Nindu Manasulu Serial Today Episode  గణ ప్రేరణ, సిద్ధూలతో నేను చాలా మంచోడిని అందుకే మీకు ఓ అవకాశం ఇచ్చా.. మీ ఫోన్స్ మీకే ఇచ్చేశా.. అవకాశం వాడుకోండి.. సాక్ష్యాలు తీసుకురండి అని అంటాడు. సుధాతో వీళ్లకి భోజనం పెట్టు.. స్టేషన్ భోజనం రుచి చూపించు అని సుధాకర్‌తో చెప్తాడు.

విజయానంద్ ఇంటికి వెళ్లి సిద్ధూ తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని.. సిద్ధూని అటమ్‌ టూ మర్డర్ కేసు కూడా పెట్టారని అంటాడు. సిద్ధూ కలలో కూడా అలాంటి పనులు చేయడు.. మీరేం చేయలేరా.. ఈ డబ్బు ఈ హోదా ఈ పరపతి ఎందుకు అండీ. మన బిడ్డ మీద కేసు పెడితే ఏం చేయలేక తిరిగి వచ్చారంటే నేనేం అనుకోవాలి అని మంజుల ఫైర్ అయిపోతుంది. ఎలా అయినా మన కొడుకుని బయటకు తీసుకురండి అని చెప్తుంది. 

సాహితి తండ్రితో డాడీ మీరు ఎలా అయినా అన్నయ్యని బయటకు తీసుకురాకపోతే పోయేది మీ పరువే.. దా గ్రేట్ బిజినెస్ మెన్ విజయానంద్ కొడుకు దొంగతనం కేసులో ఇరుక్కుంటే మీరు తీసుకురాలేకపోయారని తెలిస్తే మన పరువు పోవడమే కాకుండా బిజినెస్‌లో కూడా నష్టం వస్తుందని అంటుంది. గట్టిగా ప్రయత్నిస్తా.. నా ఇన్ఫ్యూలెన్స్ అంతా వాడి మన అబ్బాయిని బయటకు తీసుకొస్తా అని విజయానంద్ వెళ్తాడు. 

ఐశ్వర్య రంజిత్ తన ఫోన్ తీసుకోవడంతో కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో కరెంట్ పోతే గట్టి గట్టిగా ఓనర్ గారు అని అరుస్తుంది. రంజిత్ కూల్‌గా వచ్చి భయం ఎందుకు కరెంట్ ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో లేనప్పుడు అక్కడే ఉంటుంది. వెళ్లి క్యాండిల్ వెలిగించుకో అంటాడు. నాకు భయం అని ఐశ్వర్య అనడంతో రంజిత్ కొవొత్తి వెలిగించి తీసుకొస్తాడు. ఇక ఐశ్వర్య ఫోన్ అడిగితే ఫోన్ ఏంటి అంటే మీరు నా ఫోన్ తీసుకున్నారు.. మా అమ్మ ఇంకా రాలేదు ఫోన్ చేసుకోవాలి అంటే నేను ఎవరి ఫోన్ తీసుకోను అని రంజిత్ అంటాడు. మీరు మర్చిపోయారు సార్ అని ఐశ్వర్య అంటే సరే నాకు గుర్తొస్తే ఇస్తాను అని అంటాడు. 

సిద్ధూకి కుమార్ కాల్ చేస్తాడు. గణ సిద్ధూతో నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా మాట్లాడుకోండి అని అంటాడు. సిద్ధూ కుమార్‌తో మాట్లాడుతాడు. కుమార్ సిద్ధూతో సీసీ టీవీ ఫుటేజ్ ఎవరో డిలీట్ చేసేశారని చెప్తాడు. సిద్ధూ షాక్ ప్రేరణకు చెప్తాడు. గణ నవ్వుకుంటాడు. వెటకారంగా మీరు ఇంత ప్రయత్నిస్తున్నా సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు దేవుడు మీ మీద పగ పట్టాడు అంటే.. దేవుడు కాదు ఓ దుర్మార్గుడు మా మీద పగపట్టాడు. అని సిద్ధూ అంటాడు. అవును అవును ఎవడో బాగా పగపట్టేశాడు అంటాడు. 

విశ్వాసం మరో సారి వస్తాడు. ఏంటి మీ సార్ మళ్లీ వచ్చాడా అని గణ అడిగితే ఒకసారి బయటకు రండి సార్ అని విశ్వాసం అంటాడు. గణ బయటకు వెళ్తాడు. విజయానంద్ లాయర్‌ని తీసుకొచ్చి బెయిల్ తీసుకొచ్చామని అంటాడు. గణ కోపంగా నాకు రాకరాక వచ్చిన అవకాశం సార్ మీరు ఒక్క పేపర్‌తో తీసుకెళ్లిపోతా అంటే ఎలా సార్ అని అంటాడు. అవకాశం మళ్లీ మళ్లీ వస్తుంది. మనం ఒకటి అనుకుంటాం అవన్నీ అవ్వవు కదా.. నీ మాటలకు నీ మనసు ఒప్పుకోదని నాకు తెలుసు కానీ లాయర్‌ని ఒప్పుకోవాలి కదా అంటాడు.

 గణ లోపలికి వెళ్లి సిద్ధార్థ్‌ని ఉద్దేశించి వీడు చాలా అదృష్టవంతుడు వీడిని మూసేయడానికి అన్నీ ఏర్పాట్లు చేసినా బెయిల్ ఇవ్వడానికి లాయర్ వచ్చాడు.. ఉదయం నుంచి వీడిని వదిలేయమని రికమండ్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్లు నా స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నారు. గ్రేట్.. మర్రిచెట్టులాంటి మనుషులు కూడా వీడి కోసం తగ్గి మాట్లాడుతున్నారు. వీడి టైం బాగుంది నువ్వు వెళ్లిపో అని అంటాడు. సిద్దూ కోపంగా చూసి నేను రాను.. ఎవరో బెయిల్ ఇస్తే వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. దీని వెనక ఎవరు ఉన్నారో నాకు తెలుసు.. ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలుసు.. ఒకరి రికమండేషన్ మీద ఆధారపడి నా క్యారెక్టర్ చంపుకొని నేను వెళ్లను మేం తప్పు చేశాం అన్నారు కదా.. నేరారోపణ చేశారు కదా మేం నేరస్తులమో కాదో కోర్టు తేల్చాలి. రేపు మేం కోర్టుకి వస్తాం.. నేరం రుజువు అయితే శిక్ష అనుభవిస్తాం.. లేదంటే గర్వంగా బయటకు వెళ్తాం అని సిద్ధూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.