Nindu Manasulu Serial Today Episode సిద్ధూ బైక్ రిపేర్ చేయించుకొని వచ్చి ప్రేరణని ఎక్కించుకొని కోచింగ్‌కి వెళ్తుంటారు. దారి పొడుగునా నీ వల్లే లేట్ అయిందని ప్రేరణ సిద్ధూని తిడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో విశ్వనాథం గారి ఇంటికి వచ్చిన విషయం కూడా మర్చిపోతుంది.
విశ్వనాథ్‌ని చూసిన ప్రేరణ ఈయన ఎన్ని తిడతారో ఏంటో గెంటేస్తారనుకుంటా అని అనుకుంటుంది. ఇద్దరూ విశ్వనాథ్ గారికి విష్ చేస్తారు. లేట్ అయినందుకు సారీ అని ప్రేరణ అంటే సిద్ధూ లేట్ అవుతుందని మెసేజ్ చేశాడని చెప్పి ఇద్దరికీ ప్రాక్టీస్ చేయమని చెప్తారు. ప్రేరణ సిద్ధూ ముందే చెప్పావా మరి నాకు ఎందుకు చెప్పలేదు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అడుగుతుంది. టెన్షన్ పడుతుంటే బాగున్నావ్ అని సిద్ధూ అంటాడు. హా అంటూ ప్రేరణ చూస్తుంది. చూసింది చాల్లే చదువుకుందాం పద అని అంటాడు.
రంజిత్ విశ్వనాథ్ మాటలు తలుచుకొని సడెన్‌గా రోడ్డు మీరు కారు ఆపేస్తాడు. ఇంతలో ఓ బైక్ అతను వచ్చి కారుని ఢీ కొడతాడు. ఐశ్వర్య సీక్రెట్‌గా మొత్తం చూస్తుంది. రంజిత్ అతనిని కోప్పడి పది వేలు అడుగుతాడు. అతను ఇస్తానని అంటాడు. ఇంతలో రంజిత్‌కి క్రెడిట్ కార్టు గురించి ఓ ఫోన్ వస్తుంది. అది మాట్లాడిన రంజిత్ అతన్ని చూసి అంతా మర్చిపోయి తిరిగి అతనికే 5 వేలు ఇస్తాడు. అదంతా చూసిన ఐశ్వర్య కారు దిగి వచ్చి ఏయ్ ఆగు అని బైక్ అతన్ని ఆపుతుంది. రంజిత్ ఐశ్వర్యతో నువ్వేంటి ఇక్కడ అని అడిగితే అది తర్వాత చెప్తా ముందు అతను కారుని గుద్దితే నువ్వేంటి డబ్బు ఇస్తున్నావ్ అంటే రంజిత్ మొత్తం గుర్తు చేసుకొని కవర్ చేయడానికి అతని ముఖం చూస్తే పాపం అనిపించిందని చెప్పి కవర్ చేస్తాడు. నువ్వు ఎలా వచ్చావ్ అసలు అని రంజిత్ అడిగితే రంజిత్ కోపంగా నా పర్మిషన్ లేకుండా కారు ఎక్కినందుకు నా రూల్ బ్రేక్ చేసినందుకు ఇంటి వరకు నడుచుకొని వచ్చేయ్ అంటాడు. ఆటోకి కూడా డబ్బులు లేవని ఐశ్వర్య అంటే సంతోషం అనుభవించు అని వెళ్లిపోతాడు.
ప్రేరణ సిద్ధూ ఇద్దరూ చదువుకుంటుంటారు, ప్రేరణ సీరియస్‌గా చదవడం చూసి నువ్వు కాబోయే కలెక్టర్ కదా మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయ్ అని అడుగుతాడు. వెయ్యిన్నిఒకటి నీకు ఎందుకు మూసుకొని చదువుకో అని ప్రేరణ అంటుంది. ఇంతలో విశ్వనాథ్ భార్య మహాలక్ష్మీ కేక వినిపించి లోపలికి వెళ్తారు. మహాలక్ష్మీ నడవలేని స్థితిలో ఉంటుంది. జ్యూస్ తీసుకోబోయి బెడ్ మీద నుంచి పడిపోతుంది. ప్రేరణ, సిద్ధూఇద్దరూ చూసి ఆమెని సరిగ్గా పడుకోపెడతారు. విషయం తెలుసుకొని ఏమైనా అవసరం ఉంటే మమల్ని పిలవొచ్చు కదా అంటారు. ఇంతలో విశ్వనాథ్ వచ్చి కోచింగ్‌కి వచ్చిన మీరు ఇలా నా పర్సనల్ విషయాల్లోకి వస్తే బాగోదని ఇద్దరినీ తిడతాడు. ఇద్దరినీ బయటకు పంపేస్తాడు. ఇద్దరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత మహాలక్ష్మీ భర్తకి విషయం చెప్తుంది. తర్వాత విశ్వనాథ్ ప్రేరణ, సిద్ధూల దగ్గరకు వెళ్లి అలా మాట్లాడినందుకు ఏం అనుకోకండి మీరు చెప్తున్నా వినలేదు అంటారు. మీరు మా గురువు సార్ మీరు మా మంచికే చెప్తారు మేం ఏం అనుకోం అని అంటారు. ఇక క్లాస్ అయిపోయింది వెళ్లిపోండి అని చెప్తారు.
ఐశ్వర్య పది కిలోమీటర్లు కిందా మీద పడి నడిచి ఇంటికి వస్తుంది. రంజిత్ ఐశ్వర్యని చూసి దారితో ఐశ్వర్యని వదిలేసిన విషయం మర్చిపోయి ఎక్కడి నుంచి వస్తున్నావ్ చెమటలు పట్టేశావ్ అంటే పది కిలోమీటర్లు నడిచి వచ్చా అని కోపంగా చెప్తుంది. మనసులో వీడు అంతా మర్చిపోయి ఉన్నాడు కచ్చితంగా మతిమరుపు బాగా ఉంది విషయం చెప్పకపోతే బెటర్ అనుకుంటుంది. ఇక సిద్ధూ బైక్ స్టార్ట్ చేసి ప్రేరణతో రా ఎక్కు అంటాడు. దాంతో ప్రేరణ హలో ఏంటి ఏదో హక్కు ఉన్నట్లు రా ఎక్కు అంటావ్ అని అడుగుతుంది. దాంతో సిద్ధూ రుణ తీర్చుకుంటున్నా అంటాడు. రుణం లేదు గుణం లేదు పో అని అంటుంది. ఇక బుక్ ఇవ్వమని అంటుంది. రూంలో మర్చిపోయా అని సిద్ధూ అంటాడు. దాంతో ప్రేరణ ఇప్పుడే కావాలి అని పేచీ పెట్టడంతో తనతో పాటు తన ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్లమని అంటాడు. నీతో బైకి మీద రావడమే చిరాకు ఇంక మీ ఇంటికి రావాలా అని ప్రేరణ కోప్పడుతుంది. బుక్ కావాలి అంటేరా అని సిద్ధూ అనడంతో వెళ్తుంది. ఇంటికి వెళ్లే సరికి గదిలో టవల్ చుట్టుకొని కుమార్ డ్యాన్స్ చేస్తుంటాడు. ప్రేరణ చూసి ఏయ్ అంటూ బుక్స్ అడ్డుపెట్టుకుంటుంది. సిద్ధూ కుమార్‌తో రేయ్ ఇడియట్ రూంలో ఏం చేస్తున్నావ్‌రా అని ఈఅడుగుతాడు. కుమార్ బెడ్ షీట్ చుట్టేసి మేడం బాగున్నారా.అయినా నిన్నటి వరకు నిప్పు ఉప్పులా ఉన్న మీరు ఈరోజు పాలు నీళ్లలా కలిసిపోయారు అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.