Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మిథున గురించి ఆలోచిస్తూ జైలులో  ఏడుస్తూ ఉంటాడు. నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం మిథున.. నేను నిన్ను ఎంత ద్వేషిస్తుంటే నువ్వు అంత ప్రేమిస్తున్నావ్.. నిన్ను నీ ప్రేమని దూరం చేసుకోవడం అంటే ప్రాణం వదిలేసుకోవడమే కానీ తప్పడం లేదు మిథున అని అనుకుంటూ ఏడుస్తాడు. 

Continues below advertisement

మిథున కూడా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది.  ఆ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడో పరీక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు దేవా.. కలిపినట్లే కలిపి దూరం చేస్తున్నాడు. నువ్వు మనసులో నన్ను ప్రేమిస్తూనే ఎందుకు దూరం పెడుతున్నాడో తెలీడం లేదని ఒక వైపు బాధ మరోవైపు చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తూ నలుగురిలో నవ్వుల పాలవుతున్నావని మరోవైపు  బాధగా ఉందని అనుకుంటుంది. నీ ప్రేమ నాకు వరమైతే నా ప్రేమ నీకు శాపం కాకూడదు అని మీ నాన్న భయం నిజం కాకూడదని నా ప్రేమని నాలోనే చంపేసుకుంటున్నా అని దేవా అనుకుంటుంది. మన ప్రేమని నేను బతికించుకుంటా దేవా అని మిథున అనుకుంటుంది. 

దేవాని విడిపించుకోవడానికి ఒక్క దారి అయినా దొరికితే చాలు అని మిథున ఏడుస్తూ ఆలోచిస్తుంది. ఎవరిని అడగను ఏమైయిందని అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో ఇద్దరూ ఏడ్వడం చూస్తే నిజంగా సీతారామంలో సీతలాగే మిథున అనిపిస్తుంది.  ఉదయం మిథున చెత్త వేయడానికి బయటకు వస్తుంది. ఇంతలో చెత్తా తీసుకొనే ఆవిడతో నేత్ర కోపంగా మాట్లాడి డబ్బు విసిరేయడంతో చూసి మిథున ఆవిడ దగ్గరకు వెళ్తుంది. ఏమైందని అడుగుతుంది. నేత్రకు మందు అలవాటు ఉందని తాగిన బాటిల్స్ కవర్‌లో వేసి  ఇవ్వకుండా పగలగొట్టి వేస్తుందని పెంకులు గుచ్చుకొని చేతులకు గాయం అవుతుందని అంటుంది. తను అలాంటి అమ్మాయి కాదని మిథున అంటే లేదమ్మా.. అని రోజు తనలో ఇదే తంతు అని బాటిల్స్ చూపిస్తుంది. మిథున షాక్ అయిపోతుంది. 

Continues below advertisement

మిథునకు డౌట్ వచ్చి నేత్ర ఇంటికి వెళ్తుంది. తాళం వేసి ఉండటంతో ఇంటి చుట్టూ వెతుకుతుంది. బయట నుంచి డోర్ తీసి నేత్ర ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ చాలా ఐడీ కార్డులు ఉండటం చూసి షాక్ అవుతుంది. నేత్ర పేరు ఒక ఐడీ కార్డులో నవీన అని మరో దాంట్లో కవితా అని మూడో కార్డులో మాధవి అని ఉండటం చూసి మిథున షాక్ అయిపోతుంది.  మిథునకు డౌట్ వచ్చి ఏదో గూడుపుటానీ ఉందని అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. 

మరోవైపు చాలా రోజుల తర్వాత సీన్‌లోకి భానుమతి వస్తుంది. పోలీస్‌ స్టేషన్‌కి ఆటో వేసుకొని వచ్చి ఎవరు నా రాజాని అరెస్ట్ చేసింది.. ఒక్కొక్కరి సంగతి చెప్తా అని అంటుంది. దేవాని చూసి రాజా రాజా అని అంటుంది. నువ్వెందుకు వచ్చావే ఉన్న తలనొప్పి సరిపోదా అని అంటుంది. భాను కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి కత్తి ఉంటే ఇవ్వు అన్న లేదంటే పెద్ద గన్‌ ఉంటే ఇవ్వు అన్న అంటుంది. గన్ తీసి హడావుడి చేస్తుంది. గన్ ఎందుకు అంటే వాడిని చంపేస్తా అన్న అంటుంది. ఇలాంటి వాడిని వదలకూడదు అన్న అని అంటుంది. కానిస్టేబుల్‌ గన్ తీసుకుంటాడు. భాను ఏడుస్తూ కాదన్నా వీడు ఇలాంటి వాడు కాదు.. మస్త్ మంచోడు.. అని ఎమోషనల్ అయిపోతుంది. నువ్వేంట్రా ఇలా నువ్వు శ్రీరాముడు అనుకున్నా.. పోరి జోలికి పోవడం ఏంట్రా.. అర్థమైంది మిథున టార్చర్ పడలేక పక్కింటి పోరి దగ్గరకు వెళ్లావ్ కదా.. అయినా 13 ఏళ్లగా నీ వెంట పడుతున్నా నన్ను తాకలేదు కూడా అలాంటిది ఇలా చేశావ్ అంటే నమ్మలేకపోతున్నా అంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లవే అని దేవా అంటే నేను పోవడానికి రాలేదు నిన్ను తీసుకుపోవడానికి వచ్చా అని అంటుంది. 

ఎస్‌ఐ రావడంతో దేవాని రిలీజ్ చేయండి మీ మంచి కోసమే చెప్తా.. వెంటనే రిలీజ్ చేయకపోతే మీరు మస్త్ ప్రాబ్లమ్‌లో పడతారు. నాకు కోపం వస్తే మీ జాబ్ నుంచి తీయించేస్తా అని అంటుంది. మేడం నాకు జాబ్ నుంచి తీయించేస్తారంట  ఎవరికి చెప్తావ్ మేడం అంటే నాకు ఎమ్మెల్యే తెలుసు పీఎం తెలుసు అంటుంది. ఓహో పీఎంకి చెప్తావా సరే ఫోన్ చేసి చెప్పి నా జాబ్ తీయించే అని ఎస్‌ఐ అంటాడు. ఎక్కువ చేస్తే నిన్ను బొక్కలో పెడతా అంటాడు. భాను ఓవర్ చేయడంతో ఎస్‌ఐ కానిస్టేబుల్‌లో మేడం పేరు మీద ఉన్న ఆటో కేసులు బయటకు తీయ్‌ అంటాడు. కానిస్టేబుల్ లెక్క చెప్పడంతో జైలులో పడేయండిరా అని అంటాడు. దాంతో భాను సార్ కేసులు వద్దు మీ పని మీరు చేసుకోండి అని దండం పెట్టి వెళ్లిపోతుంది. 

మిథున తన ఫ్రెండ్‌ని కలుస్తుంది. నేత్రకు సంబంధించి ఒక ఐడీ కార్డు చూపించి తను మీ ఆఫీస్‌లో పని చేస్తుందా అని అంటుంది. ఆ అమ్మాయి ఆఫీస్ ఎంప్లాయ్‌ లిస్ట్‌లో చెక్ చేసి లేదని చెప్తుంది. నేత్ర జాబ్‌ ఐడీ కార్డులు అన్నీ ఫేక్ అని మిథున తెలుసుకుంటుంది. ఇంతలో ఒకబ్బాయి వచ్చి నేత్ర ఫొటో చూసి తను గతంలో ఒకబ్బాయిని ట్రాప్ చేసి రేప్ కేసు పెట్టింది జైలుకి కూడా వెళ్లిందని చెప్తాడు. ఇంటర్‌నెట్‌లో ఉన్న వీడియో చూపిస్తాడు. మిథున బిత్తరపోతుంది. దొరికేసింది.. పోలీసులు తనని అరెస్ట్ చేసే వీడియో క్లియర్‌గా ఉంది.. ఇది చాలు అని మిథున అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.