Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూ, సుధాకర్‌లు సాహితి కోసం వెతుకుతూ ఉంటారు. నేను ఉండి కూడా నా చెల్లిని కాపాడుకోలేకపోతున్నా అని సిద్ధూ చాలా బాధ పడతాడు. ఇంతలో ప్రేరణ కిడ్నాపర్లు పంపించిన వీడియో చూపించమని అడుగుతుంది.

Continues below advertisement

సిద్ధకూ వీడియో చూపించమని అడిగి అందులో సత్యంబాబు టైలర్స్‌ అనే బోర్డు ఉంటుంది. అది చూసి ఇద్దరూ చూసి అక్కడే సాహితిని దాచారని అనుకుంటారు. వెతుకుదాం పద అని ప్రేరణ అంటే ఆ బోర్డు ఎక్కడో చూశాను అని సిద్థూ కుమార్‌ కోసం వచ్చిన ఏరియా అని గుర్తు పడతాడు. నిన్ను కుమార్‌ కోసం ఇక్కడికే వచ్చాను అని చెప్తాడు. దాంతో ముగ్గురు పరుగులు పెడతారు.

విజయానంద్ రౌడీలు చెప్పిన అడ్రస్‌కి వస్తాడు. వెనకాలే గణ ఫాలో అవుతాడు. విజయానంద్‌ రౌడీలకు కాల్ చేసి డబ్బు తీసుకొచ్చానని చెప్తాడు. ఓ రౌడీ విజయానంద్‌కి డైరెక్షన్ చెప్తూ ఉంటాడు. గణ చూసి షాక్ అయి ఫాలో అవుతూ ఉంటాడు. విజయానంద్‌ దగ్గరకు రౌడీ వచ్చి డబ్బు అడుగుతాడు. నా కూతుర్ని చూపిస్తేనే ఇస్తాను అని విజయానంద్ అనడంతో బ్యాగ్ లాక్కొని గన్‌ గురి పెట్టి విజయానంద్‌ని బెదిరిస్తాడు. గణ షాక్ అయిపోతాడు. నేను చెప్పింది ఏంటి వీళ్లు చేస్తుంది ఏంటి అని గణ అనుకుంటాడు. నీ కూతురు నీకు కావాలి అంటే నాతో రా అని రౌడీ విజయానంద్‌ని తీసుకెళ్తాడు.

Continues below advertisement

గణ ఏం చేయాలో అర్థం కాక తిట్టుకుంటాడు. ఇక గణ రౌడీకి కాల్ చేస్తాడు. వాడు కాల్ లిఫ్ట్ చేయడు.. అంతా ఏదో తేడా జరుగుతుందని గణ అనుకుంటాడు. వెంటనే లొకేషన్‌కి బయల్దేరుతాడు. ఇక విజయానంద్‌ని సాహితి ఉన్న దగ్గరకు తీసుకెళ్తారు. విజయానంద్‌ని కూడా సాహితి పక్కనే కట్టేస్తారు. గణ కోపంగా రౌడీలు ఉండే లొకేషన్‌కి వెళ్తాడు. సత్యని కొట్టి ఫోన్ ఎందుకు ఎత్తడం లేదురా.. నేను చెప్పినట్లు ఎందుకు చేయలేదురా అని కొడతాడు. డబ్బు తీసుకొని విజయానంద్‌ని వదిలేయమని అంటే మన కుర్రాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారని సత్య అంటాడు. మన ప్లాన్‌లో ఇది లేదు కదరా అని గణ అంటే మనసు అన్నాక మారుతుంది కదా సార్ అని గణ అంటాడు.

గణ తండ్రీ కూతుళ్లు ఎక్కడున్నారో చెప్పు.. వాళ్ల ముందే నిన్ను నాలుగు తన్ని వాళ్లని తీసుకెళ్తా అని అంటాడు. సత్య అలా జరగదు అని గణకి షాక్ ఇస్తాడు. నా లాభం కోసం ప్లాన్ మార్చేశా అని సత్య అంటాడు. ప్లాన్ మార్చడం ఏంట్రా నిన్ను చంపేస్తా అని గణ అంటే రౌడీలు గణ తల మీద కొట్టేస్తారు. గణతో నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. అందుకే ప్లాన్ మార్చేశా.. కూతుర్ని కిడ్నాప్ చేస్తే కోటి తెచ్చారు. అదే తండ్రిని కూడా కిడ్నాప్ చేస్తే ఇంకో రెండు కోట్లు ఇవ్వరా అందుకే ఇలా చేశాం ఏం అనుకోకండీ అని గణ తల మీద గట్టిగా కొట్టేస్తారు. గణ కుప్పకూలిపోతాడు.

సిద్ధూ, ప్రేరణ, సుధాకర్ లొకేషన్‌కి వస్తారు. సిద్ధూ ఆ బిల్డింగ్‌లోనికి ప్రేరణని రావొద్దని అంటాడు. నేను వస్తా అని ప్రేరణ అంటుంది. ముగ్గురూ వెళ్తారు. ముగ్గురు చాటుగా ఆ ఇంట్లోకి వెళ్తారు. సాహితి వాళ్ల దగ్గరకు వెళ్తారు. ఒక్కో రౌడీని సిద్ధూ కొడుతూ విజయానంద్‌, సాహితిల కట్లు విప్పుతారు. అన్నయ్యని హగ్ చేసుకొని సాహితి  ఏడుస్తుంది.

వచ్చిన దారిలోనే వెళ్లిపోదాం అని సిద్ధూ అంటాడు. అందరూ మెల్లగా వెళ్తుంటే రౌడీలు అందర్ని చూసేస్తారు. సిద్ధూ, ప్రేరణ ఇలా అడ్డు వచ్చిన అందర్ని కొడతారు. సిద్ధూ కూడా కొడతాడు. అయితే ఒక రౌడీ సిద్ధూని కొట్టేస్తాడు. సిద్ధూ పడిపోతాడు. ఇంతలో సుధాకర్ కూడా పడిపోతూ గణని చూస్తాడు. గణని లేపడానికి ప్రయత్నిస్తాడు. రౌడీలను ప్రేరణ కొడుతుంది. ప్రేరణని తోసేస్తే కర్ర మీద పడబోతే సిద్ధూ లేచి సత్యని చితక్కొడతాడు. ఇక సత్య సాహితిని చంపేయాలి అని కత్తి తీసి పొడుస్తాడు. అందరూ సాహితిని రౌడీ పొడిచేశారు అని అనుకుంటారు. ఇంతలో గణ వచ్చి కత్తి పట్టుకుంటాడు. అందరూ షాక్ అయిపోతారు. రౌడీలు పారిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.