Naga Panchami Today Episode మోక్ష తమకు పుట్టబోయే బిడ్డ కోసం డాక్టర్లతో మాట్లాడటానికి వెళ్తాడు. పంచమి గదిలో ఏడుస్తూ ఉండగా వైదేహి అన్నం తీసుకొని వస్తుంది. ఇకపై తనని తల్లి అనుకోమని చెప్పి పంచమికి గోరు ముద్దలు తినిపిస్తుంది. అత్త ప్రేమకు పంచమి కన్నీరు పెట్టుకుంటుంది.
వైదేహి: నీకు నీ బిడ్డకు ఏ లోటు రానివ్వను.
పంచమి: చాలు అత్తయ్య ఈ జీవితానికి ఇది జాలు. నాకు ఇప్పుడు ఈ బిడ్డ మీద ఎలాంటి బెంగ లేదు.
వైదేహి: నా కొడుకు సైంటిస్ట్ పంచమి. మీ బిడ్డకు ఈ లోపం రానివ్వడు. మీకు బంగారం లాంటి బిడ్డ పుడుతుంది. పంచమి మీరు ఏమైనా అనుకోండి. నేను మాత్రం ఆ బిడ్డను వదిలిపెట్టి ఒక్క నిమిషం ఉండను. పేరు పెట్టడం దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. అయితే ఇదంతా మోక్ష కల. తన తల్లి భార్యను అంత ప్రేమగా చూసుకుంటుందని కలకంటాడు. అది నిజం అయితే బాగున్నని అనుకుంటాడు.
మోక్ష కలిసిన డాక్టర్ కూడా బేబీని ఉంచుకుంటే కష్టమని తీసేయ్‌మని అంటుంది. అయితే కొంత కాలం ఆగి అప్పుడు పిండం మనిషిలా మారుతుందేమో చూద్దామని అంటుంది.
మరోవైపు వైదేహి మహా సిద్ధులు అని ఓ స్వామిజీని పిలిపిస్తుంది. ఆ స్వామిజీ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పంచమి కూడా అక్కడికి వస్తుంది.
వరుణ్: అమ్మ మోక్ష ఇంటిలో లేడు. ఆ సిద్ధుడు ఏం చెప్పినా మోక్ష వింటాడు అని లేదు. ఇదంతా వృథా ప్రయాసే.
వైదేహి: పంచమి నువ్వే సాక్ష్యం. సోది చెప్పినామె మాటలు కొట్టి పడేశారు. మా గురువు గారు చెప్పినవి మోక్ష, నువ్వు చెవికెక్కించుకోలేదు. ఇప్పుడు ఈ సిద్ధుడు ఏం చెప్పినా చేసేలా మోక్షని ఒప్పించాల్సిన బాధ్యత నీదే.
పంచమి: అత్తయ్య గారు మీరు నమ్మినా నమ్మకపోయినా నా మీద నాకు అధికారం లేదు. నేను ఇప్పుడు మోక్షాబాబు గారి భార్యని నా భర్త చెప్పిందే నాకు వేదం. వారు ఏం చెప్తే నేను అలా నడుచుకుంటాను.
శబరి: మంచి మాట చెప్పావు పంచమి. భర్త అడుగు జాడల్లో నడిచేదే భార్య.
భార్గవ్: పెద్దమ్మ మోక్ష ఉన్నప్పుడే ఆ సిద్ధాంతి గారిని పిలిపించాల్సింది.
వైదేహి: ఎప్పుడు అంటే అప్పుడు ఆయన రారు. ఏదో రికమండేషన్ ఉపయోగించి పట్టుకున్నాను.
రఘురాం: సరే సరే ముందు ఆ సిద్ధాంతి గారు ఏం చెప్తారో విందాం.
సిద్ధాంతి గారు వస్తారు. వైదేహి, రఘురాం ఆయనకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలుకుతారు. సిద్ధాంతి గారు ఇంటి ద్వారం దాటబోయి అక్కడ పాము, గరుడల శబ్దాలు రావడంతో అడుగు వెనక్కి తీసుకుంటారు. తన దివ్య దృష్టితో పంచమి పాముగా మారడం, జ్వాల కడుపులోకి గరుడ ప్రవేశించడం చూస్తారు. జ్వాల, పంచమిలను గమనిస్తారు.
రఘురాం: స్వామి మా ఇంట్లో కొన్ని ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయి.
వైదేహి: కొంత కాలంగా మా ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా లేము స్వామి. చాలా సంతోషంగా ఉండే మా కుటుంబంలో మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి.
సిద్ధాంతి: పరస్పర విరుద్ధ అంశాల జాతులే మీ కుటుంబ కలహాలకు కారణ భూతాలు. వంశ పార పర్య దోషాలు తరాలు మారినా ఆ వంశస్తుల తల రాతల మీద ప్రభావం చూపుతాయి. మీ కుటుంబంలోకి రాబోయే కొత్త జననాల ప్రభావ ఫలితమే మీ ఇంటిలో జరిగే అరిష్టాలకు కారణం. పుట్టబోయే జీవుల మూలాంశాలు రాశి చక్ర ఫలితాల ఆధారంగా దుష్ఫలితాలు జరుగుతూ ఉంటాయి. మంచి చెడుకు ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మీ ఇంటిలో ఇద్దరు తల్లులు కాబోతున్నారు.
వైదేహి: లేదు స్వామి ఆ అమ్మాయి ఒక్కర్తే గర్భంతో ఉంది.
సిద్ధాంతి: జ్వాలను చూపిస్తూ ఆవిడ కూడా తల్లి కాబోతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇద్దరు గర్భవతులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉంటే పుట్టబోయే బిడ్డల్లో పూర్వ తరాల వైషమ్యాలు ఏమైనా ఉంటే అవి బయట పడి అలజడి సృష్టిస్తూ ఆ ఇంట్లో దుష్ఫలితాలు కలిగిస్తాయి.
వైదేహి: పుట్టబోయే బిడ్డల ద్వారా అరిష్టాలు జరుగుతాయా స్వామి.
సిద్ధాంతి: ఎన్ని ఆటంకాలు సృష్టించినా పుట్టాలి అనుకున్న జీవిని పుట్టించకుండా ఆపే శక్తి లేదు.
వైదేహి: అలాంటప్పుడు మేం ఈ అరిష్టాలు జరగకుండా ఏం చేయాలి స్వామి.
సిద్ధాంతి: ప్రస్తుతానికి గర్భవతులుగా ఉన్న ఇద్దరినీ వేరు వేరుగా ఉంచండి. ఒకరి ముఖం ఒకరు చూసుకోనంత దూరంగా ఉండటం మరీ మంచిది. అప్పుడు మీ ఇంట్లో జరిగే దుర్ఘటనలు ఆగిపోతాయి.
వరుణ్: జ్వాల నువ్వు ప్రగ్నెంట్ ఏంటి.
జ్వాల: నాకు ఆశ్చర్యంగా ఉంది.
భార్గవ్: ఏది ఏమైతేనేం అన్నయ్య వదినా కంగ్రాట్స్.
మరోవైపు కరాళి గరుడని ప్రయోగిస్తుంది. ఇక జ్వాల సిద్దాంతి చెప్పిన మాటలు తలచుకొని ఉంటూ ఉంటుంది. ఇంతలో గరుడ జ్వాలలోకి దూరుతుంది. దీంతో జ్వాల బయటకు వెళ్తున్న పంచమి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.