Brahmamudi Serial Today Episode: అత్తాకోడళ్లు ముగ్గురు హాల్లో కూర్చుని రాజ్‌ గురించి మాట్లాడుకుంటుంటారు. కావ్య నాటకం ఆడటం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని అవి ఎక్కడకు దారి తీస్తాయోనని భపడుతుంటారు. ఇంతలో రాజ్‌ రూంలోంచి బయటకు రావడంతో అందరూ సైలెంట్‌ అవుతారు. రాజ్‌ డైనింగ్‌ టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చుని భోజనం వడ్డించమని అపర్ణను అడుగుతాడు.

Continues below advertisement

అపర్ణ: నేను వడ్డించను..

రాజ్‌: నువ్వు వడ్డించకపోతే మా నాన్నమ్మ లేదా తను వడ్డిస్తుంది

Continues below advertisement

ఇందిరాదేవి: నేను కూడా వడ్డించను

రాజ్‌: ఎందుకు వడ్డించరు

అపర్ణ: నీకు పెళ్లి చేసింది.. పెళ్లాంతో పనులు చేయించుకోవడానికి.. మాతో కాదు..

రాజ్‌, కావ్య కోసం సైగ చేస్తుంటాడు. కావ్య ఉలకదు పలకదు..

రాజ్: ఏయ్‌ పిలుస్తుంటే వినిపించడం లేదా..?

కావ్య:  అత్తయ్యా.. అమ్మమ్మ ఇక్కడ ఎవరైనా నన్ను పిలిచారా..?

రాజ్‌: ఏయ్‌ దగ్గుతుంటే వినిపించడం లేదా..?

కావ్య: దగ్గుతే తుమ్మితే ఎవరు పలకరని చెప్పండి అమ్మమ్మ గారు.. మా నాన్న నాకు కావ్య అని పేరు పెట్టారు

రాజ్‌: ఏయ్‌ నేను నిన్ను పిలవను వచ్చి వడ్డించు..

కావ్య: నా బిడ్డే నచ్చనప్పుడు నేను వడ్డిస్తే మీకేం నచ్చుతుందండి.. వడ్డించుకుని తినమనండి అమ్మమ్మ గారు

రాజ్‌: అంటే ఏంటి నాకు వడ్డించుకుని తినడం రాదు అనుకుంటున్నావా..? నాకు రెండు చేతులు ఉన్నాయి.. నేను వడ్డించుకోగలను.. మీరు వడ్డించకపోతే నేను వడ్డించుకోలేనా..?

అంటూ వడ్డించుకుని తింటుంటాడు రాజ్‌. అన్నం తింటుంటే రాజ్‌కు పొలమారుతుంది

కావ్య:  అమ్మమ్మగారు అక్కడే వాటర్‌ ఉన్నాయి. తాగమనండి

రాజ్‌: మాకు తెలుసు మేము తాగలేమా ఏంటి..? వడ్డించుకున్నోళ్లకు ఆ మాత్రం వాటర్‌ ఎక్కడుందో తెలియదా..?

అపర్ణ: అయినా అంత ఆత్రం ఎందుకురా మెల్లగా తినొచ్చు కదా..?

రాజ్‌: నువ్వు అన్నమే వడ్డించలేదు.. అయినా నేను ఫాస్ట్‌గా తినడం వల్ల పొలమారలేదు.. ఇక్కడ ఎవరో నన్ను బాగా తిట్టుకుంటున్నారు..  అయినా వాళ్లను ఇక్కడకు పంపించొచ్చు కదా కాస్త దిష్ట తగలకుండానైనా ఉంటుంది.

అంటూ రాజ్‌ చెప్తుండగానే ముగ్గురు కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతారు. రూంలోకి వెళ్లిన కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్‌ వస్తాడు. ఒక దిండు, దుప్పటి రాజ్‌ మీదకు విసురుతుంది కావ్య.

కావ్య: మీరు బయటకు వెళ్లి పడుకోండి.. ఈరోజు నుంచి మీ పడక గది హాల్లో సోఫానే

రాజ్‌:  ఏంటి సోఫాలో పడుకోవాలా..? నేను వెళ్లను..

కావ్య: నా జీవితంలోంచి వెళ్లిపోవడానికి ఫిక్స్‌ అయ్యారు కదా..? ఇక గదిలోంచి వెళ్లలేరా..?

రాజ్‌: నేనేం ఫిక్స్‌ అవ్వలేదు నువ్వు అలా ఫిక్స్‌ చేస్తున్నావు

కావ్య: ఏంటి నేను చేస్తున్నానా… నా బిడ్డను చంపుకోమని చెప్పింది ఎవరు..? మీరు..? నేను కావాలో బిడ్డ కావాలో తేల్చుకోమని చెప్పింది ఎవరు..? బిడ్డను తీయించుకోకపోతే విడిపోతాను అని చెప్పారు కదా వెళ్లండి

రాజ్‌: ఒసేయ్‌ ఆ మాట అంది నువ్వు కదే..

కావ్య: నేను ఆ మాట అనేటట్టు చేసింది మీరే కదా

ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. రాజ్‌ వెంటనే హల్లోకి వెళ్లి సోపాలో పడుకుంటుంటే అపర్ణ చూస్తుంది. వెంటనే రూంలోకి వెళ్లి సుభాష్‌ను నిద్ర లేపి రాజ్‌ దగ్గరకు పంపిస్తుంది. సుభాష్‌ బయటకు వెళ్లి పడుకుంటుంటే ప్రకాష్‌ వస్తాడు. ఇద్దరూ కలిసి రాజ్‌ను నిజం చెప్పమని అడుగుతారు. రాజ్‌ నిజం చెప్పకుండా వెళ్లిపోతాడు. తర్వాత రాజ్‌ స్నానం చేస్తుంటే కావ్య నీళ్లు ఆపేస్తుంది. నిజం చెప్తేనే నీళ్లు వదులుతానని బెట్టు చేస్తుంది. మరోవైపు అప్పు ఆలోచిస్తూ ఉండటం రుద్రాణి చూసి ధాన్యలక్ష్మీని తీసుకెళ్లి నీ కోడలు ఇలా తయారు కావడానిక ఆ కావ్యనే కారణం అని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!