బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా వీక్ డేస్ కంటే వీకెండ్ ఎపిసోడ్స్ కోసమే ఆడియన్స్ ఎదురు చూస్తారు. ఎందుకంటే వారాంతంలో నాగార్జున హౌస్ మేట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తారు. శనివారం ఫైర్ మీద ఉండే నాగ్ నెక్స్ట్ డేనే సండే ఫండే అంటూ ఫన్ మూడ్ లోకి తీసుకొచ్చేస్తారు. పైగా వీకెండ్ లో ఉండే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ కు మరో కారణం అని చెప్పాలి. 4వ వారం హరిత హరీష్ ఎలిమినేట్ కాగా, నేడు 5వ వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది.

Continues below advertisement

ఉదయాన్నే వేడి నీళ్ల విషయంలో హౌస్ లో తనూజ - ఇమ్మాన్యుయేల్ - శ్రీజ - రీతూ మధ్య ఫన్నీ గొడవ జరిగింది. తర్వాత కాఫీ రావడంతో తనూజకు ప్రాణం లేచొచ్చింది. మరోవైపు సంజన - ఇమ్మాన్యుయేల్ మధ్య చిన్న డిస్కషన్ నడిచింది. "నువ్వు కూడా టాస్క్ లు విన్ అయ్యి నీకోసం త్యాగం చేసిన వాళ్లకు ఇవ్వు. ఏదైనా ఉంటే నామినేషన్లలో చెప్పు, పర్సనాలిటీని మాత్రం అనొద్దు" అని హితబోధ చేశాడు ఇమ్ము. కానీ అంతలోనే కెప్టెన్ తప్ప అందరినీ నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు. కాసేపు 'పుష్ప' స్పూఫ్ తో ఇమ్మాన్యుయేల్ ఎంటర్టైన్ చేశాడు. అలాగే "నీ మైండ్ ను పాయిజనింగ్ చేస్తోంది. ఆమెకు నీ పని నువ్వు చూసుకో అని చెప్పు. అలాగే భరణి వల్ల ఇమ్మాన్యుయేల్ నాకు దూరమయ్యాడు. అన్నా అని పిలిచి నేను మోసపోయాను. మొత్తం తనే చేస్తున్నాడు" " అంటూ ఫ్లోరా దగ్గర వాపోయింది సంజన. 

ఈ వారం నామినేషన్ల లిస్ట్ నామినేషన్ల పరంగా ఈసారి బిగ్ బాస్ చదరంగం ప్లే చేశారు. ఎప్పుడూ ఒకరినొకరు కారణాలు చెప్పుకునే హౌస్ మేట్స్. 5వ వారం కూడా ఎవరు ఎవరిని నామినేట్ చేయాలో ముందే డిసైడ్ అయ్యారు. కానీ బిగ్ బాస్ మాత్రం రూటు మార్చి, అందరినీ నామినేషన్లలో పడేశాడు. నామినేషన్ల నుంచి సేవ్ కావాలంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంటూ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ మొదటి రౌండ్ లో ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ, భరణి ఇమ్యూనిటీ రౌండ్ లో సేఫ్ అయ్యారు.

Continues below advertisement

Also Read: 'బిగ్ బాస్ 2.0' లోడింగ్... వైల్డ్ కార్డ్ ఎంట్రీల లేటెస్ట్ అప్డేట్... ఆ ఒక్క లేడీ కంటెస్టెంట్ తప్ప ఈ 5 మంది సెలబ్రిటీలు కన్ఫర్మ్

ఫస్ట్ రౌండ్ లో గెలిచినా భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజ "గాలి నిప్పు నీరు" అనే మరో రౌండ్ ఇమ్యూనిటీ టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో 3 లెవెల్స్ లో బ్రిక్ ను కలెక్ట్ చేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన ఇమ్మాన్యుయేల్ ఇమ్యూనిటీని సాధించాడు. దీంతో కెప్టెన్ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. 

కడిగిపారేసిన దివ్య... రామూ, ఫ్లోరాలకు నో టాస్క్ "ఫ్రెండ్షిప్ లు తొక్కా అంటారు. గేమ్ ఆడడం చేతకాదు. ప్రతిసారి నేనే దొరుకుతానా? వైల్డ్ కార్డ్, స్పోర్టివ్, అలగను" అంటూ నన్నే టార్గెట్ చేస్తారు అంటూ ఫైర్ అయ్యింది దివ్య. అలాగే శ్రీజ కూడా ఆమెతో వాదనకు దిగింది. మరోవైపు సంజన "అబ్బాయిలు అమ్మాయిలపై మీ బలాన్ని వాడకండి" అంటూ మండిపడింది. ఫైట్ చేస్తున్న దివ్యను సపోర్ట్ చేయమని రీతూని ఎంతగానో కోరింది ఆమె. కానీ రీతూ పట్టించుకోలేదు. ఇక చివరగా శ్రీజను తప్పించడంతో "నిజంగానే రేలంగి మామయ్య లాగా యాక్ట్ చేస్తున్నావ్. తనూజకు మీకు బాండింగ్ ఉంది కాబట్టి తోయలేదు" అంటూ మండిపడింది. రామూ కెప్టెన్ కాబట్టి సేఫ్. ఫ్లోరాను ఆల్రెడీ నెక్స్ట్ 2 వీక్స్ కి నాగ్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: బిగ్‌బాస్ డే 28 రివ్యూ... హౌస్‌లో దారుణాలు, ప్రూఫ్‌తో బయటపెట్టిన నాగ్... అబ్బాయిలకు ఐస్ పెట్టిన అమ్మాయిలు... అల్లుడికి బ్లాక్ మాస్క్ ఇచ్చిన హరిత హరీష్