Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున నేత్ర కోసం ఏరియా మొత్తం వెతుకుతుంది. కనిపించే వాళ్లందరికీ ఫొటో చూపించి అడుగుతుంది. రాహుల్ తండ్రి దగ్గరకు చాలా సంతోషంగా వెళ్తాడు. దేవాని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తున్నారని సాక్ష్యాలు అన్నీ పక్కాగా ఉన్నాయ్ ఈ కేసులో వాడికి బెయిల్ రావడం ఈ జన్మలో వాడు బయటకు రావడం జరగదు అని అంటాడు.
లలిత ఏడుస్తుంది. అర్థం లేకుండా ఎందుకు ఏడుస్తున్నావ్ అని హరివర్ధన్ అడిగితే అల్లుడి జీవితం నాశనం అయిపోతే ఎలా ఏడ్వకుండా ఉండాలి అని లలిత అంటుంది. ఆ రౌడీని అల్లుడు అనడం పనికి మాలిన కేసులో అరెస్ట్ అయిన వాడి కోసం ఏడ్వడం ఇంకా దరిద్రం అని త్రిపుర అంటుంది. దేవా అలా ఎప్పటికీ చేయడు అని లలిత అంటుంది. మరి రాత్రి ఎందుకు ఓ ఆడపిల్ల ఇంటికి వెళ్తాడు అని రాహుల్ అంటాడు. దేవా జైలుకి వెళ్తే మిథున జీవితం చీకటి అయిపోతుందని ఏదో ఒకటి చేయమని లలిత అంటే వాడు జైలుకి వెళ్తే మిథున జీవితం వెలుగులోకి వస్తుంది. వాడిని వదిలేసి మిథున కొత్త జీవితం గడుపుతుంది. అనవసరంగా వాడు జైలుకి వెళ్తున్నాడు అని బాధ పడకు అని హరివర్ధన్ అంటాడు.
నేత్ర పార్కులో వెయిట్ చేస్తుంటే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఆదిత్య నేత్రని చంపేయాలి అని అనుకుంటాడు. నువ్వు టైంకి చెప్పావ్ కదా లేదంటే ఆ మిథున నన్ను చంపేసేది నన్ను వేరే ఎక్కడో దాక్కోమని అన్నావ్ కదా త్వరగా పంపించు అని అంటుంది. పోవడానికి నువ్వు ఇంత ఆరాట పడితే పంపకుండా ఎలా ఉంటాను అని ఆదిత్య రౌడీలను పిలుస్తాడు. నేత్ర వాళ్లని చూసి వీళ్లంతా ఎవరు నా సెక్యూరిటీనా అని అంటుంది. ఆదిత్య నేత్రతో నేను బతికి ఉండాలి అంటే నువ్వు బతికి ఉండకూడదు. మిథునని నేను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు చావాలి అని అంటాడు. నన్ను నేను కాపాడుకోవడం కోసం ఇంత సాయం చేసిన నిన్ను చంపకతప్పడం లేదు అని అంటాడు. నేత్ర షాక్ అయి నీకు సాయం చేయాలి అనే కదా దేవా మీద నేను కేసు పెట్టింది కానీ నువ్వు నన్ను చంపేయడం ఏంటి నన్ను వదిలేయ్ అని అడుగుతుంది. ఎవరి కంటా పడకుండా దూరంగా వెళ్లిపోతా నన్ను వదిలేయ్ అని బతిమాలుతుంది. అయినా ఆదిత్య నేత్రని చంపేయమని అంటాడు.
నేత్రని రౌడీలు పట్టుకుంటారు. దేవాని కోర్టుకి తీసుకెళ్తుంటారు. ఇక మిథున నేత్ర కోసం మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఎస్‌ఐ దేవాతో నీ భార్య నీ కోసం పోరాడి పోరాడి ఏడుస్తూ ఉంటుంది. నీకు జైలు శిక్ష పక్కా. ఇక నాకు నా డార్లింగ్‌కి మధ్య ఎవరూ అడ్డురారు. అసలు నిన్ను కోర్టుకి తీసుకెళ్లకుండా ఇక్కడే చంపేస్తే నాకు నా డార్లింగ్‌కి మధ్య ఎప్పటికీ ఎవరూ రారు కదా అని అంటాడు. దేవా కోపంగా నా భార్య గురించి ఇంకొక్క మాట నీ నోటి నుంచి వస్తే నీ గన్‌తో నిన్ను కాల్చి చంపేస్తా అని అంటాడు.
నేత్రని రౌడీలు తరుముతుంటే మిథున ఎంట్రీ ఇస్తుంది. రౌడీలను చితక్కొట్టి తరిమేస్తుంది. నేత్ర ఏడుస్తూ అక్క నువ్వు రాకపోయి ఉంటే వీళ్లు నన్ను చంపేసేవాళ్లు అని ఏడుస్తుంది. మిథున నేత్రని కొట్టి ఎదుటి వాళ్లని మోసం చేయాలి అని చూస్తే ఇలాగే జరుగుతుంది అని తిడుతుంది. నేత్ర ఏడుస్తుంది. నువ్వు డీజీపీ దగ్గరకు వచ్చి నిజం ఒప్పుకోవాలి.. లేదంటే నిన్ను వాళ్లు కాదు నేను వదలను అని అంటుంది. నేత్ర ఒప్పుకోవడంతో నేత్రని తీసుకొని డీజీపీ దగ్గరకు వెళ్తుంది. నేత్ర అతనితో డబ్బు కోసం ఇలా చేశానని చెప్తుంది. దేవా దగ్గర డబ్బు లేదు కదా నీ వెనక ఎవరు ఉన్నారో చెప్పు అని మిథున అడుగుతుంది. ఆదిత్య బెదిరించడం గుర్తు చేసుకొని ఆదిత్య పేరు చెప్పదు. నా వెనక ఎవరూ లేరు నేను దేవాని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అని అందుకే ఇలా చేశానని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.