Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరును తీసుకుని వెంటనే యమలోకానికి వెళ్లాలనుకుంటాడు గుప్త. అయితే ఆరు మాత్రం గుప్త ఎంత చెప్పినా వినకుండా భాగీకి డెలివరీ అయ్యేవరకు ఇక్కడే ఉందామని ప్రాధేయపడుతుంది. గుప్త వద్దని వారిస్తుంటాడు.
ఆరు: గుప్త గారు ఫ్లీజ్..నీ ఈ ఒక్క కోరిక తీర్చండి.. ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఏ కోరిక అడగను..
గుప్త: సరే బాలిక నువ్వు ఎంత చెప్పిన వినడం లేదు కాబట్టి.. నా చేతిలో చేయి వేసి మాట ఇవ్వుము.. ఇకపై ఏ కోరిక కోరనని
ఆరు: అలాగే గుప్త గారు..
అంటూ ఆరు, గుప్త చేతిలో చేయి వేసి ఇకపై ఏ కోరిక కోరనని మాటిస్తుంది. దీంతో గుప్త ఆశ్చర్యపోతాడు.
గుప్త: సరే బాలిక ఆ శిశువు మరణం అనివార్యం అని మేము చెప్పినను నీవు ఇచ్చటనే ఉండి వీక్షించ దలిచితివి ఆ విపత్తు చూసి నువ్వు రోదించుటకు సిద్ద పడినప్పుడు మేము మాత్రం ఏమీ చేయగలం.. మా యమధర్మరాజు వారు మాకు ఎటువంటి శిక్షనైనను విధింపనివ్వుము.. నీతో పాటు మేమును ఇచ్చటనే వేచి ఉందుము.. నీ శోకము తీరిన పిదపనే మా లోకమునకు వెళ్లెదము
ఆరు: చాలా థాంక్స్ గుప్త గారు.. అయితే మనం కూడా ఇప్పుడే మా వారితో పాటు వెళ్దామా..?
గుప్త: వాళ్లు చాలా దూరం వెళ్లిపోయారు బాలిక.. పైగ వర్షం రాబోతుంది..
అంటూ గుప్త అనుమానంగా చూడగానే..
ఆరు: ఏమైంది గుప్త గారు ఏం జరగబోతుంది.. చెప్పండి గుప్త గారు..
గుప్త: ఏం లేదు బాలిక.. విపత్తు మొదలైంది.. నీ సహోదరికి బిడ్డ పుట్టే వేళయింది…
అని గుప్త చెప్పగానే.. ఆరు భయంగా గుప్తగారు మనం వెంటనే నా చెల్లి దగ్గరకు వెళ్లాలి పదండి అంటుంది. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక అమర్ వాళ్లు అడవిలోకి వెళ్లాక వర్షం ఎక్కవై కారు బురదలో ఇరుక్కుపోతుంది. అమర్ కారు ఆపేస్తాడు.
అమర్: నేను దిగి చూస్తాను మీరెవరూ కారు దిగకండి
భాగీ: ఏమైందండి కారు కదలడం లేదు
అమర్: టైరు బురదలోనే ఇరుక్కుపోయింది. మీరు కారులోనే కూర్చోండి నేను ట్రై చేస్తాను.
రాథోడ్: ఏమైంది సార్
అమర్: చూడు రాథోడ్.. ఏమైందో..?
రాథోడ్: సార్ కారు బాగా ఇరుక్కుపోయినట్టు ఉంది సార్ ఇప్పుడెలా.. మీరు స్టార్ట్ చేయండి సార్ నేను నెడతాను ఎక్కండి సార్
అమర్ కారు స్టార్ట్ చేస్తాడు. ఇంతలో రామ్మూర్తి వస్తాడు.
రామ్మూర్తి: ఏమైంది రాథోడ్ అల్లుడు గారు ఎక్కడ..? (అమర్ కారులోంచి బయటకు వస్తాడు.) బాబు ఊరు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నేను వెళ్లి ట్రాక్టర్ తీసుకొస్తాను
అంటూ వెళ్లిపోతుంటే.. భాగీ ఏడుస్తుంది. బాగా ఫెయిన్స్ వస్తున్నాయని చెప్తుంది. ఇంతలో మంగళ వచ్చి చూసి ఇవి డెలివరీ ఫెయిన్స్ అని చెప్తుంది. అందరూ కంగారు పడుతుంటారు.
రామ్మూర్తి: బాబు ఆ పక్కన ఏదో గుడి ఉన్నట్టు ఉంది. అక్కడికి తీసుకెళ్దాం
అమర్: నేను భాగీని ఎత్తుకుని వస్తాను మీరు పిల్లలను తీసుకుని వెళ్లండి..
అందరూ గుడి లోపలికి వెళ్తారు. ఫెయిన్స్ తో భాగీ బాధపడుతూనే ఉంటుంది. ఇంతలో భాగీకి డెలివరీ అవుతుంది. పుట్టిన బిడ్డను చూసిన చంభా బిడ్డ కదలడం లేదు.. అంటే ప్రాణాలతో లేదేమో అంటుంది. ఆ మాటలకు ఆమర్ దగ్గరకు వెళ్లి చూసి పక్కనే కూర్చుని బాధపడుతుంటాడు. పిల్లలు, రామ్మూర్తి ఏడుస్తుంటారు. మనోహరి, చంభా మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఆరు ఏడుస్తూ… మంత్రం చదివి పాపలోకి ప్రవేశిస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!