Satyabhama Serial Today Episode విశ్వనాథం ఇంట్లో అందరూ అగాథంలా వచ్చిన కష్టాలు ఎవరో క్షణాల్లో తీసేసినట్లు తొలగిపోయావని సంతోషంగా మాట్లాడుకుంటారు. సత్య మామయ్యే కష్టాలను తొలగించారని కొత్త జీవితం ఇచ్చారని అనుకుంటారు. ఇక హర్ష నందినితో పెళ్లి అయి సంవత్సరం కాకముందే జీవితం అంటే ఏంటో చూపించేశావ్ అంటాడు. నందిని హర్ష వెంట పడుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు కానీ విశ్వనాథం డల్‌గా ఉండటం చూసి విశాలాక్షి భర్త దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతుంది. 


విశ్వనాథం: కష్టాలు ఇంకా తీరిపోయినట్లు అనిపించడం లేదు విశాలాక్షి. నువ్వు జీవితం చూస్తే నేను చదివేశాను. సత్య మనతో సంతోషం మాత్రమే చెప్తుంది కానీ బాధలు చెప్పదు.
విశాలాక్షి: అంటే సత్య కష్టాల్లో ఉందని అంటున్నారా.
విశ్వనాథం: కచ్చితంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు కనీసం చూడటానికి రాని పెద్ద మనిషి ఇప్పుడు స్వయంగా వచ్చి ఈ ఇళ్లు కొనిచ్చారు అంటే నమ్మేలా ఉందా. మన మీద ఎందుకు జాలి చూపించారు. ఒక్కసారి ఆలోచించు విశాలాక్షి సత్య పరిస్థితి అర్థమవుతుంది.
విశాలాక్షి: మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా సత్య ఏమైనా చెప్పిందా.
విశ్వనాథం: నేను దాయడం కాదు విశాలాక్షి సత్య దాస్తుంది. ఒక్క రోజు కోడలు పుట్టింటికి వస్తే అత్త వచ్చి గోల చేయడం ఏంటి. మామగారు వచ్చి ఆపేక్ష కురిపించడం ఏంటి నీకు అనుమానం రావడం లేదా. మనల్ని చుట్టు ముట్టింది దేవుడు ఇచ్చిన కష్టాలు కాదు ఆ మహదేవయ్య ఇచ్చిన కష్టాలు. నిజంగా తన మామయ్య వల్ల మనకు కష్టాలు తొలగి ఉంటే సత్య ముఖంలో సంతోషం కనిపించనే లేదు. ప్రశాంతంగా ఉండలేకపోతున్నా విశాలాక్షి. కచ్చితంగా సత్య కష్టాల్లో ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
సత్య: మామయ్య చెప్పింది నిజమే వాళ్ల నాన్నకి వ్యతిరేకంగా నేను ఎలక్షన్‌లో నిలబడుతున్నాను అని క్రిష్‌కి తెలిస్తే ఊరుకోడు. ఆ గొడవ ఎక్కడివరకు వెళ్తుందో. ఈ నిజం ఎలా చెప్పాలి. 
క్రిష్: ఏంటి సత్య డల్‌గా ఉన్నావ్ మీ పుట్టింటి సమస్య మా బాపు తీర్చేశాడు కదా ఇంకేంటి. రేపో మాపో మా బాపు ఎమ్మెల్యే అవుతాడు. మన అందరి లెవల్ పెరుగుతుంది. 
సత్య: నీ భార్య ఎమ్మెల్యే అయినా ఇంత సంతోషపడతావా. సరదాగా అడిగా.
క్రిష్: తెలుసు సంపంగి. ఎవరైనా సాధ్యం కానివి ఇలా కలలు కంటారు నువ్వు అంతే అని అర్థమైందిలే. అయినా నా భార్య ఎమ్మెల్యే అయితే నా కాళ్లు నేల మీద ఉండవు. తిండి నిద్ర మాని నా భార్యని గెలిపిస్తా.
సత్య: అంటే మీ బాపుని వదిలేస్తావా ఎందుకంటే ఇద్దరికీ ఒకే సారి ప్రచారంలో పాల్గొవడం కష్టం కదా.
క్రిష్: ఎందుకు కుదరదు నీ ప్రచారం కలలో కదా నేను నీ లాగే కలలో నీ కోసం ప్రచారం చేస్తా. 


ఉదయం క్రిష్ పడుకొని ఉంటే సత్య లేపి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తుంది. అర్థరాత్రి చెప్పలేదని క్రిష్ అంటే ఇంకా ఆ టైంకి మనం పడుకోలేదని చెప్తుంది. ఇక క్రిష్‌కి తల స్నానం చేయించాలి నలుగు పెట్టాలి అని సత్య అంటే క్రిష్ అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. పరుగులు పెడతాడు. ఇక సత్య ఆరుబయట క్రిష్ స్నానం కోసం అన్నీ ఏర్పాటు చేస్తుంది. క్రిష్ అక్కడే బుట్ట కింద చాప కింద దాక్కుంటాడు. క్రిష్‌ని చూసేసిన సత్య సినిమాలో చూపించినట్లు స్నానం చేయిస్తూ సరసాలు ఆడాలి అనుకున్నా ఈ కృష్టకి అదృష్టం లేదని కావాలనే అంటుంది. దాంతో క్రిష్ బయటకు వచ్చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!