Meghasandesam Serial Today Episode: చెరువు దగ్గర చెర్రితో కేపీకి పిండ ప్రధానం చేయిస్తుంటారు శరత్ చంద్ర, అపూర్వ. పిండ ప్రధానం చివరికి చేరుకుంటుంది. ఇంతలో అక్కడకు మీరా వెళ్తుంది. పిండ ప్రధానం చేస్తున్న చెర్రి చేయి పట్టుకుని వద్దని చెప్తుంది.
చెర్రి: అమ్మా ఏమైంది అమ్మా..
మీరా: లే చెర్రి ముందు నువ్వు లేవ్.. ఇక్కడి నుంచి పదరా మీ నాన్న గారికి నువ్వు పిండ ప్రధానం చేయకూడదురా..?
చెర్రి: అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు..
మీరా: నేను కరెక్టుగానే మాట్లాడుతున్నాను. పదరా ఇంటికి వెళ్దాం.
పంతులు: అమ్మా పిండ ప్రధానాన్ని అలా మధ్యలో ఆపకూడదు అమ్మ..
మీరా: ఇంకా నయం పూర్తిగా అయ్యాక రాలేదు. జీవితాంతం ఏడ్చేదాన్ని..
శరత్: నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..? మీరా.. పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నావు..
మీరా: లేదు అన్నయ్య నాకేం పిచ్చి పట్టలేదు.. చెర్రి వాళ్ల నాన్నకు పిండ ప్రధానం చేయకూడదు.
శరత్: అని ఎవరు చెప్పారు నీకు ..
మీరా: ఎవరో చెప్తే నేనెందుకు ఆపేస్తాను అన్నయ్య.. మా ఆయనే చెప్పారు అన్నయ్య..
శరత్: మీ ఆయన అంటే కేపీ నీతో చెప్పాడా..?
మీరా: అవును అన్నయ్య..
శరత్: అంటే కేపీ బతికే ఉన్నాడా..? చెప్పు మీరా అడుగుతుంది నిన్నే..
మీరా: లేదు అన్నయ్య రాత్రి నా కలలోకి వచ్చారు అన్నయ్య.
అంటూ కేపీ వచ్చి తనకు చెప్పిన విషయం చెప్తుంది మీరా..
మీరా: అది అన్నయ్య జరిగింది. కలలోంచి మెలుకోగానే అసలు పడుకోకూడదు అనుకున్నాను. ఇక్కడికి మిమ్మల్ని రానీయకూడదు అనుకున్నాను. కానీ ఎప్పుడు నిద్ర పోయానో తెలియదు అన్నయ్య. చెర్రి ఆయన గారికి పిండం పెడితే ఆయన పై లోకానికి వెళ్లలేడు అన్నయ్య..
శరత్: అది కాదు మీరా తలకొరివి పెట్టని ఆ గగన్ గాడు ఇక పిండం ఎలా పెడతాడు.
మీరా: పెట్టకపోతే అది వాడి కర్మ. ఆ పాపమేదో వాడికే తగులుతుంది. నేను మాత్రం చెర్రితో పిండం పెట్టించను.. పద చెర్రి పద..
అపూర్వ: ఆగు మీరా..? కేపీ నీ కలలోకి వచ్చాడు అంటున్నావు. మీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు..?
మీరా: అక్కడా ఇక్కడా కలుసుకోవాల్సిన అవసరం ఏముంది వదిన ఇన్నాళ్లు కాపురం చేసిన మన ఇల్లు లేదా..? ఆయనకు మన ఇల్లు తెలియదా..? అక్కడికే వచ్చారు..
అపూర్వ: కచ్చితంగా అది కలే అని ఎలా చెప్పగలుగుతున్నావు..
మీరా: ఇది మరీ బాగుంది వదిన చనిపోయిన వాళ్లు కళ్లో కాకుండా నిజంగా వస్తారా ఏంటి..? అది కాకుండా ఆయన ఆత్మ స్వర్గం నుంచి వచ్చారు కదా అందుకే ఆయనతో పాటు పావురాలు కూడా ఎగురుకుంటూ వచ్చాయి. నువ్వు పద చెర్రి. నువ్వు పద
చెర్రి: అమ్మా అవన్నీ మూఢ నమ్మకాలు అమ్మ..
మీరా: మూఢ నమ్మకాలు కాదురా..? పద వెళ్దాం..
అంటూ చెర్రిని తీసుకుని అక్కడి నుంచి మీరా వెళ్లిపోతుంది. వెనకే శరత్ చంద్ర వెళ్లిపోతాడు. సుజాత, అపూర్వ దగ్గరకు వెళ్తుంది.
సుజాత: హమ్మయ్య ఇప్పటి దాకా మన మనసుల్లో గూడు కట్టుకున్న అనుమానం గాలి తుఫానుకు గుడారం ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. మీరా కలలోకి ఆత్మగా వచ్చాడు కాబట్టి కేపీ చచ్చిపోయాడని కన్‌ఫం అయింది.
అపూర్వ: నీ బొంద అయింది. ఆ కేపీ గాడు మీరా కలలోకి రాలేదు. నిజంగానే మీరాను కలిశాడు. అసలే అమాయకురాలు అయినా మీరాని అది నిజంగానే కల అని భ్రమ కల్పించి ఆ భూమి బోల్తా కొట్టించింది. మన ఇంటి వేలితోనే మన కన్నే పొడిపించింది.
సుజాత: అంత గట్టిగా ఎలా చెప్పావు అమ్మాయి..
అపూర్వ: చెప్పడం కాదు చూపిస్తాను రా..?
అంటూ సుజాతను తీసుకుని వెళ్లిపోతుంది అపూర్వ. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!