Nuvvunte Naa Jathaga Serial Today Episode తన కూతుర్ని వదిలేసి నీ ప్రేమ నిరూపించుకో అని హరివర్ధన్ అన్న మాటకు దేవా మామ చేతిలో చేయి వేసి మిథున మీద నా ప్రేమని నా మనసులో దాచుకొని నాలో నేను నరకం అనుభవిస్తా కానీ ఇక ఎప్పటికీ మిథున జీవితంలోకి రాను అని మాటిచ్చి ఏడుస్తూ దేవా వెళ్లిపోతాడు.
మిథునకు మెలకువ వస్తుంది. దేవా దేవా అని దేవాని పిలవండి అని హడావుడి చేస్తుంది. నర్స్ హరివర్ధన్‌కి చెప్తే వెళ్లి కూతుర్ని చూసి సంబర పడిపోతాడు. దేవాని పిలు నాన్న నేను క్షేమంగా ఉన్నానని దేవాకి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఒక సారి చూస్తాను దేవాని పిలవండి అని అంటుంది. హరివర్ధన్ మిథునకు నువ్వు ముందు రెస్ట్ తీసుకో అని అంటారు. హరివర్ధన్ ఎంత చెప్పినా మిథున దేవా కోసం అడుగుతూనే ఉంటుంది. ఇక మిథున లేచి వెళ్తానని హడావుడి చేస్తుంది. దాంతో హరివర్ధన్ డాక్టర్‌ని పిలుస్తాడు. డాక్టర్ వచ్చి ఇంజక్షన్ వేసి మిథునని పడుకోపెట్టేలా చేస్తారు.
హరివర్ధన్ మిథునని చూసి ఏంటమ్మా నాకు ఈ శిక్ష నువ్వు ప్రాణాలతో ఉండాలని దేవా కాళ్లు పట్టుకొని బతిమాలాను ఇప్పుడు నిన్ను ఎలా సర్ది చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకొని ఏడుస్తాడు. ఇక ఆదిత్య దగ్గరకు కాంతం వచ్చి మిథునని ఆ షూటర్ కాల్చేయడానికి కారణం నువ్వే అని అంటుంది. షూటర్ వచ్చాడు వాడి దగ్గర గన్ ఉంది నేను చూశానని నేను నీకు చెప్తే జడ్జి సెక్యూరిటీకి అలా వస్తారని నువ్వే చెప్పావ్ వాడి గురించి నువ్వెందుకు అబద్ధం చెప్పావ్ వాడికి నీకు ఏంటి సంబంధం.. చెప్పు అని అడుగుతుంది. దాంతో ఆదిత్య వాడు నిజంగా సెక్యూరిటీ అనుకున్నా నాకేం తెలుసు అని వెళ్లిపోతాడు. ఆదిత్యకు ఈ షూటర్‌కి సంబంధం ఉంది అది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది.
ఆదిత్య కాంతం వెనకాలే ఓ చెట్టు చాటుకి వెళ్లి ఫోన్ చేసి షూటర్‌లా మాట్లాడుతాడు. షూటర్‌ని చూశావా.. అది మర్చిపో లేదంటే చచ్చిపోతావ్ అంటాడు. కాంతాన్ని భయపెట్టడానికి రెడ్ లైట్ కాంతం మీద వేస్తాడు. దాంతో కాంతం షూటర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని అనుకొని వణికిపోతుంది. పరుగులు పెడుతూ ఆ షూటర్‌ని నేను చూడలేదు ఆ సచ్చినోడి గురించి నాకు తెలీదు అని అనుకుంటుంది. శారద ఒంట్లో బాలేకపోవడంతో ప్రమోదిని మందులు ఇస్తుంది. మిథునకు అలా అవ్వడం గురించి శారద చాలా కంగారు పడుతుంది. ఇంతలో దేవా రావడంతో ఇద్దరూ మిథున గురించి అడుగుతారు. దేవా ఏం మాట్లాడకుండా నిల్చొంటాడు. నువ్వు మిథున ఎప్పటికీ కలిసే ఉండాలిరా అని శారద అంటుంది. దేవా ఏం మాట్లాడకుండా వెళ్లి ఓ చోట కూర్చొని హరివర్ధన్ మాటలు తలచుకొని ఏడుస్తాడు.
సత్యమూర్తితో పాటు అందరూ వచ్చి మిథునకు ఎలా ఉందని అడుగుతారు. ఎవరు ఎన్ని అడిగినా దేవా ఏం మాట్లాడడు. ఎందుకు అలా మౌనంగా ఉన్నావని సత్యమూర్తి అడుగుతాడు. ఏదో జరిగింది దేవా మన దగ్గర ఏదో దాస్తున్నాడనని కాంతం అంటుంది. దేవా వెళ్లిపోతాడు. ఏం జరిగుంటుందని హరివర్ధన్ అనుకుంటాడు. ఇక మిథునని డిశ్చార్జ్ చేస్తారు. మిథున ఇంటికి వచ్చి మొత్తం చూసి దేవా ఎక్కడ అని అడుగుతుంది. మిథున ఎంత అడిగినా హరివర్ధన్ చెప్పడు. మిథునకు లలిత దిష్టి తీస్తుంది. ఇక హరివర్ధన్ కూతురితో నీకు పట్టిన గ్రహణం పోయింది. ఇక నుంచి నీ జీవితం బాగుంటుంది. మాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. దేవా మిథున గురించి తలచుకొని గ్యారేజ్‌లో ఏడుస్తాడు. మిథున అలంకృత ఫోన్ తీసుకొని దేవాకి కాల్ చేస్తుంది. దేవా కాల్ చూసి చాలా సంతోషపడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.