Bigg Boss Telugu 9 Day 30 Latest Promo : బిగ్​బాస్ సీజన్ 9కి రోజురోజుకి ఇంట్రెస్టింగ్​ మారుతుంది. గతంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి కంటెస్టెంట్లకు ఎలాంటి హింట్ ఉండేది కాదు. కానీ తాజాగా స్టార్ మా బిగ్​బాస్ స్క్రిప్ట్​ని పూర్తిగా మార్చేసింది. కంటెస్టెంట్లకు షాక్​ ఇస్తూ.. ప్రేక్షకులకు ఎంటర్​టైన్​మెంట్ ఇచ్చేందుకు బిగ్​బాస్ టీమ్ రెడీ అయింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి హింట్ ఇచ్చింది. డేంజర్​లో ఉన్నారంటూ టాస్క్​లు కూడా పెట్టింది. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు బిగ్​బాస్ టీమ్. 

Continues below advertisement

బిగ్​బాస్ తెలుగు లేటెస్ట్ ప్రోమో.. 

రణరంగం.. మీ ఊహాలకు అందని ప్రదేశం.. అంటూ బిగ్​బాస్ ప్రోమో మొదలైంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల వస్తోన్న నేపథ్యంలో గార్డెన్ ఏరియాను టాస్క్​లకోసం సెట్ చేశాడు బిగ్​బాస్. మీరంతా ఇప్పుడు డేంజర్​ జోన్​లో ఉన్నారు.. ఎందుకంటే ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తున్నారంటూ చెప్పాడు బిగ్​బాస్. ఈవారం డేంజర్​లో ఉన్నవారికి పెద్ద ప్రమాదం వచ్చే ఫైర్​ స్ట్రామ్ డేంజర్​లో ఉన్నవారిని కుదిపేస్తుంది. వైల్డ్​కార్డ్స్ ఇంట్లోకి అడుగుపెడుతున్నారంటూ.. చెప్పాడు. ఈ తుఫాన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఒకే ఒక్క ఛాన్స్ ఉందంటూ చెప్పాడు. అదే టాస్క్ అని చెప్తాడు. దీనిలో భాగంగా కంటెస్టెంట్లను గ్రూపులుగా విభజించాడు. 

భరణి, దివ్య.. డిమోన్ పవన్, రీతూ.. సంజన, ఫ్లారా షైనీ.. సుమన్ శెట్టి, శ్రీజ.. కళ్యాణ్, తనూజలుగా టీమ్స్​ని మార్చాడు. దీనిలో భాగంగా ఒకరు సీసాను బ్యాలెన్స్ చేయాలి. మిగిలిన వాళ్లు ఇసుకను దానిలో వేయాలి. అయితే సీసాను ఎవరైతే కిందకి దించుతారో.. వారు టాస్క్​ నుంచి ఎలిమినేట్ అయినట్లు అని చెప్పాడు బిగ్​బాస్. అయితే ఇసుకను కంటెస్టెంట్లు వేరే వాళ్లదానిలో వేసుకోవాల్సి ఉంది. అలా వారు అవతలివారి తొట్టిలో వేసి.. గేమ్​నుంచి ఎలిమినేట్ చేయవచ్చు. 

Continues below advertisement

గెలిచేసిన రీతూ, పవన్

టాస్క్ మొదలవ్వగా రీతూ సుమన్ శెట్టిని టార్గెట్ చేసింది. ముందుగా సుమన్ శెట్టి తొట్టిని కింద పెట్టేశాడు. తర్వాత సంజన పెట్టేసింది. కళ్యాణ్, పవన్, భరణిలు గేమ్ ఆడుతుండగా.. సరిగ్గా పట్టుకోవట్లేదు అంటూ ఇమ్మూ కళ్యాణ్​పై సీరియస్​ అయ్యాడు. దీంతో కోపంలో కళ్యాణ్ తొట్టిని వదిలేశాడు. అయితే లైవ్ ప్రకారం భరణిని కూడా వదిలేయగా ఈ టాస్క్​లో పవన్, రీతూ గెలిచారు. ఈవారం ఇమ్మూ, రాము తప్పా అందరూ నామినేష్స్​లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.