Nindu Manasulu Serial Today Episode ప్రేరణ ఐశ్వర్యతో అమ్మ ఇంట్లో లేదు ఏంటి ఎక్కడకి వెళ్లింది అని అడుగుతుంది. దాంతో ఐశ్వర్య అమ్మ రోజూ బయటకు వెళ్తుంది. సాయంత్రం వస్తుందని ఐశ్వర్య చెప్తుంది. అదేంటి అని ప్రేరణ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇంతలో ఇందిర ఇంటికి వస్తుంది. కూతుళ్లు ఇద్దరినీ చూసి షాక్ అవుతుంది. రిపోర్ట్స్ దాచేసి ప్రేరణతో మాట్లాడుతుంది. 

Continues below advertisement

ప్రేరణ ఇందిరతో ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ ఏం పని చేస్తున్నావ్.. ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్నావేంటి అని అడుగుతుంది. దానికి ఇందిర కంగారు పడుతూ దబాయిస్తున్నావేంటే.. ఇంట్లో చిరాకుగా ఉంది అందుకే బయటకు వెళ్తున్నా అని చెప్పి కాఫీ తెస్తా అని ఇందిర వెళ్లిపోతుంది. గదిలోకి వెళ్లి రిపోర్ట్స్ ప్రేరణ కంట పడకూడదు అని దాచేస్తుంది. ఇందిక కాఫీ చేయడానికి వెళ్లగానే ప్రేరణ గదిలోకి వచ్చి అమ్మ ఇంత కంగారుగా ఉంది ఏంటి.. ఏం తీసుకొచ్చింది అని చూస్తుంది. తండ్రి రిపోర్ట్స్ చూసి నాన్న రిపోర్ట్స్ అమ్మ దగ్గరకు ఎలా వచ్చాయ్ అని అనుకుంటుంది. 

ప్రేరణ బయట కూర్చొని ధీర్ఘంగా ఆలోచిస్తుంటే సుధాకర్ వస్తాడు. పక్కనే కూర్చొని ఏంటి నా మేనకోడలా అంత ఆలోచిస్తున్నావ్ సివిల్స్‌లో ఏమైనా డౌటా అని అడుగుతాడు. ప్రేరణ ఓ లుక్ ఇస్తే ఏంటి అలా చూస్తున్నావ్.. డిగ్రీ వరకు మామూలుగా చదివా కాబట్టి కానిస్టేబుల్ అయ్యాను అదే ఫోకస్ పెట్టుంటే కలెక్టర్ అయిపోయేవాడని అంటాడు. ప్రేరణ మామయ్యతో ఒక విషయం అడుగుతా నిజం చెప్పు అని నువ్వు ఏమైనా నాన్న మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి అమ్మకి ఇచ్చావా అని అడుగుతుంది. లేదని సుధాకర్ చెప్తాడు. 

Continues below advertisement

సుధాకర్ ఇందిరను కలుస్తాడు. ఇందిర సుధాకర్‌ని గదిలోకి తీసుకెళ్లి రిపోర్ట్స్ చూపిస్తుంది. రాజశేఖరానికి మంచి వైద్యం అందడం లేదని అనుమానంగా ఉందని రేపు ఒకసారి డాక్టర్‌ని కలవాలి అని చెప్తుంది. సుధాకర్ నోరెళ్ల బెడతారు. ప్రేరణ  కూడా రిపోర్ట్స్ గురించి అడిగిందని సుధాకర్ చెప్తాడు. నేను ఏదో ఒకటి చెప్తాలే హాస్పిటల్‌కి వెళ్దాం అని ఇందిర అంటుంది. ప్రేరణ దగ్గర జాగ్రత్త అని చెప్తుంది. 

ప్రేరణ గతంలో సిద్ధూ తన తల్లిని డ్రాప్ చేశాడని గుర్తు చేసుకొని సిద్ధూకి కాల్ చేస్తుంది. మా అమ్మని ఎక్కడో డ్రాప్ చేశావ్ కదా అడ్రస్ చెప్పు అని అడుగుతుంది. సిద్ధూ చెప్తాడు. ప్రేరణ తల్లి దగ్గరకు వెళ్లి నాన్న రిపోర్ట్స్‌ ఎలా వచ్చాయని అంటుంది. ఎవరు తెచ్చారో ఏంటో నాకు తెలీదు అని ఇందిర అంటుంది. అస్తమానం నా మీద అనుమానం ఏంటి అని ఇందిర అరుస్తుంది. మామయ్య తెచ్చుంటాడని మామయ్యకి వాడు అంటే భయం మామయ్య ఎలా తెస్తాడు అని అంటుంది. నువ్వే తెచ్చుంటావేమో నువ్వే దర్జాగా వెళ్లి వస్తున్నావ్ నువ్వే మీ మామయ్యో తేవాలి అంటుంది. మామయ్య తేలేదు.. నేను తీసుకొచ్చే ఛాన్స్ లేదు అని ప్రేరణ అంటుంది. 

ఐశ్వర్య పడుకుంటుంది. ప్రేరణ బయటకు వెళ్లగానే ఇందిర బయటకు వెళ్తుంది. ప్రేరణ ఇందిరను ఫాలో అవుతుంది. ఇందిర గణ ఇంటికి వెళ్లడం ప్రేరణ చూస్తుంది. ఇందిర గణ ఇంట్లో పని మనిషిగా పనులు చేయడం చూసి ప్రేరణ షాక్ అయిపోతుంది. ఈశ్వరి ఇందిర మీద కోప్పడటం చూసి చాలా బాధ పడుతుంది. ఇక ఇందిర ఈశ్వరికి కాఫీ ఇవ్వడం అది కిందపడిపోవడంతో ఈశ్వరి ఇందిరను కొట్టడం చూసి ప్రేరణ ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.