Nindu Manasulu Serial Today Episode  కోర్టు సీన్ మొదలవుతుంది. ప్రేరణ, సిద్ధూ నేరం చేసినట్లు నిరూపణ అయింది.. ఇద్దరూ నిర్దోషిలు అని తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రేరణ, సిద్ధూలకు శిక్ష వేయడానికి జడ్జి తీర్పు ఇచ్చే టైంకి రంజిత్ ఎంట్రీ ఇస్తాడు. 

Continues below advertisement

రంజిత్‌ ఎంట్రీతో గణకు పెద్ద షాకే తగులుతుంది. రంజిత్ జడ్జిని క్షమించమని అడిగి సాక్షిని తీసుకొచ్చానని అందుకే తీర్పు ఇచ్చే టైంకి ఆపానని అంటాడు. సాక్షి ఎవరు అని జడ్జి అడిగితే రంజిత్‌ పరాంకుశాన్ని తీసుకొస్తాడు. పరాంకుశం బోనులోకి వచ్చి ప్రేరణ, సిద్ధూలకు ఈ కేసుకు ఏం సంబంధం లేదని ఆ టైంలో ఇద్దరూ విశ్వనాథ్‌ గారి ఇంట్లో పరీక్ష రాస్తున్నారని నేను చూశానని చెప్తాడు. ఏం జరిగిందో చెప్పు అని జడ్జి అడగటంతో పరాంకుశం తాను గీసిన డ్రాయింగ్ వాళ్లతో కొనిపించాలని చెప్పి వెళ్లానని అప్పటికే వాళ్లు పరీక్ష రాసున్నారని ఎంత సేపటికి వాళ్లు బయటకు రాకపోవడంతో వాళ్లకి తెలీకుండా రీల్ చేసుకొని వెళ్లిపోయానని అంటాడు.

సిద్ధూ, ప్రేరణలు అక్కడే ఉన్నట్లు మీకు ఎలా తెలుసు.. ఎన్ని గంటలకు చూశారు టైం ఎంత అని గణ లాయర్ అడిగితే పరాంకుశం 10 నుంచి 11 మధ్యలో అంటాడు. పరాంకుశంతో సిద్ధూ వాళ్లు చివరి నిమిషంలో తీసుకొచ్చి ఇలా చెపిస్తున్నారని.. అసలు వాళ్లని విశ్వనాథం గారి ఇంట్లో ఉన్నారని ఎలా నమ్మాలి.. నీతో అలా చెప్పిస్తున్నారు అని అంటారు. దాంతో పరాంకుశం తన దగ్గర వీడియో ఉందని ప్రేరణ, సిద్ధూ పరీక్ష రాస్తున్నప్పుడు ఉన్న వీడియో చూపిస్తాడు. జడ్జి నమ్మే టైంకి మళ్లీ లాయర్ ఆ వీడియో కచ్చితంగా అదే టైంలో తీసింది అని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నిస్తాడు. వాళ్లిద్దరూ నేరం చేసి తప్పించుకోవడానికి అలా చేసుండొచ్చు అని పీపీ అంటారు. జడ్జి కూడా నిజమే కదా అని అనుమానం వ్యక్తం చేస్తారు. 

Continues below advertisement

సిద్ధూ, ప్రేరణ మేం ఏం తప్పు చేయలేదు అంటారు. జడ్జి వాళ్లతో సాక్ష్యాలు అన్నీ మీరు నేరం చేసినట్లే ఉన్నాయి అని అంటారు. అప్పుడు రంజిత్ మాట్లాడుతాడు. మరోసారి ఆ వీడియో జాగ్రత్తగా చూడమని జడ్జితో చెప్తాడు. అందులోనే ఇద్దరూ పరీక్ష రాస్తున్నప్పుడు ఉన్న వీడియోలో డిజిటల్ క్లాక్ ఉంది అందులో టైం డేట్ ఉంది.. ఇద్దరూ 10:45కి పరీక్ష రాస్తున్నట్లు ఉంది చూడండి అంటాడు. సిద్ధూ, ప్రేరణ, విజయానంద్, ఇందిర, సుధాకర్ అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. గణ ముఖం మాడిపోతుంది. 

ప్రేరణ, సిద్ధూ ఏ తప్పు చేయలేదని జడ్జి తీర్పిస్తారు. తప్పుడు కేసు వేసినందుకు పోలీసులకు మందలించి పెద్దావిడని చంపిన వాళ్లని పట్టుకోమని పోలీసులకు చెప్తారు. గణ తల దించుకుంటాడు. ప్రేరణ, సిద్ధూలు గణని చూసి తల ఎగరేస్తారు. బయట విశ్వనాథ్ సిద్ధూ వాళ్లతో మీ గురించి నాకు తెలుసు అందుకే తప్పు చేయలేదు అని చెప్పడానికి వచ్చాను కానీ నా సాక్ష్యం చెల్లకపోయినా మీ నిజాయితీ మీకు కాపాడింది అని అంటారు. మీరు మమల్ని నమ్మారు అది చాలు సార్ అంటారు. ఇక ఆయన వెళ్లిపోయిన తర్వాత రంజిత్, ఐశ్వర్య, ఇందిర వాళ్లు సిద్ధూ, ప్రేరణలతో మాట్లాడుతుంటే గణ ఇందిరను చూస్తాడు. సరిగ్గా మరోసారి చూసే టైంకి సుధాకర్ అడ్డుగా నిల్చొంటాడు. తర్వాత చూసే సరికి ఇందిర దాక్కుంటుంది. గణ మనసులో ఇది అదేనా అని అనుకుంటాడు. 

గణ ఇంటికి బయల్దేరుతాడు. వెంటనే తల్లికి కాల్ చేసి ఇంట్లో పని మనిషి ఉందా.. ఉందో లేదో చూసి త్వరగా చెప్పు అని అంటాడు. ప్రేరణ, సిద్ధూలు రంజిత్‌కి థ్యాంక్స్ చెప్తే ఐశ్వర్య వాళ్లతో మీరు బయటకు రావడానికి నా సాయం కూడా ఉంది నాకు థ్యాంక్స్ చెప్పండి అంటారు. ఇక సిద్ధూ, ప్రేరణలు పరాంకుశానికి థ్యాంక్స్ చెప్తారు. సుధాకర్ ఇందిర దగ్గరకు వెళ్లి ఆ గణ నిన్ను చూసేశాడు అని అంటాడు. దీంతో ఇవాళ్టి  ఎపిసోడ్ పూర్తయిపోతుంది.