Nindu Noorella Saavasam Serial Today Episode:   నువ్వు ఇంకా ఇక్కడే ఉండటం వల్ల నీ ఇంటికి ప్రమాదం పొంచి ఉందని.. గుప్త, ఆరుకు చెప్తాడు. దీంతో ఆరు కోపంగా గుప్తను తిడుతుంది. ప్రమాదం ఎలా వస్తుంది అని అడుగుతూ అసలు ఘోర లేనే లేడు. తాను నన్ను బంధించలేక ఓడిపోయి వెళ్లిపోయాడు అని అంటుంది. దీంతో గుప్త కోపంగా ఘోర ఓడిపోలేదని అది నీ ఊహ మాత్రమేనని మరింత శక్తిని కూడగట్టుకుని రాబోతున్నాడని హెచ్చరిస్తాడు. దీంతో ఆరు భయపడుతుంది. మరోవైపు  మనోహరి తన రూంలో కూర్చుని బాధపడుతుంది. అమర్‌ రూంలోకి ఇక రావొద్దని చెప్పిన శివరాం, నిర్మల మాటలు గుర్తు చేసుకుంటుంది.

మనోహరి: అసలు ఇదంతా జరగడానికి ఆ ఆరు కారణం. ఆది ఆ ఒక్కరోజు సైలెంట్‌గా ఉండి ఉంటే అమర్‌ నా మెడలో తాళి కట్టేవాడు. ఇప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని..

 అనుకుంటూ కోపంగా బాబ్జీకి ఫోన్‌ చేస్తుంది.

మనోహరి: బాబ్జీ ఎక్కడున్నావు

బాబ్జీ: మేడం మీరు చెప్పిన ఆ ఘోర కోసం వెతుకుతున్నాను. ఆ మనిషి కోసం వెతకని గుట్ట లేదు. ఎక్కని కొండ లేదు. ఆ మనిషి ఎక్కడ దాక్కున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. మీకు దండం పెడతాను ఘోరాను వెతకడానికి నాకు ఓపిక లేదు ఇక ఘోరాను వెతకడానికి వేరే ఎవ్వరినైనా చూసుకోండి మేడం.

మనోహరి:  నేను ఘోరా కోసం ఫోన్‌ చేయలేదు. నాకు ఇంకో పని చేయాలి.

బాబ్జీ: నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పాను కదా మేడం

మనోహరి:  నీకు 5 లక్షలు ఇస్తాను చేస్తావా..?

బాబ్జీ: ఐదు లక్షలు ఇస్తానంటే ఏమైనా చేస్తాను.. ఏం చేయాలో చెప్పండి మేడం.

మనోహరి: ఈసారి లారీ మళ్లీ నడపాలి.. ఆ మిస్సమ్మ మీదకు దాన్ని చంపేయాలి

అని మనోహరి చెప్పగానే బాబ్జీ సరే మేడం డబ్బులు మాత్రం లెక్క తప్పకూడదు అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు బాబ్జీ. పిల్లలు రూంలో సైలెంట్‌గా చదువుకుంటూ ఉంటారు. రూంలోకి భాగీ వస్తుంది.

భాగీ: పిల్లలు చదువుకుంటున్నారా..? మీరు ఈ టైంలో ఎక్కడ ఉండాలి..?

అంజు: మేడ మీద ఉండాలా.. మిస్సమ్మ?

అమ్ము: మిస్సమ్మ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు..

భాగీ: మీ డాడీ రూంలో ఒక్కరే ఉంటారు కదా..? మీరంతా డాడీతో స్పెండ్‌ చేయాలి

అమ్ము: మాకు డాడీతో టైమ్‌ స్పెండ్‌ చేయాలి. ఆడుకోవాలి. కబుర్లు చెప్పాలి అని ఉంటుంది కానీ ఎప్పుడూ డాడీ డిసిప్లీన్ గురించి చెప్పేవారు. మార్క్స్‌ గురించి తప్పా ఏదీ మాట్లాడేవారు కాదు అందుకే మాకు డాడీ అంటే భయం.

భాగీ: మీ అందరికీ ఒక విషయం చెప్తాను రండి.. మీ డాడీకి మీరంటే చాలా చాలా ఇష్టం.  ఇప్పుడు మీ అమ్మ లేరు కాబట్టి  మీ డాడీతో ఎవరు మాట్లాడతారు.

అంటూ భాగీ ఎమోషనల్‌ డైలాగ్స్‌ చెప్పగానే పిల్లలు అవును కదా.. అయితే వెళ్దాం పద డాడీ దగ్గరకు అని అందరూ అమర్‌ రూంలోకి వెళ్తారు. పిల్లలను చూసిన అమర్ నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతాడు. అవునని మీతో టైం స్పెండ్‌ చేద్దామని వచ్చాం అని చెప్తారు. దీంతో అమర్‌ పిల్లలను దగ్గరకు తీసుకుని వాళ్లతో హ్యాపీగా మాట్లాడుతుంటాడు. అమర్‌ నవ్వులు కింది దాకా వినిపిస్తుంటాయి. బయటి నుంచి హాల్‌లోకి వచ్చిన రాథోడ్‌.. అమర్‌ మనసారా నవ్వుకోవడం చూసి సంతోషిస్తాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!