Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి చిత్రగుప్తని నిలదీస్తుంది. మిస్సమ్మకి అసలు తనని వివాహం చేసుకోవడం ఇష్టం ఉందో లేదో అని అడుగుతాడు. అందుకు అది దైవ నిర్ణయము ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్తుంది. ఆ బిహారి గ్యాంగ్ మనోహరి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి పెళ్లి అయినంతవరకు ఉండి, చూసి భోజనం చేసి వెళ్ళండి అని చెబుతాడు. పెళ్లి మండపం మీద అమరేందర్ ఆలోచిస్తూ ఉంటాడు. కళ్యాణ వేదిక బయట అరుంధతి లోపలికి ఎలా వెళ్ళాలి అని తిరుగుతూ ఉంటుంది. పిల్లలు మిస్సమ్మ పెళ్లిలోకి ఎలా వచ్చేమో, ఎలా ఆపాలో ఆలోచిస్తూ ఉంటారు. పెళ్ళి కుమారుడిని తీసుకుని రండి అని పంతులుగారు అనడంతో అమరేందర్ ని రాథోడ్ పట్టుకెళ్తాడు. మిస్సమ్మని పిల్లలు ఏదో ఒకటి చేయమని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. 


పిల్లలు: మిస్సమ్మ.. మిస్సమ్మ డాడ్ కూడా వచ్చేసారు ఏదో ఒకటి చెయ్యి మిస్సమ్మ ప్లీజ్ 


మిస్సమ్మ: ఇందాక నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి చెయ్యి అని నస పెడుతూనే ఉన్నారు. ఆ ఒకటి ఏంటి మీకు తెలిసి చెప్పండి ఇప్పుడే అది చేసేస్తా . 


పిల్లలు: ఆ ఒక్కటి ఏదో తెలియనప్పుడు మాకెందుకు పెళ్లి ఆపుతానని చెప్పి ప్రమాణం తీసుకుని ఇక్కడికి పట్టుకొచ్చావు . 


మిస్సమ్మ: అదే అర్థం కాక అప్పటినుండి ఇప్పటివరకు ఆలోచిస్తూనే ఉన్నాను. ఆగండి అయ్యో. 


పిల్లలు: నువ్వు అలా ఆలోచిస్తూ ఉంటే పెళ్లి కూడా అయిపోతుంది మిస్సమ్మ..


పిల్లలు: ఈ పెళ్లి జరగకూడదు మిస్సమ్మ. మనోహరి ఆంటీ అంటే మాకు ఇష్టం లేదు.


పిల్లలు:  అలాంటిది అమ్మ స్థానం మనోహరీకి ఎందుకు ఇస్తాం.


పిల్లలు: మా లాస్ట్ హోప్ నువ్వే మిస్సమ్మ.. ప్లీజ్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్ 


పిల్లలు: ఎలా అయినా మనోహర్ ఆంటీ నుండి మమ్మల్ని మా డాడీ ని కాపాడవా..


మిస్సమ్మ: మీకు ఇంటి దగ్గర ఎందుకు మాటిచ్చానో తెలియదు కానీ ఇప్పుడు చెప్తున్నా... మీ డాడీ మనోహర్ మెడలో తాళి కట్టడు. .


పిల్లలు: నీ దగ్గర ప్లాన్ లేదు ఇందాక మాట్లాడింది కూడా గుర్తులేదు అంటున్నావు. 


పిల్లలు: ఇప్పుడు మాట్లాడేది ఇంకా సేపటికి గుర్తు లేదు అంటున్నావు. అలాంటప్పుడు నీ మాట ఎలా నమ్ముతాము. 


పిల్లలు: పైగా పెళ్లి పీటల వరకు వచ్చేసింది. 


పిల్లలు: డాడీ పీటల మీద కూర్చున్నాడు మిస్సమ్మ. ఇంకాసేపు అయితే మనోహరీ ఆంటీ కూడా కూర్చుంటుంది. 


పిల్లలు: ఇప్పుడు చెప్పు మిస్సమ్మ పెళ్లి ఎలా అవుతావు. 


మిస్సమ్మ: ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తా ఏదో ఒకటి వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు... అప్పుడు అప్పుడు ఆ తాళి నేనే కట్టించేసుకుంటా...


మిస్సమ్మ: అప్పుడు పెళ్లి ఆగిపోతుంది. ఆ మనోహరి కూడా ఇంకోసారి పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయదు. మీరు కూడా ఎలాంటి పిచ్చి పిచ్చి... 


పిల్లలు: ఏంటి మిస్సమ్మ అలా అన్నావు 


మిస్సమ్మ: నేనెందుకు అలా అన్నాను... అసలు ఏమైంది నాకు తెలియకుండా.. ఎక్కడపడితే అక్కడికి వచ్చేస్తున్నాను...  ఏది పడితే అది  మాట్లాడేస్తున్నా... .


పిల్లలు: తెలియకుండా అలా ఎలా మాట్లాడుతావ్ మిస్సమ్మ 


మిస్సమ్మ: మా ఇంట్లో ఉండాల్సింది నేను ఇక్కడ ఎలా ఉన్నాను పిల్లలు, తెలియకుండానే మీ ఇంటికి వచ్చా. తెలియకుండానే మీకు ఈ పెళ్లి ఆపుతానని మాటిచ్చా.. తెలియకుండానే ఈ మండపం లోకి అడుగుపెట్టా. ఇప్పుడు కూడా అలాగే ఏదో మాట్లాడేశా. పిల్లలు నన్ను కాసేపు వదిలేస్తే ఏదో ఒకటి చేసి ఆపేస్తాను. సరేనా ప్లీజ్... అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.


ఆలోచనలో పడుతుంది. అలా బయటకు వచ్చిన మిస్సమ్మ దేవుడిని ఏదో ఒక మార్గం చూపించమని వేడుకుంటుంది. భాగ్య వాళ్ల నాన్న గబగబా లోపలి నడుస్తూ ఉంటాడు. మంగళ గాబరా పడకు మెల్లిగా వెళ్ళు అంటుంది. పెళ్లి ఏమి జరగదులే అని అంటుంది మంగళ. అది దైవ నిర్ణయం దేవుని నిర్ణయానికి ఎవరు ధిక్కరించలేము అని భాగ్య వాళ్ల నాన్న  భయపడుతుంటాడు. మంగళ ఇంతలోగా వాళ్ళిద్దరూ బావ మరదలు అని నోరు జారుతుంది. గట్టిగా అడిగేసరికి మాట మార్చేస్తుంది. నేను అనవసరంగా ఇరుక్కున్నాను బాధపడుతుంది .అరుంధతి ఏదో ఒక హోప్ తో  తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి భాగ్య వాళ్ళ నాన్న వస్తాడు. నా కూతురు పెళ్లి లోపల జరుగుతూ ఉంది దాన్ని ఎలాగైనా ఆపాలని అంటాడు.