Nindu Noorella Saavasam Serial Today Episode:  ఆరుంధతిని యమలోకం వెళ్దామని గుప్త అడుగుతాడు. తను ఇక్కడే ఉంటే లేనిపోని అనర్థాలు జరుగుతాయని చెప్తాడు. అయినా సరే ఆరు వినదు.

ఆరు: నా గడువు ఇంకా ఉంది కదా..? అప్పటి వరకు నేను రాను

గుప్త: బాలిక నీ మంచి కోరి చెప్తున్నాను. మా మాటను ఆలకింపుము

భాగీ అక్కా అంటూ పిలుస్తూ లోపలి నుంచి వస్తుంది.

ఆరు: భాగీ రా.. ఏంటి భాగీ అలా ఉన్నావు

భాగీ: ఆ చిత్ర ఏం చేసిందో తెలుసా.?

ఆరు: ఏ చేసింది

భాగీ: తనుకు ఏ మాత్రం అనుభవం లేకపోయినా..మా ఆయన దగ్గర లక్షలు తీసుకుని వినోద్‌ తో చీరల వ్యాపారం పెట్టిస్తుంది.

ఆరు: మంచిదే కదా భాగీ ఆ బిజినెస్‌లో వాళ్లు డెవలప్‌ అయితే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడతారు.

భాగీ: నాకు అసలు అలా అనిపించడం లేదు అక్కా ఇందాక వాళ్లు పెట్టబోయే శారీ షోరూంకి వెళ్లి వచ్చాం. అక్కడ ఏదో గోల్‌మాల్ జరుగుతున్నట్టు ఉంది.

ఆరు: మరి మీ వారికి చెప్పకూడదా.?

భాగీ: ఆయనకు కూడా అదే అనుమానంగా ఉంది అక్క కానీ చిత్ర ఎవరి మాట వినడం లేదు. పాపం అనవసరంగా  వినోద్‌ను ఆయన దగ్గర తల దించుకునేలా చేస్తుందేమో..?

ఆరు: అలా ఏం జరగదులే భాగీ నువ్వు కంగారు పడకు

భాగీ: అనుభవం లేని పని చేస్తే వచ్చేది నష్టమే కదా అక్కా.. అప్పటికీ వాళ్లకు ఎక్స్‌పీరియెన్స్‌ కోసం టైం ఇవ్వమని ఆయనతో నేను చెప్పాను. ఆయనేమో డబ్బుల కన్నా రిలేషన్‌ ముఖ్యం అంటున్నాడు.

ఆరు: అది కూడా నిజమే కదా భాగీ ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలే ముఖ్యం కదా

భాగీ: ఆర్థిక సంబంధాలు బాగుంటేనే మానవ సంబంధాలు బాగుంటాయి అక్క.. ఎంత క్లోజ్‌ రిలేషన్‌ అయినా డబ్బుల దగ్గరే ప్రాబ్లమ్స్‌ వస్తాయి. వాళ్ల వ్యాపారంలో లాభాలొస్తే  ఓకే కానీ నష్టాలొస్తే.. మోసపోతే.. చిత్ర ఏదోలా తప్పించుకుంటుంది వినోదే బలైపోతాడు. అసలు ఆ చిత్రకు ఎలా నచ్చజెప్పాలో నాకు అర్థం కావడం లేదు అక్క..

అప్పుడే కారులో బయటి నుంచి మనోహరి వస్తుంది.

ఆరు:  చిత్రకు మనోహరితో చెప్పించొచ్చు కదా… వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌ కదా

భాగీ: ఇప్పుడు చిత్ర ఎవ్వరినీ లెక్క చేసే పరిస్థితుల్లో లేదు అక్కా

మను కారు దిగి మిస్సమ్మను చూసి ఇది ఆరుతో మాట్లాడుతుందా..? అనుకుంటుంది.

భాగీ: ఏంటి మనోహరి అలా చూస్తున్నావు.. నువ్వు చిత్రకు సర్ది చెప్పాలని అక్క చెప్తుంది. అక్కా మనోహరికి నువ్వైనా చెప్పు

అంటుండగానే మనోహరి భయంతో పారిపోతుంది. నా మాట ఎవ్వరూ వినడం లేదు అని భాగీ వెళ్లిపోతుంది. తర్వాత చిత్ర బిజినెస్‌ ప్రమోషన్‌ కోపం.. వాళ్లు తమది సిటీలోనే నెంబర్‌ వన్‌ యాడ్‌ ఏజెన్సీ అని చెప్తారు. మేము చేసే యాడ్స్‌ తో మీ బిజినెస్‌ సక్సెస్‌ అవుతుంది. లక్షల్లో సంపాదిస్తారు అని చెప్తారు. మా బిజినెస్‌ నడవడం కాదు పరుగెత్తాలి లక్షల్లో కాదు కోట్లల్లో టర్నోవర్‌ రావాలి అంటుంది చిత్ర. అయితే ఒక టాప్‌ హీరోయిన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా తీసుకోవాలి అని యాడ్‌ ఏజెన్సీ వాళ్లు చెబితే ఏమీ వద్దని నేనున్నాను కదా హీరోయిన్ల కన్నా నేను బాగానే ఉంటాను అని చిత్ర చెప్పగానే రాథోడ్‌ పగలబడి నవ్వుకుంటాడు. చిత్ర కోపంగా చూస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!