Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, ఐశ్వర్యలు గణ తండ్రిని తీసుకొని గుడికి రావడం చూస్తారు. అందరూ అర్చన చేసుకోవడానికి వెళ్తారు. ఇదేం ఖర్మరా దేవుడా అని సుధాకర్ అనుకుంటాడు. ఐశ్వర్య ప్రేరణతో అక్క నాన్న దగ్గరకు వెళ్లాలి అని ఉంది కానీ భయంగా ఉందని అంటుంది. దానికి ప్రేరణ మనం నాన్న పేరున అర్చన చేయించడానికి వచ్చా భయపడాల్సిన అవసరం లేదు దండం పెట్టుకో అంటుంది.
ఐశ్వర్య తండ్రి పక్కనే ముసుగు వేసుకున్న ఇందిరని చూసి అమ్మలా ఉందే అనుకుంటుంది. ఐశ్వర్యకు డౌట్ వచ్చిందని సుధాకర్ ఇందిరకు చెప్పడంతో ఇందిర బయటకు వెళ్లిపోతుంది. దాంతో ఐశ్వర్య ఇప్పుడే వస్తా అని తల్లి వెనకాలే వెళ్తుంది. అమ్మేనా కాదో తెలుసుకోవాలని అనుకుంటుంది. కుమార్ తన లవర్ శైలుని పరిచయం చేయడానికి సిద్ధూని గుడికి తీసుకెళ్తాడు. ముగ్గురు ఓ చోట కూర్చొని మాట్లాడుతారు.
ఇందిర పరుగెత్తి దీని నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు. అయినా నేను ఎందుకు భయపడటం మ్యానేజ్ చేస్తా అని ఓ చోట నిల్చొంటుంది. ఐశ్వర్య వెళ్లి పలకరిస్తే నాన్న భర్త్‌డే అని అర్చన చేయించాలని వచ్చానని అంటుంది. నాన్న ఇక్కడే ఉన్నారు అమ్మా అని ఐశ్వర్య అంటే ఇందిర హ్యాపీగా ఫీలైనట్లు నటిస్తుంది. నాన్న దగ్గరకు వెళ్దామని ఐశ్వర్య అంటే వాళ్లు ఉన్నారు కదా అనేస్తుంది. నీకు ఎలా తెలుసు అని కూతురు అడిగితే వాళ్లే కదా నాన్నని తేవాలి మీ నాన్న ఉన్న పరిస్థితిలో ఒక్కరే రాలేరు కదా అంటుంది. ఇక ఐశ్వర్య తండ్రిని చూడటానికి ఇందిరని పిలిస్తే వస్తా కానీ నేను ఎవరో తెలీనట్లు ఉండు అక్క కూడా ఆ గణని నా గురించి తెలిస్తే ప్రమాదం అని చెప్పింది కదా అంటుంది. దాంతో ఐశ్వర్య సరే అయితే ఎవరో తెలీనట్లు ఉందాం అని అంటుంది. ప్రేరణ ఐశ్వర్యతో అమ్మని ఎందుకు తెచ్చావ్ అంటే అమ్మ వచ్చింది సరే ఆ గణకి అమ్మ తెలిస్తే ప్రమాదం అని మనం ఎవరో తెలీనట్లు ఉండమని అంటుంది.
పంతులు అందర్ని పిలిచి గోత్రం, పేరు చెప్పమని అంటే ప్రేరణ చెప్పబోతే ఐశ్వర్య ఆపుతుంది. ప్రేరణ భయపడొద్దని చెప్పి మా నాన్న పేరు పంతం రాజశేఖరం, గోత్రం పైడిపాల గోత్రం అని చెప్తుంది. గణ వాళ్లు షాక్ అయి కోపంగా చూస్తారు. తర్వాత గణ కూడా అవే చెప్తాడు. దానికి పంతులు ఒకే ఇంటి నుంచి వచ్చారా.. ఒకేసారి చెప్పొచ్చు కదా అని అంటే ఈశ్వరి అది వేరు ఇది వేరు అని అంటుంది.
ఇక సిద్ధూ వాళ్లు మీటింగ్ పెడతారు. శైలు తనకు ప్రేమ విషయంలో భయం అని నువ్వే హెల్ప్ చేయాలి అన్నయ్యా అని సిద్ధూని అడుగుతుంది. మీ నాన్న ఎవరు అని సిద్ధూ అడిగితే శైలు చెప్పే టైంకి శైలుకి ఫోన్ రావడంతో ఆగిపోతుంది. ఇద్దరి ప్రేమకి సపోర్ట్ చేస్తా అని సిద్ధూ అంటాడు. శైలు మినిస్టర్ కూతురు. ఆ విషయం కుమార్‌తో పాటు సిద్ధూకి కూడా తెలీదు.
ప్రేరణ వాళ్లు అర్చన అయిపోయిన తర్వాత ఇందిర రాజశేఖరానికి బొట్టు పెడుతుంది. ఈశ్వరి చూడకుండా సుధాకర్ కవర్ చేస్తాడు. ఇక ప్రేరణ, ఐశ్వర్యలు తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటామని అంటే గణ, ఈశ్వర వద్దని అంటారు. సుధాకర్ ఆపడానికి అసలు మీరు ఎవరు సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అని అంటే మేం ఎవరో మీకు చెప్తే చాలా.. అందరికీ చెప్పాలా అని అంటుంది. మేం ఎవరో అందరికీ తెలియాలి అనే మాకు కూడా ఉంది.. మేం ఎవరో చెప్పాలి అనుకుంటే మమల్ని ఆపి గొడవ చేయ్ లేదంటే మమల్ని వదిలేయ్ అంటుంది. గుడిలో గొడవ అయితే అందరికీ ప్రేరణ వాళ్ల గురించి తెలిసిపోతుందని గణ ఆగిపోతాడు. ప్రేరణ గణ ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరి కూతుళ్ల మీద భర్తతో ఇందిర అక్షింతలు వేయిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.