BiggBoss Season 9 Telugu Grand Finale Highlights : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు తుది దశకు చేరుకుంది. శుక్రవారం నుంచే.. ఫినాలేకి సంబంధించిన ప్రిపరేషన్స్, షూట్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పలువురు సెలబ్రెటీలు షోకి రానున్నారు. మరి ఎవరు ఈ గ్రాండ్ ఫినాలేకి వస్తున్నారో.. కళ్యాణ్‌కి తలకి గాయం ఎందుకు అయిందో.. ఇప్పుడు చూసేద్దాం.
బిగ్‌బాస్ సీజన్ 9 వందరోజులకు పైగా ప్రేక్షకులను అలరించింది. టాప్ 5 కంటెస్టెంట్లకు సంబంధించిన స్పెషల్ ఏవీలు కూడా వేసేశారు. చిల్ మోడ్‌లో ఉన్న కంటెస్టెంట్లు నచ్చిన స్కిట్స్ వేస్తూ ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఫినాలే సమయంలో కంటెస్టెంట్లు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పలువురు సెలబ్రెటీలు ఈవెంట్‌కు హాజరు అవుతున్నారు.
చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి..!
బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి విన్నర్‌ని అనౌన్స్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి (BiggBoss Season 9 Telugu Grand Finale Cheif Guest is Chiranjeevi) వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా చిరు రావడం విన్నర్‌ని అనౌన్స్ చేయడం చూశాము. ఈసారి కూడా చిరు వస్తున్నారనే న్యూస్ గట్టిగా వినిపిస్తుంది.
కళ్యాణ్ తలకు గాయం..!
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో మూవీ ప్రమోషన్స్ చేయడం కామన్. దీనిలో భాగంగానే నిధి అగర్వాల్ బిగ్‌బాస్ హోజ్‌లోకి వెళ్లింది. ఆ సమయంలోనే కళ్యాణ్ తలకు గాయం అయినట్లు బజ్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఎపిసోడ్ మొత్తం అతను ఆ బ్యాండేజ్‌తో కనిపిస్తాడని చెప్తున్నారు.
మూవీ ప్రమోషన్స్
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవి టీమ్ కూడా బిగ్‌బాస్ హోజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. శ్రీనిధి శెట్టి కూడా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ హోజ్‌లోకి వెళ్లింది. దీనికంటే ముందు శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు కూడా హోజ్లోపలికి వెళ్లి కంటెస్టెంట్లకు టాస్క్ పెట్టారు. నెక్స్ట్ సీజన్‌కి వచ్చే కంటెస్టెంట్స్‌కి ఇన్పుట్స్ పేపర్లో రాయమన్నట్లు తెలుస్తోంది.
శనివారం, ఆదివారం ఎపిసోడ్స్‌లో వీటిని ప్లే చేయనున్నారు. మరి విన్నర్ ఎవరు అయ్యారో.. ప్రైజ్ మనీ ఎవరికి వస్తుందో.. డబ్బులు ఏమైనా కంటెస్టెంట్లకు ఆఫర్ చేస్తారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.