవన్నీ చెప్పింది ఎవరు అని అడుగుతుంది. ఇంట్లోవాళ్లే ఇలా చెప్పారు అని సాగర్ అంటాడు. నర్మద సాగర్‌కి లాగిపెట్టి కొట్టి నేను బాధ పడుతున్నానా.. ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇలా మాట్లాడితే చంపేస్తా అని తిడుతుంది.
నర్మద ఏడ్వడంతో సాగర్ క్షమాపణ చెప్తాడు. నేను నమ్మింది నిన్ను నీ ప్రేమని.. నువ్వేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి కోట్లు సంపాదిస్తావని కాదురా.. రైస్మిల్లు ప్రాబ్లమ్ మా నాన్నని నాది కాదు అని ఏడుస్తుంది. నర్మద ఇదంతా వల్లీ పనే అని సాగర్ మనసులో వల్లీనే విషం నింపేసుంటుందని దాని సంగతి చెప్తా అని అనుకుంటుంది. ఉదయం నర్మద, ప్రేమలు పాయసం చేస్తూ వల్లీని ఇంటర్వ్యూకి పంపాలని అనుకుంటారు. నర్మద సాగర్‌ని వల్లీ రెచ్చగొట్టడం గురించి చెప్తుంది. ధీరజ్‌ని కూడా రెచ్చగొట్టి మా మధ్య గొడవలు పెట్టేసిందని ప్రేమ అంటుంది. నర్మద, ప్రేమలు అందరికీ పాయసం ఇచ్చి వల్లీ అక్క ఇంటర్వ్యూకి వెళ్తుందని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.