Bigg Boss Telugu 9 Day 5 Sep 12 Promo 1 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. ఈ వారం తన ప్రవర్తనతో ఇంటి నుంచి బయటకి వెళ్లిపోతాది అనుకున్న సంజనకు హై పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఆమె దానిని ఉపయోగించుకోవడమే కాకుండా.. ఈ సీజన్లో మొదటి కెప్టెన్ అయింది. ఆమె ఆటకు కూడా చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. మీమ్స్ పేజులు, కామెంట్స్‌లలో సంజన ఆటకి ఫ్యాన్స్ అంటూ తెగ షేర్స్ చేస్తున్నారు. అయితే లైవ్ చూస్తే ఇప్పటికే సంజన కెప్టెన్ అయ్యిందని తెలుసు. కానీ ఎపిసోడ్స్‌లో మాత్రం దీనిని ఇంకా చూపించలేదు.
ఈరోజు బిగ్‌బాస్ ప్రోమో
డే 5 బిగ్‌బాస్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దానిలో కెప్టెన్సీ టాస్క్‌లు.. వాటితో జరిగిన గొడవలు ఉన్నాయి. టాస్క్‌లో వాల్కి ఉన్న సపోర్ట్స్ తీసుకుని బ్యాలెన్స్డ్గా ఉండాలనే టాస్క్‌ని కెప్టెన్సీ టాస్క్‌లో ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే రెండు టీమ్‌లుగా విడిపోయిన వీరు.. వాల్కి ఉన్న సపోర్ట్స్ని తీస్తూ.. అవతలి టీమ్‌ని ఓడిపోయేలా చేయాలి. ఈ గేమ్‌కి సంచాలకుడిగా మనీష్‌ని పెట్టారు. అయితే మనీష్ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ.. అన్ఫైయిర్ గేమ్స్ ఆడిస్తున్నాడంటూ.. కంటెస్టెంట్లు అతనితో గొడవకు దిగారు.
తొక్కలో ఫెయిర్ గేమ్..
వాల్ మీద ఉన్నవారు గ్రౌండ్‌ని టచ్ చేయకూడదనే రూల్‌ని బ్రేక్ చేశాడంటూ భరణి.. మిలటరీ కళ్యాణ్ గురించి గొడవకు దిగాడు. దీంతో కళ్యాణ్ దిగి.. హెల్మెట్‌ని వేగంగా విసిరేశాడు. ప్రియా తిరిగిందంటూ రామ్ చెప్పగా.. ప్రియా దిగిపోయింది. తొక్కలో ఫెయిర్ గేమ్ అనుకుంటూ వెళ్లిపోయింది. మాటలు కూడా ఫెయిర్‌గా మాట్లాడట్లేదంటూ వాపోయింది. వాల్‌పై రామ్, శ్రీజ ఉన్నారు. రామ్ ఇబ్బంది పడుతున్నా.. శ్రీజ ఫైనల్ వరకు ఉండి.. కెప్టెన్గా సంజనాను చేసింది. ఇది ఈరోజు ఎపిసోడ్లో రావొచ్చు.
మనీష్‌తో ఇమ్మూన్యుయేల్ గొడవ
టాస్క్‌లో సంచాలకుడిగా ఉన్న మనీష్ ఇమ్మాన్యూయేల్ని అనవసరంగా గేమ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. దీంతో ఇమ్మూ తీవ్రమైన నిరసనను వ్యక్తం చేశాడు. లోపలికి వెళ్లి భరణితో డిస్కషన్ చేశాడు. కళ్యాణ్ బాడీ షేమింగ్ చేశారంటూ వాపోయాడు. ప్రియా కూడా మనం అన్‌ఫెయిర్ గేమ్ ఆడామని చెప్పిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. తనూజ, భరణి, ఇమ్మాన్యూయేల్ ఇద్దరు అబ్బాయులు, ఒక అమ్మాయి అనుకున్నాని.. కానీ ముగ్గురు యదవలతో ఫైట్ చేశానుంటూ మాస్క్ మ్యాన్ హరీశ్ ఫ్లోరా షైనీతో షేర్ చేసుకున్నాడు. దీంతో ప్రోమో ఎండ్ అయిపోయింది.