Naga Panchami Serial Today November 18th Episode : మోక్ష: పౌర్ణమి రోజున పంచమి పాములా మారకుండా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి
నాగ సాధువు: సృష్టిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉండి తీరుతుంది. అదే సృష్టి గొప్పతనం. కానీ ఇందులో ఒక మెలిక ఉంటుంది. పిల్లికి ఎలుక ఆహారం కానీ ఎలుకకు ప్రాణ సంకటం. ఒక జీవికి మేలు జరగడానికి మార్గం కనిపించినట్లు ఉంటుంది. అదే సమయంలో మరో ప్రాణికి కీడు కాచుకొని ఉంటుంది. అది సృష్టి రహస్యం దాన్ని ఎవ్వరూ చేధించలేదు
మోక్ష: పర్వాలేదు స్వామి అందువల్ల నాకు కీడు జరిగినా పర్లేదు. పంచమికి మంచి జరగాలి.
నాగ సాధువు: పంచమి పవిత్రమైన నాగకన్య. మావన కన్యగా భూలోకంలో పుట్టినా తనకి నీలాంటి మంచి భర్త దొరకాడు. పంచమి కోసం ఎదో ఒకటి చేయాలని తపిస్తున్నావు కాబట్టి నాకు తెలిసిన ఒక అవకాశాన్ని చెప్తాను. పంచమి గర్భవతి అయితే తన గర్భాన మరోమానవ జీవి ఉండటం వలన తను పాముగా మారే అవకాశం లేదు. పాము రూపంలోకి మారితే గర్భస్థ్య శిశువు ఎదుగుదల కష్టం. ఆ శిశివు జన్మఫలం కారణంగా పంచమి పాములా మారడం జరగదు
మోక్ష: నమ్మలేకపోతున్నాను స్వామి. ఈ అవకాశం చాలు పంచమిని పాములా మారకుండా చేస్తాను
నాగ సాధువు: తొందర పడకు బాబు. నేను ముందే చెప్పాను ఈ సృష్టిలో ప్రతీదానికి మెలిక ఉంటుందని. ఒకరి జీవం పోస్తే మరొకరి కోసం మృత్యువు కాచుకొని చూస్తుంది. మీ విషయంలోకూడా అలాంటి జీవమరణ సమస్య ఉంది. జన్మరీత్య పంచమి నాగకన్య అని నీకు తెలుసు. నాగకన్యతో శారీరకంగా కలిసిన మానవుడు ప్రాణాలతో ఉండడు. అసహజ కలయికను సృష్టి సహించదు. ఈ విషయం పంచమికి ముందే తెలుసు. ఈ కారణంతోనే ఇంతకాలం నీకీ విషయం చెప్పలేదు.
మోక్ష: సరే స్వామి పంచమి పాములా మారకుండా ఉండేందుకు మార్గం దొరికింది. నేను ఇంత దూరం మిమల్ని వెతుక్కుని వచ్చినందుకు ఫలితం దొరికింది. కానీ ఏం చేయాలో నేను నిర్ణయించుకోవాలి.. వస్తాను స్వామి
పంచమి ఇంట్లో ఏదో దెయ్యమో భూతమో ఉందని అది మనల్ని భయపెడుతుందని దానికి భయపడకూడదని తంత్రీ, కంత్రీలు నిర్ణయించుకుంటారు. అప్పుడే వాళ్లను సుబ్బు ఒకర్ని కాకుండా మరొకరికి పిలుస్తాడు. ఎవరికీ కనిపించని మేము నీకెలా కనిపిస్తున్నామని తంత్రీ,కంత్రీ అంటారు. ఇక వాళ్లు సుబ్బు మీదకు నిప్పులు వెస్తే సుబ్బు నీరు వేస్తాడు. ఇక వాళ్లు ఎన్ని మాయలు చేసినా సుబ్బు వాళ్లని అడ్డుకుంటాడు.
పంచమి: (ఆలయంలో) సుబ్రహ్మణ్యస్వామి నా నమ్మకం అంతా నీ మీదే స్వామి. నా భర్త ఆరోగ్యం బాగుచేసి తనకి జీవితాన్ని ప్రసాదించు. ఇప్పుడు తన ప్రాణం ప్రమాదంలో ఉంది. నాగలోకం కేవలం నీ ఒక్కడి మాటే వింటుంది. చివరి క్షణంలో అయినా నా భర్తను ఒడ్డున వేస్తావనే ఆశతో బతుకుతున్నాను.
ఫణేంద్ర: (పాముగా వచ్చి మనిషిగా మారుతాడు) ఆగండి యువరాణి మీరు నన్ను చూసి భయపడకూడదు. నేను మీకు రక్షకుడిని. మిమల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాదే.
పంచమి: నాకు ఎవరి రక్షణ అవసరం లేదు. నేను పుట్టింది పెరిగింది భూలోకంలోనే మీ నాగలోకానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను వెళ్లాలి.
ఫణేంద్ర: నాగ దేవత నాకు అన్నీ చెప్పింది. మీరు భూలోకంలో పుట్టిందే మీ అమ్మ పగ తీర్చుకోవడానికి అంత వరకే నీకు ఈ లోకంతో సంబంధం
పంచమి: కాదు అసలు బంధం మొదలైందే ఇప్పుడు నాకు నాగలోకానికి నా కన్నతల్లి. ఆ బంధం ఇప్పుడు లేదు. నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు. నన్నూ నా భర్తను వదిలేస్తే చాలు
ఫణేంద్ర: మేము వదిలేసినా నువ్వు శత్రువుని వదిలేయలేవు యువరాణి. పోయిన పౌర్ణమికి నువ్వే కాపాడావు అన్న సంగతి మాకు తెలిసిపోయింది. ఈ సారి అలాంటి అవకాశం నీకు ఉండదు.
పంచమి: నేను నమ్ముకున్న దేవుడే నా భర్తను కాపాడుతాడు
ఫణేంద్ర: విధిరాతను ఎవ్వరూ మార్చలేరు యువరాణి. నీ భర్తను నువ్వు కాటేయకపోయినా నేను కాటేసి చంపేస్తా. నాగ దేవత నాకు ఆ అవకాశాన్ని ఇచ్చింది. వచ్చే కార్తీక పౌర్ణమినే ఈ భూమ్మీద నీకు చివరి రోజు. పౌర్ణమికి నువ్వు పాముగా మారడం ఆపలేం. నువ్వు పాముగా ఉన్నప్పుడే అన్నీ జరిగిపోతాయి. నిన్ను నేను నాగలోకానికి తీసుకెళ్లిపోవడం, యువరాణి పీఠం మీద కూర్చొబెట్టడం తర్వాత నిన్ను నేను వివాహం ఆడటం ఇదే జరుగుతుంది.
పంచమి: (ఫణేంద్ర ఇలా అనడంతో పంచమి కొట్టడానికి చేయి ఎత్తుతుంది.) నా భర్తను కాపాడుకోవడానికి ఎవరితోనైనా పోరాడుతాను. ఎంత దూరం అయినా వెళ్తా. నన్ను చంపిన తర్వాతే ఎవరైనా నా భర్త దగ్గరకు వెళ్లాలి. ఆ శక్తిసామర్ధ్యాలు నాకు ఉన్నాయి. మీరు నా భర్తను ఏమీ చేయలేరు. మీ ప్రయత్నాలు ఫలించవు నాగరాజా. మీరు మీ లోకానికి వెళ్లిపోండి.
ఫణేంద్ర: నీ మాటలు వచ్చే పౌర్ణమి వరకే యువరాణి. అప్పటి వరకు నేను మీ నీడలా మీ వెంటే ఉంటా
మరోవైపు మోక్ష గుడికి వస్తాడు. పంచమి దగ్గరకు వచ్చి నువ్వు పూజించే దేవుణ్ని దర్శించుకోవాలని ఇలా వచ్చానంటాడు. ఇక మోక్ష, ఫణేంద్ర ఒకర్ని ఒకరు పరిచయం చేసుకుంటారు. ఇక ఫణేంద్రను మోక్ష ఇంటికి పిలుస్తాడు. అయితే మరోసారి వస్తానని ఫణేంద్ర అంటాడు. ఇక మీ బంధువు బాగున్నాడని పంచమితో మోక్ష అంటాడు. మృత్యువు తన కంటి ఎదురుగానే తిరుగుతున్నాడని తన భర్తని మీరే కాపాడాలి అని పంచమి దేవుణ్ని కోరుకుంటుంది.
మరోవైపు కరాళి దగ్గరకు తంత్రీ, కంత్రీ వెళ్తారు. సుబ్బు తమని కొట్టి తరిమేశాడని చెప్పారు. అయితే పంచమి తన రక్షణ కోసం ఎవరినో తెచ్చుకుందని కరాళి అంటుంది. అతడు పిల్లాడు కాదని అతడి ముందు దుష్టశక్తులు ఎందుకు పనికిరావని చెప్తారు. దీంతో వాళ్లని కరాళి వెళ్లిపోమని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.