Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీని చంపేందుకు మనోహరి బాంబు పెట్టిందన్న విషయం అరుంధతికి తెలుస్తుంది. దీంతో ఎలాగైనా బాంబు తీసేయాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఆరును గుప్త వద్దని ఆపేస్తాడు.
ఆరు: ఏంటి గుప్త గారు ఆ బాంబు పేలితే నా చెల్లి.. మా నాన్న, పిల్లలు ఇక్కడున్న వారందరికీ ప్రమాదం.. పెద్ద విధ్వంసమే జరిగిపోతుంది
గుప్త: ఆ విషయం మీకు మేము ముందే చెప్తిమి కదా బాలిక
ఆరు: ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా కాపాడాలి గుప్త గారు
గుప్త: వద్దు బాలిక అది మనము చేయునది కాదు.. మనం మా లోకానికి బయలుదేరవలెను
ఆరు: కంగారుగా మా వాళ్లందరినీ ప్రమాదానికి వదిలేసి ఎలా రావాలి గుప్త గారు..
గుప్త: జరగబోవునది విధికి వదిలి వేయవలయును బాలిక
ఆరు: లేదు గుప్త గారు.. నాకిచ్చిన మీ అంగుళీకమతో నేను ఈ ప్రమాదాన్ని ఆపేస్తాను..
అంటూ ఆరు మంత్రం చదువుతుంది.
గుప్త: బాలిక ఆపుము.. మా మాట వినుము విధికి ఎదురు వెళ్లరాదు..
ఆరు: వాళ్లను కాపాడలేకపోతే నేను ఉండి వేస్ట్ గుప్త గారు
గుప్త: వారి భవిష్యత్తును విధికి వదిలివేయుము.. తక్షణమే నువ్వు మాతో బయలుదేరి మా లోకమునకు రమ్ము అచ్చట రానిచో మా పై ఒట్టు
ఆరు: గుప్త గారు ఏంటిది..? మీరు ఒట్టు వేయడం ఏంటి.?
గుప్త: నీ మంచి కోరే చెప్తున్నాను బాలిక బయలుదేరుము
గుప్త వెనకాలే ఆరు బయలుదేరుతుంది. ఇంతలో భాగీ కడుపులో ఉన్న బిడ్డ ఆరును పిలుస్తుంది.
బిడ్డ: పెద్దమ్మ మా అమ్మను కాపాడకుండా వెళ్లిపోతావా..?
ఆరు: గుప్త గారు.. చూశారా..? నా చెల్లి కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుంది. మీరు ఆ మాటలు విన్నారా..?
బిడ్డ: ఇక్కడ ఉన్న అందరినీ కాపాడకుండా వెళ్తారా..?
ఆరు: విన్నారా..? గుప్త గారు.. ఇక్కడున్న వాళ్లను కాపాడమంటుంది. ఆ పసిబిడ్డ కోసమైనా మనం అందర్నీ కాపాడాలి గుప్త గారు. ఫ్లీజ్ గుప్త గారు..
గుప్త: ఆ బిడ్డ మృత్యువు ముంగిట ఉన్నది బాలిక.. మృత్యుదేవత ఇచ్చటకు వచ్చునది ఆ బిడ్డ కోసం బాలిక ఇచ్చట మనం నిమిత్తమాత్రుల వలే ఉండవలెను తప్ప విధిని అడ్డగించరాదు.. విధిని అనుసరించుటే సృష్టి నియమం..
ఆరు: అదేంటి గుప్త గారు అలా అంటున్నారు.. ఇంకా భూమ్మీదకు రాని ఈ పసిబిడ్డను చూస్తూ చూస్తూ చావుకు అప్పగించి వెళ్లాలా..? నన్ను నోరారా పెద్దమ్మ అని పిలుస్తుంది.. కాపాడమని వేడుకుంటుంది కనికరించండి గుప్త గారు
గుప్త: సృష్టి నియమాలను దాటి మనం విధికి ఎదురెల్లరాదు అది అసాధ్యం బాలిక మా మాట విని మాతో బయలుదేరుము లేనిచో విధ్వసం కాదు ప్రళయమే వచ్చును
ఆరు: కనీసం ఈ టైంలో మా ఆయన కూడా ఇక్క డ లేరు గుప్త గారు..
గుప్త: ఎవరు ఉన్ననూ.. లేకున్ననూ ఎవరు దేనిని ఆపలేరు బాలిక
పద ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ చెప్పగానే.. ఆరు, గుప్తను ఫాలో అవుతుంది. అమర్ చెప్పడంతో రాథోడ్, మనోహరి ఇద్దరూ కలిసి బాంబు కోసం వెతుకుతుంటారు. తప్పేది లేక మనోహరే బాంబు సీటు కింద ఉందని చెప్తుంది. ఇంతలో అమర్ బాంబు స్వ్కాడ్ తీసుకుని వస్తాడు. వాళ్లు బాంబు తీసుకుని వెళ్లిపోతారు. అమర్ ఫ్యామిలీని తీసుకుని సిటీకి బయలుదేరుతాడు. మధ్యలో వర్షం వస్తుంది. వర్షం పెద్దగా రావడంతో కారు బురదలో ఇరుక్కుపోతుంది. ఇంతలో భాగీకి డెలివరీ ఫెయిన్స్ మొదలవుతాయి. నొప్పితో విలవిలలాడుతుంది. ఏం చేయాలో అర్థం కాక అమర తల పట్టుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!