Illu Illalu Pillalu Serial Today Episode సాగర్ నర్మద దగ్గరకు మల్లెపూలు తీసుకొని వెళ్తాడు. సాగర్ వాలకం చూసి నర్మదకు సాగర్ తాగినట్లు అనుమానం వస్తుంది. సాగర్‌తో ఊదించి తాగావా అని అడుగుతుంది. ఫ్యాన్స్ చెప్పడంతో తప్పలేదు అని అంటాడు. బాగా ఎక్కిందని నర్మద అంటే ఇప్పుడు కాదు నిన్ను చూసినప్పుడే ఎక్కేసింది అని నర్మదని పొగిడేస్తాడు. 

Continues below advertisement

ధీరజ్ కూడా మత్తులోనే గదిలోకి వెళ్తాడు. డ్యాన్స్ వేసుకుంటూ ఉంటాడు. గోడ మీద ప్రేమ డ్రస్ చూస్తాడు. అక్కడేం చేస్తున్నావే.. అర్థరాత్రి కూడా పిశాచిలా తిరుగుతావు కదా అప్పుడే గోడ ఎక్కేశావేంటే అని అంటూ ఉంటాడు. ఇంతలో ప్రేమ వచ్చి పక్కనే నిల్చొంటుంది. ప్రేమని చూసి అక్కడుండాల్సిన దానివి ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. ప్రేమ చేతులు కట్టుకొని నిల్చిని అలా చూస్తూ ఉంటే ఏంటే ఆ చూపు చూపు తిప్పు అని అంటాడు. ఏంటే నోరు లేస్తుంది పొట్టిదానా.. ఇంత ఉంటావ్ నా మీదే బుసలు కొడతావా అని అంటాడు. భలే క్యూట్‌గా ఉన్నావే కుందేలు పిల్ల అని బుగ్గలు గిల్లేస్తాడు. నీ కోపమే కాదు నీ అల్లరి కూడా చాలా అందంగా ఉంటుందే.. నీ కళ్లు నీ పెదాలు అని అసలు నిన్ను ఇలా కాదే అని ప్రేమని ముద్దు పెట్టుకొని హగ్ చేసుకుంటాడు.

ప్రేమ ఇచ్చిన బట్టలు చలిలో వతుకుతూ వల్లీ వణికిపోతూ ఉంటుంది. ప్రేమని తిట్టుకుంటూ ఉతుకుతూ ఉంటుంది. ఇక ధీరజ్.. ప్రేమ, సాగర్, నర్మదలు ఏంటిబే ఎట్టాగ ఉంది ఒళ్లు అని స్టెప్పులేస్తారు. అది చూసిన వల్లీ మీరు మీ మొగుళ్లతో డ్యాన్సింగ్‌లు చేస్తూ నాతో బట్టలు ఉతికిస్తారా.. నేను మా ఆయనతో డ్యాన్సింగ్‌లు కడతా.. రొమాన్స్‌లు చేస్తా అని అక్కడి నుంచే డ్యాన్స్ వేసుకుంటూ గదిలో ఉన్న చందు దగ్గరకు వెళ్తుంది. 

Continues below advertisement

చందు అమూల్య, విశ్వల విషయం ఆలోచిస్తూ డల్‌గా ఉంటాడు. వల్లీ వయ్యారంగా భర్త దగ్గరకు వెళ్తుంది. భర్త చేయి పట్టుకొని బా అంటే అమూల్య విషయం నాకు అర్థం కావడం లేదు వల్లీ అని అంటాడు. వల్లీ సైలెంట్‌గా పక్కకి వచ్చి తల బాదుకుంటుంది. భర్తని తిట్టుకుంటూ బయటకు వస్తుంది. అక్కడే అమూల్య లోకం మర్చిపోయి విశ్వతో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉండటం చూస్తుంది. తిరుపతి కూడా తన సుందరిని గుర్తు చేసుకొని సంతోషంగా ఉంటాడు అది చూసిన వల్లీ అందరూ ఎవరి సంతోషంలో వాళ్లు ఉన్నారు నేను మాత్రం ఇలా అని తలబాదుకుంటుంది. 

చందు ఉదయం అయినా సరే అమూల్య, విశ్వల విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. విషయం తనకు తెలిసిన తర్వాత కూడా నాన్నకి చెప్పలేకపోతున్నా అని అనుకుంటాడు. అసలే విశ్వ చెత్త వెధవ మా కుటుంబం మీద పగతో ఉన్నాడు.. మళ్లీ నా చెల్లిని ఏమైనా చేస్తే అని అనుకుంటాడు. ఇంతలో అమూల్య కాలేజ్‌కి రెడీ అయి బయటకు వచ్చి విశ్వ వినేలా.. కాలేజ్‌కి బయల్దేరుతున్నా అని సిగ్నల్ ఇస్తుంది. అది చందు చూస్తాడు. అది చూసిన చందు పరిస్థితులు చేజారిపోయేలా ఉన్నాయ్.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు వెంటనే నాన్నకి చెప్పేయాలి అని ఇంట్లోకి వెళ్లి రామరాజుని పిలుస్తాడు. వేదవతిని తండ్రి గురించి అడుగుతాడు. ఏమైందిరా అని వేదవతి అడిగితే తల్లికి చెప్పడు.. నాన్న వస్తే చెప్తా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.