Naga Panchami Today Episode : జ్వాలలోని గరుడ శక్తికి పంచమి బాగా భయపడుతుంది. జ్వాల అందరి ముందు మంచిగా మారినట్లు పంచమిని ప్రేమగా చూసుకుంటున్నట్లు నటిస్తుంది. ఎవరూ లేనప్పుడు మాత్రం పంచమి కడుపులోని బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తుంది. జ్వాల చేష్టలకు పంచమి బాగా భయపడి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సంచి పట్టుకొని బయటకు వచ్చేస్తుంది. మోక్షతో పాటు ఇంట్లో అందరూ పంచమిని వెళ్లొద్దని వేడుకుంటారు. పంచమి ఎంతకీ ఒప్పుకోకపోవడంతో మోక్ష కూడా పంచమితో పాటు వచ్చేస్తా అంటాడు. ఇక జ్వాల పంచమిని ఇంట్లో నుంచి వెళ్లొద్దని తానే వెళ్లిపోతానని అంటుంది. పంచమి తల్లిని అయినా పిలిపిద్దామని అంటే పంచమి వద్దని తాను తన బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని అంటుంది.
పంచమి: నేను ఈ ఇంట్లో ఉండకూడదు.
శబరి: పంచమి నీకు ఇంకా చేయాల్సిన శుభకార్యాలు ఉన్నాయమ్మా. సీమంతం అవి చేయాలి అప్పుడే నీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు.
పంచమి: ఇక్కడి నుంచి నేను బయట పడితే చాలు అంతకు మించి శుభకార్యాలు నాకు ఏం అక్కర్లేదు. నేను వెళ్లొస్తాను.
శబరి: ఆగమ్మా.. పెద్దదాన్ని చెప్తున్నాను. నువ్వు అందరి లాంటి దానివి కాదు. నువ్వు తలచు కుంటే నిన్ను మేం ఎవ్వరం ఆపలేం. నీకు సీమంతం జరిపిన తర్వాత వెళ్లమ్మ నిన్ను ఎవరూ ఆపరు. నీ సీమంతం నా కళ్లారా చూడాలని ఉందమ్మా.
శబరి అలా చెప్పగానే పంచమి బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. పంచమి, జ్వాలలకు నెలలు నిండుతాయి. మోక్ష పంచమికి వరుణ్ జ్వాలకు సేవలు చేస్తూ ఉంటారు.
కరాళి: ఎన్ని ప్రయత్నాలు చేసినా పంచమి తప్పించుకుంటుంది. సీమంతం జరిగితే పంచమి గర్భాన్ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ఈ రోజే ఈక్షణమే ఏదో ఒకటి చేయాలి. గరుడ రాజు సాయం అడుగుతాను. అని గరుడ రాజుకు ధ్యానం చేస్తుంది.
గరుడరాజు: మళ్లీ ఏదైనా సాయం అవసరం వచ్చిందా కరాళి.
కరాళి: అవును గరుడ రాజ. మీరు ప్రసాదించిన శక్తిని ఫణేంద్రలో ప్రవేశపెట్టి జ్వాల గర్భంలో ప్రవేశపెట్టాను. ఇప్పుడు పంచమి గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి. పంచమికి సీమంతం అయితే ముత్తయిదువల ఆశీర్వాదంతో పిండం గట్టిపడుతుంది. ఇక దాన్ని ఏం చేయలేం. అందుకే ఈ లోపే పంచమి గర్భం పోయాలా చేయాలి. పంచమి గర్భంలో బిడ్డ బయటకు వస్తే నాకు చావు పుట్టినట్లే. ఇక ఆ బిడ్డగా పుట్టబోయే విశాలాక్షి నాగలోకానికి మహారాణిలా వెళ్లిపోతుంది. అది మీకు కూడా నష్టమే. రేపు మీ రెండు లోకాలకు యుద్ధం జరిగితే వాళ్లే గెలుస్తారు.
గరుడరాజు: అలా జరగడానికి వీళ్లేదు కరాళి. విశాలాక్షి పుట్టకూడదు అనే నేను నీతో చేతులు కలిపాను. ఇప్పుడు నేను నీకు చెప్పే గరుడ మంత్రం పఠించు కరాళి. గర్భంలోని గరుడ పిండం పెద్ద శబ్ధం చేస్తుంది. ఆ సూక్ష్మ శబ్ధాన్ని పంచమి గర్భంలోని విశాలాక్షి భరించలేదు. దీంతో అది విచ్ఛిన్నం అయిపోతుంది.
పంచమి, జ్వాలలకు సీమంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. చిత్ర మాత్రం కోపంతో నిద్ర లేవదు. అంటి ముట్టనట్లు ఉంటుంది. దీంతో భార్గవ్ చిత్రని లేపి ఇప్పుడు రెడీ అయి రాకపోతే మా పెద్దమ్మ నగలన్నీ పంచమి, జ్వాలలకే ఇచ్చేస్తుందని అంటాడు. దీంతో చిత్ర రెండు నిమిషాల్లో రెడీ అయిపోతానని వెళ్తుంది.
పంచమి అందంగా ముస్తాబయి తనని తన కడుపులోని బిడ్డను తడిమి చూసుకొని మురిసిపోతుంది. మోక్ష కూడా పంచమిని చూసి చాలా సంతోషిస్తాడు. ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఇక వైదేహి పంచమిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. పంచమి ఆశీర్వాదం తీసుకోవడానికి వంగితే వైదేహి వద్దని అంటుంది. కూతురు లేని లోటు తీర్చుతున్నావని పంచమిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. అత్త మాటలకు పంచమి ఏడుస్తుంది.
శబరి, మోక్ష, రఘురాం పంచమి గురించి మాట్లాడుకుంటారు. పంచమిని సీమంతం తర్వాత వెళ్లకుండా చేయాలని మోక్షతో చెప్తుంది. ఇక జ్వాల కూడా అందంగా రెడీ అవుతుంది. పంచమికి సీమంతం జరిగే ఈ రోజే చివరి రోజు కావాలని అనుకుంటుంది. మరోవైపు నాగ దేవత, నాగేశ్వరిలు పంచమి కడుపులోని తమ మహారాణి కోసం పూజలు చేస్తారు. పంచమి, జ్వాలలకు సీమంతం జరుగుతుంది. ఇక కరాళి గరుడ మంత్రం పఠిస్తుంది. అందరూ పంచమి, జ్వాలలను ఆశీర్వదిస్తారు. ఇక కరాళి జ్వాలలోకి మంత్ర బలంతో గరుడ శక్తిని ప్రవేశ పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: పవిత్ర జయరామ్ యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు - భర్త చంద్రకాంత్