Naga Panchami November 23rd : ఈరోజు ఎపిసోడ్ లో నల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి చెప్పిన మాటలు నమ్మవద్దంటూ మోక్ష అతని అన్నదమ్ములు కుటుంబ సభ్యులకు చెప్తారు.


వైదేహి : కానీ నేను నమ్ముతున్నాను మోక్ష, నీకు నాగదోషం ముందు అన్ని సంగతి తెలిసిందే కదా.


మోక్ష: అందుకని మా ఇద్దరినీ విడిపోమంటారా, రేపు ఇంకెవరో వచ్చి మీ కొడుకు వల్ల ఈ ఇంటికి దోషం ఉంది అంటే నన్ను ఇంట్లోంచి తరిమేస్తారా.


చిత్ర : నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను తనలోని నాగుపాము లక్షణాలు కనిపిస్తున్నాయని కానీ మీరే నమ్మలేదు ఇప్పటికైనా తనని బయటికి పంపించేయండి.


మోక్ష: వదిన ఏది పడితే అది మాట్లాడకండి, అతను చెప్పిన విషయాలు మీరు నమ్మితే నమ్మండి కానీ మేము నమ్మము.


శబరి: అలా కొట్టి పారేయకు మోక్ష, మీ తాత గారి విషయంలో కూడా జాతకంలో ఎలా ఉంటే అలాగే జరిగింది నాకు భయంగా ఉంది.


వైదేహి: సంవత్సర కాలం పాటు మీ భార్య భర్తలు ఇద్దరు కలవలేదు అంటే దీని వెనక ఏదో కారణం ఉంది అని భయంగా చెప్తుంది.


మోక్ష : మీకు భయంగా ఉంటే చెప్పండి మేమిద్దరిని ఇంట్లోంచి వెళ్లిపోయి ఎక్కడైనా హాయిగా ఉంటాము. ఈరోజు మా పెళ్ళి రోజు మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నావ్ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే వెళ్లిపోతాం.


మోక్ష తండ్రి: నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యు అని చెప్పటంతో మోక్ష పంచమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


మరోవైపు కరాళి మహాకాళిని ప్రసన్నం చేసుకుంటుంది.


కరాళి : ప్రసన్నమైన మహాకాళితో నాకు శక్తులు ప్రసాదించు.


మహాకాళి: నీకు శక్తులు ప్రసాదించిన అవి ఉపయోగపడవు.


కరాళి: నాగమణి సొంతం చేసుకోవాలంటే ఆ పంచమిని నా ఆదీనంలో ఉంచుకోవాలి అలా జరగాలంటే నాకు శక్తులు కావాలి.


మహాకాళి: నాగమణి ని సొంతం చేసుకోవాలని నీ ఆలోచన మంచిది కాదు కానీ నీ భక్తికి ప్రసన్నమైన నేను ఒక మార్గం చెబుతాను. పంచమి భర్త కటోర బ్రహ్మచారి పెళ్లి అయినా కూడా బ్రహ్మచారిగా ఉంటే వాళ్లకి కొన్ని శక్తులు ఉంటాయి అతనిని వశం చేసుకుంటే ఆ శక్తులు నీకు దక్కుతాయి అని చెప్పి కరాళిని ఆశీర్వదించి మాయమైపోతుంది.


మోక్షని ఎలాగైనా వశం చేసుకోవాలి అనుకుంటుంది కరాళి.


మరోవైపు ఇంటి బయట ముగ్గులు వేస్తూ చిత్ర ఆమె తోటి కోడలు మాట్లాడుకుంటూ ఉంటారు. పంచమితో కలిస్తే చనిపోతాడని తెలిసినా ఈ పెళ్లి సంబరాలు ఏమిటో అంటుంది చిత్ర.


చిత్ర తోటి కోడలు : పోయేకాలం వస్తే అన్ని చావు మాటలే వస్తాయి అయినా మనకి కావలసింది కూడా అదే కదా అంటూ ఇద్దరూ ఆనందపడతారు. 


ఇంతలో రెడీ అయి కిందకి వచ్చిన మోక్ష ఇంట్లో అందరూ దిగులుగా కూర్చోవడం చూసి బాధపడతాడు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నా బాధ అర్థం కావడం లేదు అనుకుంటూ పంచమిని గట్టిగా కేక వేసి పిలుస్తాడు.


మోక్ష: పంచమి పదా, మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం. మనం హాయిగా ఉండడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.


ఆ మాటలకి ఇంట్లో అందరూ కంగారు పడతారు. నువ్వు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాం అని చెప్తారు తండ్రి అన్నదమ్ములు.


శబరి: నీ చేతుల మీదుగా నన్ను పంపించాలి అంతవరకు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది.


మోక్ష: నాకు నాగగుండం ఉందని సంగతి తెలిసిందే ఎప్పుడు చనిపోతానో తెలియదు నేనే ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు. ఉన్నంతకాలం హాయిగా ఉందాం అనుకుంటున్నాను. కానీ మీ అందర్నీ ఇలా చూస్తూ ఉంటే నాకు ఇప్పుడే చనిపోవాలనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అవుతాడు.


మోక్ష తండ్రి: నువ్వు బాధ పడొద్దు నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు.


చిత్ర తోటి కోడలు: రండి, సరదాగా గేమ్ ఆడదాం చీటీలు రాసి పెట్టాను అందులో ఏముంటే అది చేయాలి అనటంతో అందరూ ఆనందంగా గేమ్ ఆడుతూ ఉంటారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.