Nindu Manasulu Serial Today Episode సిద్ధూ ఆవేశంగా విజయానంద్‌ దగ్గరకు వస్తాడు. విజయానంద్‌ సిద్ధూతో సూపర్ సిద్ధూ నువ్వు అనుకున్నట్లు నీ చెల్లి నిశ్చితార్థం ఆపేశావ్ అంటాడు. సిద్ధూ తండ్రితో ఇప్పటి వరకు నీకు ప్రత్యర్థి లేడు అనుకున్నావ్ కదా మరి ఆ గణ గాడికి ఎందుకు లొంగిపోయావ్ అని అడుగుతాడు. 

Continues below advertisement

విజయానంద్ షాక్ అయిపోతాడు. నేను బిజినెస్ మెన్‌ని అంటావ్ కదా సిద్ధూ ఆలోచించకుండా చేశాను అంటావా అని అడుగుతాడు. ఆలోచించే చేసుకుంటావ్ కానీ ఈ సారి లాభం కోసం కాదు భయంతో చేశావ్.. ఆ భయంతోనే గణ గాడికి లొంగిపోయావ్ అని అంటాడు. దానికి విజయానంద్‌ నేను భయంతో చేశా అని అనుకుంటున్నావ్ కానీ నేను కూతురి మీద ప్రేమతోనే చేశా అంటాడు. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల మన వాళ్లని కోల్పోవాల్సి వస్తుంది. దానికి మూల్యంగా మనం జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది. నీ విషయంలో నేను అది అనుభవించాను..  అది నీకు తెలుసు అని సిద్ధూ అంటాడు. నీకు అన్నీ తెలుసు అంటావ్ కదా సిద్ధూ ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా అని విజయానంద్ అంటాడు. 

సిద్ధూ కోపంగా నాకు సమాధానం కావాలి.. ఎందుకు గణ గాడికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేసి తన గొంతు కోయాలి అనుకున్నావ్,, ఎందుకు నాకు సమాధానం చెప్పు అని అడుగుతాడు. నా కూతురు బాగుండాలి అని ఇదంతా చేస్తున్నా అని విజయానంద్ అంటే అబద్ధం అని సిద్ధూ అరుస్తాడు. ఆ గణ ఏంటో నా కంటే మీకే ఎక్కువ తెలుసు.. నువ్వు ఏదో నిజం దాస్తున్నావ్ చెప్పు ఆ గణ ఏం చెప్పాడు.. ఆ గణ నిన్ను భయపెడుతున్నాడా.. చెప్పు.. నిజం చెప్పు.. ఈ పెళ్లి ఆపేయొచ్చు కదా.. నా దృష్టిలో నువ్వు ఎలాగూ మనిషి కాదు.. కనీసం సాహితి విషయంలో అయినా మంచి తండ్రిగా ఉండు.. ఇప్పటి వరకు నా విషయంలో నువ్వు ఏం చేసినా ఓపికగా భరించా.. దానికి కారణం మా అమ్మ, చెల్లి మాత్రమే.. కానీ నువ్వు వాళ్లకి ఏదైనా చెడు తలపెట్టాలని చూస్తే నువ్వు ఉండవు.. నిజం నేను తెలుసుకుంటా.. నువ్వేదో చేస్తావని ఆ గణ పెళ్లి అయిపోతుందని సంబర పడుతున్నాడు.. చెప్పు వాడిని ఈ ఇంటి వారసుడు అడ్డుపడుతున్నాడని.. వాడిని ఆపడం ఎవరి వల్ల కాదని.. ఈ పెళ్లి జరగదు అని నువ్వు ఫిక్స్ అయిపో అర్థమైందా అని గణ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

Continues below advertisement

విజయానంద్‌ విశ్వాసంతో నాకు సిద్ధూ వార్నింగ్ అయితే ఇచ్చాడు కానీ పెళ్లి ఆపేస్తా అన్నాడు అది చాలు అని సంబర పడిపోతాడు. గణ తన లవర్ వర్షని కలుస్తాడు. నా మీద అంత ప్రేమ నమ్మకం ఉన్న నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావ్.. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను.. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను.. మరి వేరే వాళ్లని ఎలా పెళ్లి చేసుకుంటా అని అనుకున్నావ్ అని అడుగుతాడు. నువ్వు నన్ను అవాడ్ చేయడం వల్ల నాకు టెన్షన్‌గా ఉందని అంటాడు. నిశ్చితార్థం కూడా నేను చెడగొట్టా నా జేబు నేను కట్ చేసుకున్నా అని చెప్తాడు. గణ ఏడుస్తూ వర్షని ఏడిపించి వర్షని నమ్మిస్తాడు. 

సిద్ధూ ఆవేశంగా విజయానంద్‌ దగ్గరకు వెళ్లి గొడవ పడటంతో సిద్ధూని ప్రేరణ తిడుతుంది. సాహితి కోసం ఆయన ఎందుకు  ఆయన అలా చేస్తారు ఎందుకు ఆయనతో గొడవ పడ్డావని కోప్పడుతుంది. గణ మీ అమ్మని చెల్లిని తన మాటలు చేతలతో తన వైపు తిప్పుకున్నట్లే ఆయన్ను తిప్పుకోవచ్చు కదా అంటుంది. ఆయన గురించి నా కంటే ఇంకెవరికీ తెలీదు అని సిద్ధూ అంటాడు. ఎన్నేళ్లుగా తెలియడం కాదు.. ఎంత అర్థం చేసుకున్నామన్నది ముఖ్యం నువ్వు ఆయన్ని బాధ పెడుతున్నావ్ అంటుంది. ఏంటి నేను ఆయన్ను బాధ పెట్టేది.. నా తల్లిని నాకు దూరం చేసేశాడు. అలాంటి వాడు నా చెల్లి మంచి కోరుతాడని ఎలా అనుకోవాలని అంటాడు.

గణ విజయానంద్‌కి కాల్ చేస్తాడు. ఎందుకు కాల్ చేశావ్ అని విజయానంద్ అంటే కంగ్రాట్స్ చెప్పాలి అని అంటాడు. ఎందుకు అని విజయానంద్‌ అంటే నువ్వు నీ కొడుకు కలిసి నా నిశ్చితార్థం ఆపేశారు కదా.. నా అడ్డు తొలగించడానికి మీ అబ్బాకొడుకులు కలిసి నా మీద పగ తీర్చుకుంటున్నారు కదా అని అంటాడు. నీ కూతురితో నా పెళ్లి కచ్చితంగా జరగాలి.. నేను తలచుకుంటే ఏం చేస్తానో తెలుసా అని గణ అంటాడు. నువ్వేం చేస్తావ్‌రా.. అసలు నేను తలచుకుంటే నేనేం చేస్తానో తెలుసా.. నీ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటాడు విజయానంద్. నీ సీక్రెట్ నా దగ్గర ఉందని మర్చిపోకు.. మర్యాదగా నా కాళ్లు కడిగి కన్యాదానం చేయ్ అని గణ అంటాడు. రేయ్ ద గ్రేట్ బిజినెస్ మెన్ విజయానంద్ ఇక్కడ. నీ లాంటి వందల మందిని నా కాళ్ల దగ్గర పెట్టుకుంటా.. అలాంటి నేను నీ కాళ్లు ఎలా కడుగుతా అనుకున్నావ్‌రా.. నిజంగానే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా.. నేను ఆపేస్తా ఏం చేసుకుంటావో చేసుకో ని అంటాడు. గణ చాలా చాలా ఫ్రస్టేట్ అయిపోతాడు.

గణ వెంటనే సిద్ధూకి కాల్ చేసి నీ కోసం రహస్యం చెప్పాలి సిద్ధూ అని అంటాడు. సిద్ధూ చాలా చాలా కోపంగా ఇంటికి వస్తాడు. విజయానంద్ బయటకు రారా అని అరుస్తాడు. అందరూ బయటకు వస్తారు.  తండ్రిని పట్టుకొని పేరు పెట్టి పిలవమే కాకుండా రారా అంటావేంటి అని మంజుల సిద్ధూని ప్రశ్నిస్తుంది. వీడేం చేశాడో తెలిస్తే నీకు పిచ్చి పడుతుందమ్మా అని సిద్ధూ అంటాడు. ఇంకో మాట మాట్లాడితే చంపేస్తా ఎదురుగా ఉన్నది నీ తండ్రి అని మంజుల అంటుంది. అమ్మా వీడు నాకు తండ్రి కాదు. ఈ రోజు వీడు చేసిన తప్పు తెలిశాక నా రక్తం మరిగిపోతుంది అని అంటాడు. ఏం చేశారురా అని మంజుల అడుగుతుంది. వీడు నీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నాడు. నాకు నీకు ద్రోహం చేశాడు. మన జీవితాలను నాశనం చేశాడు.. మనల్ని ఈయన నిలువునా ముంచేశాడు.. వీడు నీ జీవితంలోకి వచ్చింది నీకు ఆసరా ఇవ్వడానికి కాదు.. నీ వెనక ఉన్న ఆస్తి కోసం.. వీడు మనల్ని ఉద్దరించాలని కాదు మన ఆస్తి కోసం వచ్చాడు.. నువ్వు అనుకున్నది.. విన్నది.. చూసింది అంతా నిజం. నా తండ్రి చనిపోవడానికి కారణం వీడు.. అమ్మా.. నేను తండ్రి లేక దిక్కులేనివాడు కాలేదమ్మా.. ఆ దిక్కుని చెరిపేసిందే వీడు.. నువ్వు అనుకున్నట్లు నీ తాళి తెగిపోలేదమ్మా.. వీడు నీ మెడలో తాళి కట్టడానికి నీ తాళి తెంపేశాడు.. మా నాన్న ఆయుష్షు తీరి చనిపోలేదు.. వీడి ఆశ మా నాన్నని చంపేసింది.. వీడు ఆస్తి కోసం మా నాన్నని హత్య చేశాడు.. నా తండ్రి చనిపోలేదు అమ్మా నిర్ధాక్షిణ్యంగా వీడే చంపేశాడు అని సిద్ధూ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.