గుండెనిండా గుడిగంటలు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ (Gunde Ninda Gudi Gantalu September 12 Episode)
బాలు మీనా పెళ్లిరోజు వేడుక ఘనంగా జరిగింది. ఎవరు ఎంత ఇబ్బందిపెడదాం అని చూసినా, అవమానించాలని చూసి ఆత్మవిశ్వాసంతో తిప్పికొట్టారు బాలు, మీనా. అంతా అయ్యాక ఎవరికి వారు రెస్ట్ తీసుకునేందుకు రెడీ అవుతారు. నిద్రవస్తోంది మేడపైకి పరుపు తీసుకురా అనిబాలు చెప్పడంతో షాక్ అవుతుంది సుశీలమ్మ. ఇంట్లో ఏం జరుగుతోంది అసలు అని నిలదీస్తుంది. మనోజ్-రోహిణి ఓరూమ్, శ్రుతి రవి ఓ రూమ్, మిగిలిన మూడో రూమ్... ప్రభావతి తీసుకుందని తెలుసుకుని ఇదెక్కడి చోద్యం అని కడిగేస్తుంది. పొద్దున్నే లేచి రోహిణి, శ్రుతి ఉద్యోగానికి వెళ్లాలికదా అని అప్పుడు కూడా కవర్ చేస్తుంది ప్రభావతి.. అందరికన్నా ముందు నిద్రలేచేది మీనా...ఇంట్లో ఖర్చులకు అందరికన్నా ఎక్కువ డబ్బు ఇస్తున్నది బాలు అని గట్టిగా నిలదీస్తుంది. శ్రుతి-రవి తమ రూమ్ త్యాగం చేసేందుకు సిద్ధమవుతారు కానీ బాలు మీనా వద్దని చెప్పి మేడెక్కిపోతారు. కొడుకు సత్యం దగ్గరకు వెళ్లి మాట్లాడిన సుశీలమ్మ...బాలు కోసం మేడపై రూమ్ కట్టించమని చెబుతుంది. అందుకు అవసరం అయిన డబ్బులు తానిస్తానని హామీ ఇస్తుంది.
సుశీలమ్మ మాటలు విని విసురుగా వెళ్లిపోయిన ప్రభావతి ఆలోచనలో పడుతుంది. మేడపై రూమ్ కట్టిస్తే బాలు మీనాను ఎప్పటికీ ఇంట్లోంచి పంపించలేను..అందుకే ఇన్నాళ్లూ రూమ్ కట్టకుండా అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తూ వచ్చాను..ఇప్పుడు రూమ్ కడితే ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తుంది. పైగా మీనా పొద్దున్నే మేడపైనుంచి దిగకపోతే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు..అందుకే రూమ్ కట్టేందుకు అడ్డం పడాలని ఫిక్సవుతుంది ప్రభావతి. అయినా ఈ సారి బాలుకి రూమ్ కట్టించాలని ఫిక్సైంది సుశీలమ్మ కాబట్టి ప్రభావతి ప్రయత్నాలు సఫలం అయ్యే ఛాన్స్ లేదు
ఇక కోపంగా ఇంటికెళ్లిన సంజయ్ మౌనికపై మరోసారి చెలరేగిపోతాడు. మీ ఇంటికి తీసుకెళ్లి అన్నలు, వదినలతో అవమానాలకు గురిచేశావ్ అని ఫైర్ అవుతాడు. మౌనిక కూడా సర్దిచెప్పేందుకు ట్రై చేస్తూనే తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని సూటిగానే చెబుతుంది. మీనా వచ్చి లాగిపెట్టి కొట్టివెళ్లడం, కారు డోర్లో బాలు వేళ్లు నొక్కేయడం గుర్తుచేసుకున్న సంజయ్..ఇంతకు ఇంతా బదులు తీర్చుకోవాలి అనుకుంటాడు. మౌనికు ఎలాగైనా పుట్టింటికి వెళ్లిపోయేలా చేయాలి..తనని చూసి ఆ కుటుంబం మొత్తం ఏడవాలి అప్పటికి కానీ శాంతించలేనని ఫిక్సవుతాడు
పుట్టింటికి వెళ్లాలని ఫిక్సైన రోహిణి..ఇంట్లో ఏం చెప్పాలి? కొడుకుని ఓసారి చూసి రావాలంటే వీళ్లనుంచి ఎలా తప్పించుకుని వెళ్లాలనే ఆలోచనలో పడుతుంది. తన గతం గురించి ఏమాత్రం బయటపడినా బతుకు రోడ్డెక్కుతుందని వణుకుతుంది. మరోవైపు పెళ్లిరోజు దగ్గరపడుతోంది ఈ సారి తనింటి నుంచి ఎవ్వరూ రాకపోతే పెద్ద గొడవే జరుగుతుందని భయపడుతుంది రోహిణి.
మేడపై పడకేసిన బాలు మీనా.. తమ పెళ్లిరోజు ఘనంగా జరిపించిన బామ్మ సుశీలమ్మను తలుచుకుంటారు. అనుకోకుండా జరిగిన పెళ్లి , ఇష్టం లేని బంధం..ఏడాది పాటు ఎదుర్కొన్న ఇబ్బందులు..వాటిని దాటుకుని వచ్చిన తీరు అన్నీ గుర్తుచేసుకుని సరదాగా టైమ్ స్పెండ్ చేస్తారు బాలు మీనా.