Nindu Noorella Saavasam Serial Today Episode: అర్ధరాత్రి వర్షంలో అడవిలో చిక్కుకుపోయిన అమర్‌ ఫ్యామిలీకి భాగీకి డెలివరీ ఫెయిన్స్‌ రావడం మరో టెన్షన్‌ అవుతుంది. దీంతో అందరూ కంగారు పడుతుంటే.. అక్కడే దగ్గరలో ఒక గుడి కనిపిస్తుంది. ఆ గుడి దగ్గరకు భాగీని ఎత్తుకుని వెళ్తాడు అమర్. అక్కడ భాగీకి డెలివరీ అవుతుంది. కానీ పుట్టిన బిడ్డ కదలదు.. ఏడ్వదు.. దీంతో చంభా బిడ్డను చేతుల్లోకి తీసుకుని చూస్తుంది.

Continues below advertisement

చంభా: ( మనసులో) బిడ్డ కదలడం లేదేంటి..? కొంపదీసి చనిపోయిందా..? అయ్యో బిడ్డ కదలడం లేదు.. చనిపోయినట్టు ఉంది

అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.

Continues below advertisement

అమర్: బిడ్డ చనిపోవడం ఏంటి..?

చంభా: అవును సార్‌ బిడ్డ చనిపోయింది.

అని చెప్పగానే.. అమర్‌ బాధగా బిడ్డ పక్కనే కూలబడిపోతాడు. రామ్మూర్తి బాధగా అమ్మవారిని చూస్తూ గంట కొడుతుంటాడు. పిల్లలు ఏడుస్తుంటారు. అక్కడే ఉన్న ఆరు కూడా ఏడుస్తూ.. గుప్తతో బాధపడుతుంది.

గుప్త: నేను ముందే చెప్పాను కదా బాలిక ఈ రోదన చూడటానికే నువ్వు ఇక్కడ ఉన్నావా..? నీ వాళ్ల బాధను చూడటానికే నువ్వు ఇక్కడి దాకా వచ్చావా..?

ఆరు: లేదు గుప్త  గారు ఏదో ఒకటి చేయాలి.. నా వాళ్ల బాధను నేను చూడలేకపోతున్నాను.. ఏదో ఒకటి చేయాలి గుప్త గారు

గుప్త: ఏం చేస్తావు బాలిక.. విధిరాతను మారుస్తావా..? అయినా అంత శక్తి నీకుందా బాలిక..

ఆరు: నాకు అంత శక్తి లేకపోవచ్చు గుప్త గారు కానీ ప్రయత్నం మాత్రం చేస్తాను.. గుప్తగారు.. నా వాళ్ల బాధను నేను చూడలేకపోతున్నాను.. ఆ బిడ్డను ఎలాగైనా బతికించాలి గుప్తగారు..

గుప్త: బాలిక నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు.. ఇది విధిరాత ఇలాగే జరగాలని రాసి పెట్టి ఉంది. నువ్వు మార్చాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది బాలిక.

ఆరు: ఎప్పుడూ విధి రాత అని చెప్పి నన్ను ఆపేస్తారు గుప్త గారు.. మరి నా చావు విషయంలో మీరు విధి రాతను ఎందుకు ఫాలో కాలేదు.. నా పునర్జన్మ విషయంలో మీరు ఎందుకు అబద్దం చెప్పారు

అంటూ ఆరు ప్రశ్నించగానే..గుప్త మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో ఆరు తన దగ్గర ఉన్న గుప్త ఉంగరం పట్టుకుని మంత్రం చదువుతుంది. ఆ మంత్రం చదవగానే.. ఆరు ఆత్మ భాగీకి పుట్టిన బిడ్డలోకి వెళ్తుంది. వెంటనే బిడ్డ ఏడుస్తుంది.  ఆ ఏడుపు విని అందరూ ఆశ్చర్యపోతారు. తర్వాత హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి మాత్రం షాకింగ్‌ గా అలాగే చూస్తుంటుంది. తర్వాత భాగీ హాస్పిటల్‌లో ఉంటుంది. డాక్టర్‌ చెక్‌ చేస్తుంటుంది. చెక్‌ చేసిన తర్వాత డాక్టర్‌ బయటకు వస్తుంది.

అమర్: డాక్టర్‌ ఇప్పుడు ఎలా ఉంది…

డాక్టర్‌: నో ప్రాబ్లమ్‌ అమర్‌ గారు.. తల్లీ బిడ్డ అవుటాప్‌ డేంజర్‌.. ఈవెనింగ్‌ మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు..

అమర్‌: ఒకే థాంక్యూ డాక్టర్‌.. రాథోడ్‌.. ఈవెనింగ్‌ డిశ్చార్జ్ చేస్తారట.. ఆ ఏర్పాట్లవో చూడు..

రాథోడ్‌: అలాగే సర్‌

అంటూ రాథోడ్‌ వెళ్లిపోతాడు. సాయంత్రం అందరూ ఇంటికి వస్తారు. మంగళ వెళ్లి భాగీకి, బిడ్డకు దిష్టి తీయబోతుంటే.. రామ్మూర్తి అపేస్తాడు. మంగళను దిష్టి తీయోద్దంటాడు. ఎందుకని అమర్‌ అడగ్గానే.. మనోహరి దిష్టి తీయాలని తన ప్రాణ స్నేహితురాలు కొత్తగా ప్రాణాలు పోసుకుని మళ్లీ జన్మించింది కదా అందుకే మనోహరి తనకు దిష్టి తీయాలని చెప్తాడు. దీంతో మనోహరి దిష్టి తీసి భాగీకి బొట్టు పెడుతుంది. తర్వాత పాపకు బొట్టుపెట్టగానే.. మనోహరికి షాక్‌ తగులుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!