Trinayani September 21st Written Update: ఈరోజు ఎపిసోడ్ లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఖర్చు పెట్టుకుంటారు నాకు ఆస్తి ఇస్తేనే పుట్టినరోజు జరగాలి అని సుమన అంటుంది.


విశాల్: పేపర్స్ నీ దగ్గర ఉన్నాయా సైన్ చేసేస్తాను


సుమన: నా దగ్గరే ఉంచుకుంటున్నాను మీ సంతకం మా అక్క సంతకం చాలు ఆస్తి రాయడానికి అని పేపర్లు బయటకు తీయగా అవి నయని తీసుకొని చింపేస్తుంది. 


సుమన: మీరు ఇలా అంటారనే తెలుసు. అందుకే కేవలం బావగారు సంతకంతోనే ఆస్తి ఎలా తెప్పించుకోవాలో లాయర్ తో మాట్లాడాను.


హాసిని: ఎద్దులయ్య నీ  దగ్గరున్న ఆయుధాన్ని బయటకు తీసి వీళ్ళందరికీ చూపించు అని అనగా ఎద్దులయ్య వెంటనే ఒక పేపర్ ని బయటకు తీసాడు. అది ఏంటి అని అందరూ అడగగా ఇంతలో విక్రాంత్ ఆ పేపర్ తీసి చదవడం మొదలు పెడతాడు.


విక్రాంత్: శ్రీ పుండరీ నాదం గారి వీలునామ ప్రకారం ఈ ఇంటి కోడళ్ళకు పిల్లలు జన్మించినప్పుడు ఆస్తి వాళ్లకు వస్తుంది. అయితే ఆ పిల్లలు సజీవంగాను చిరంజీవి గానూ ఉండాలి అప్పుడే వాళ్ళకి ఆస్తి వస్తుంది.


తిలోత్తమ: సజీవం, చిరంజీవి రెండూ ఒకటే కదా?


నయని: కాదు సజీవం వేరు చిరంజీవి వేరు


హాసిని: బతికున్న వాళ్ళని సజీవమంటారు కానీ గానవి గాయత్రీ లని చిరంజీవి గాయత్రి చిరంజీవి, గానవి అని అంటారు. మా కొడుకు పూనాని చిరంజీవి పునా అని అంటారు. ఇప్పుడు సుమన బిడ్డని చిరంజీవి పాము పిల్ల అని చెప్పాలా?


నయని: సుమన బిడ్డ చిరంజీవి కాదు అందుకే సుమని కి ఆస్తి రాదు ఇది వీరునామాలోనే తేల్చి చెప్పేశారు. ఇంకా సుమనకి ఆస్తి రావడం కుదరదు లాయర్లు కూడా చెప్పారు.


దురంధర: పాపం సుమన రెండు కోట్లు పెట్టుకొని చాలా కష్టపడి కడుపు తెచ్చుకుంది ఆఖరికి అంతా వృధా అయిపోయింది.


Also Read: చిన్నారిగా మారిన పాముపిల్ల - షాక్ లో సుమన !


విశాల్: మరేం పర్వాలేదు రేపు మా పిల్లలకి పుట్టినరోజు సంబరాలలో సుమన పాపకి పేరు పెట్టి తన మీద కోటి రూపాయలు డిపాజిట్ చేస్తాను. తనకి మైనారిటీ పోయిన తర్వాత ఆ డబ్బులు పది రెట్లు అవుతాయి అంటే మరొక 20 ఏళ్లలో ఆ డబ్బులు 100 కోట్లు అవుతాయి.


తిలోత్తమ: మరీ మంచిది కోటీశ్వరులు అయిపోతున్నావు సుమన


సుమన: అప్పటికి ఎవరుంటారో ఎవరు ఉండరో తెలీదు. అయినా ఆ డబ్బులతో నన్నేం చేసుకోమంటారు ఇప్పుడు అనుభవించడానికి ఏం లేదు కదా


దురంధర: అది సరేకానీ గానవి పుట్టినరోజు నాడే గాయత్రి కూడా పుట్టినరోజు జరిపించడం ఎందుకు?


విశాల్: ఇద్దరికీ ఒకేసారి పుట్టినరోజు జరిపిస్తే ఖర్చు తగ్గుతుంది కదా అని అలా చేశాము.


తిలోత్తమ: వాళ్ల దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళు చేసుకుంటారు.


విక్రాంత్: బ్రో పూనా బాబు పుట్టినరోజు కూడా అదే రోజు కదా అని వల్లభతో అంటాడు.


వల్లభ: అవును అనుకుంటా మర్చిపోయాను


హాసిని: చూశారా చూశారా సొంత కొడుకు పుట్టినరోజు కూడా గుర్తులేదు. మా అత్తయ్య కూడా ఏమీ తెలియనట్టు ఉండిపోయారు అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు.


విశాల్: అయితే ముగ్గురు పుట్టినరోజులు ఒకేసారి జరుపుకుందాము. అలాగే సుమన పాపకి కూడా పేరు పెడదాము. అని అనగా సరే బాగా ఎంజాయ్ చేద్దాము అని కుటుంబ సభ్యులందరూ అనుకుంటారు.


ఆ తర్వాత సీన్లో సుమన పాప ఉయ్యాలలో ఏడుస్తూ ఉండగా దురంధర అక్కడికి వస్తుంది. వెంటనే ఏడుస్తున్న పాపని ఎత్తుకుంటుంది.


దురంధర: ఏంటండీ పాప పక్కనే ఏడుస్తున్నా కూడా ఎత్తుకోవడం లేదు?


పవనుమూర్తి: సాయంత్రం కావస్తుంది కదా ఎక్కడ పాప పాములా మారుతాదా అని ఎత్తుకోలేదు. అని అంటాడు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు సుమన మాత్రం రాదు.


విశాల్: పిల్ల దగ్గర తల్లి ఉంటుంది అంటారు కానీ సుమన్ మాత్రం లేదు అని అనగా అప్పుడే సుమన అక్కడికి వస్తుంది.


సుమన: ఆ మాట మీరే చెప్పాలి లెండి తల్లికి దూరమయ్యారు మీరు మళ్లీ మమ్మల్ని అంటున్నారు


నయని: గాయత్రమ్మ గారికి ఇక్కడ ఎవరు దూరం అవ్వలేదు. నా కడుపున గాయత్రి అమ్మగారు మళ్లీ పుట్టినందుకు నాకు సంతోషంగా ఉంది.


సుమన:  అలాగని ఆవిడని వెతకడానికి ప్రయత్నించడం లేదు కదా? ఇప్పుడు ఆవిడ ఏ అడుక్కునే స్థితిలో ఉన్నారో 


విశాల్: షట్ అప్. మా అమ్మ ఎప్పుడూ పులి లాగే ఉంటుంది. ఎన్ని జన్మలైనా సరే అలాగే ఉంటుంది. అని అంటాడు ఇంతలో పాప ఏడుపులు ఎక్కువ అవుతాయి.


దురంధర: పాప ఏడుస్తుంది పాలు పట్టొచ్చు కదా


Also Read: అనుకి గిఫ్ట్ కొనేందుకు ఆర్య సహాయం తీసుకున్న అక్కి- తండ్రే అని తెలుస్తుందా!


సుమన: నా పాలు ఎందుకు పడతాను ఎలాగో ఆస్తి రాదు అనేసారు కదా మరి నా పాలిచ్చుకొని నా అందాన్ని ఎందుకు పాడు చేసుకుంటాను. అసలుకే సన్నగా అయిపోతున్నాను అని అంటుంది. ఇంతలో పాప ఏడుపులు ఆగుతాయి. ఏమైందో అని చూసేసరికి పాప పాములాగా మారిపోతుంది. ఆ మార్పుకి ఒకేసారి అందరూ జడుసుకుంటారు.


హాసిని: చిట్టి అది పామైనా నీ పిల్ల కదా నీ మాట వింటుంది. దయచేసి దాన్ని లోపలికి వెళ్ళమని చెప్పవా


సుమన: ఇక్కడ అందరూ భయపడుతున్నారు నీ గదిలోకి వెళ్ళిపో అని అనగా పాము ఉయ్యాలలో నుంచి దిగి వెంటనే తన గదిలోకి వెళ్ళిపోతుంది.


ఆ తర్వాత రోజు హాల్లో సుమన లాప్టాప్, పుస్తకాలు పట్టుకొని బిజీగా ఉంటుంది. ఎవరు ఏం మాట్లాడినా జవాబు ఇవ్వదు.


దురంధర: ఏంటి సుమ్మి పిల్లలు పుట్టిన రోజు వస్తుంది కదా అని చెప్పి దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నావా? అంత బిజీగా ఉన్నావు?


విశాల్: అలాగైతే పిల్లల పిన్నిగా ప్రిపరేషన్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పుతాను


సుమన: ఏం అవసరం లేదు. వాళ్ళు నా పిల్లలు కానప్పుడు వాళ్లకి చాకిరి చేయాల్సిన అవసరం నాకేంట


హాసిని: అందులో నీ పాపకి కూడా పేరు పెట్టాలనుకున్నారు కదా


సుమన: అందుకే మంచి పేరు కోసం వెతుకుతున్నాను. అని అనగా దీనికోసం నువ్వు ఇలాగ అయిపోతున్నావు అని అందరూ అడుగుతారు. 


సుమన: నా పాప పేరు అందరికన్నా భిన్నంగా ఉండాలి అందుకే ఇవన్నీ వెతుకుతున్నాను అని సుమన అంటుంది.


Also Read: Brahmamudi September 21st: తండ్రిని చూసి విలవిల్లాడిపోయిన కావ్య - దొంగల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన రాజ్!


Join Us On Telegram: https://t.me/abpdesamofficial