Nindu Noorella Saavasam Serial Today Episode: బిడ్డతో ఇంటికి వచ్చిన భాగీకి దిష్టి తీసేందుకు వస్తుంది మంగళ. మంగళను దిష్టి తీయోద్దంటాడు రామ్మూర్తి. దీంతో అందరూ షాక్ అవుతారు.
అమర్: ఏంటి మామయ్య దిష్టి తీయోద్దంటున్నారేంటి..?
రామ్మూర్తి: నేను దిష్టి తీయోద్దనడం లేదు బాబు.. మంగళను తీయోద్దంటున్నాను..
మంగళ: దానికి దీనికి తేడా ఏంటో..?
రామ్మూర్తి: తేడా ఉంది. దిష్టి నిన్ను తీయోద్దన్నాను కానీ దిష్టే తీయోద్దు అనలేదు కదా..?
మంగళ: మరి నేను దిష్టి తీయకపోతే నువ్వు తీస్తావా..?
రామ్మూర్తి: నేనెందుకు తీస్తాను.. మన మనోహరి ఉంది కదా..? మనోహరి తీస్తుంది దిష్టి..
మను: అవునా నేనా…? నేను దిష్టి తీయడం ఏంటి.?
రామ్మూర్తి: అవునమ్మ మనోహరి నువ్వే దిష్టి తీయాలి. నీ ప్రాణ స్నేహితురాలు మళ్లీ పుట్టి మన ముందుకు వచ్చింది. నువ్వే దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలకమ్మా
అంటూ రామ్మూర్తి చెప్పగానే.. మనోహరి భయం భయంగా దిష్టి తీస్తుంది. తర్వాత భాగీకి పాపకు బొట్టు పెడుతుంది. పాపకు బొట్టు పెట్టినప్పుడు మనోహరికి షాక్ తగులుతుంది. వెంటనే భయపడుతూ దిష్టి నీళ్లు పారబోయడానికి బయటకు వెళ్లిపోతుంది. అందరూ లోపలికి వెల్లిపోతారు. మరోవైపు ఆరు ఆత్మ బేబీలోకి వెళ్లడానిక కారణమైన గుప్తను యముడు తిట్టి వెళ్లిపోతాడు. యముడు వెళ్లిపోయాక గుప్త హ్యాపీగా ఫీలవుతాడు.
గుప్త: బాలిక నీ జన్మ ధన్యం గత జన్మలో ఎచ్చట జన్మించితివో మరలా అచ్చటనో ప్రాణం పోసుకున్నావు.. ఆ జన్మలో నిన్ను అర్ధ ఆయుష్షు రాలిగా చేసి మా ప్రభువుల వారు మేము నీకు తీరని అన్యాయం చేసితిమి. మేము చేసిన తప్పిదమునకు ప్రాయశ్చితం ఎటుల చేసుకోవలెనో తెలియక సతమతం అయ్యాము. అందులకే ఆత్మగా నువ్వు భూలోకమును వచ్చుటకు అనుమతించితిమి.. నువ్వు చేయవలసిన కొన్ని పనుల కోసం నీకు కొన్ని శక్తులు ధారపోసితిమి. మేము ఎన్ని చేసినను నీవు కోల్పోయిన జీవితము నీకు ఇవ్వలేకపోతుమి.. నీ గురించి మా ప్రభువుల వారు చింతించని క్షణము లేదు. ఆ జగన్నాథుడి లీలతో ఇప్పుడు మా మనసు సంతషముగా ఉన్నది. నీకు మేము ఎవ్వరము చేయలేని న్యాయము.. నీకు నువ్వుగా చేసుకుంటువి. నీకు దూరం అయిన నీ కుటుంబమును మరలా నువ్వు చేరుకున్నావు.. ఇన్నాళ్లు నువ్వు ఏ కుటుంబం కోసం పరితపించితివో కష్టాలు పడితివో ఇప్పటి నుంచి ఆ కుటుంబమే నిన్ను కంటికి రెప్పలా కాపాడును ఇక నువ్వు సుఖః సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుము.. అమ్మా జగన్మాత శక్తి స్వరూపిని.. నీ సమక్షమున ప్రాణం పోసుకున్న ఈ బాలికకు నువ్వే రక్ష తల్లి. ఇన్నాళ్లు నీకు తోడుగా ఉన్నాము.. ఇక మేము మా లోకమునకు వెళ్లి మా కర్తవ్యమును నిర్వర్తించెదము.. సంతోషంగా జీవించుము.. శుభం భుయాత్
అంటూ గుప్త కూడా యమలోకానికి వెళ్లిపోతాడు. ఇక ఇంట్లో ఉన్న అంజు చెల్లితోనే టైం స్పెండ్ చేయాలని స్కూల్ రానని అమ్ము వాళ్లకు చెప్తుంది. దీంతో అమ్ము తిడుతుంది. డాడ్‌కు తెలిస్తే కొడతారని భయపెడుతుంది. ఎంత చెప్పినా అంజు వినదు. స్కూల్ రానంటే రాను అంటూ భాగీ రూంలోకి వెళ్లిపోతుంది. అక్కడ భాగీ చెప్పినా కూడా అంజు వినదు. ఇంతలో అమర్ రూంలోకి రావడంతో అంజు సైలెంట్‌గా ఉండిపోతుంది. పిల్లలు మాత్రం అమర్‌కు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!