Chandrakanth About Pavithra Jayaram Death: ‘త్రినయని’ సీరియల్‌లో ఒక రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు పవిత్ర జయరామ్. మే 12 తెల్లవారుజామున మహబూబ్‌నగర జిల్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం కలకలం సృష్టించింది. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో పవిత్ర జయరామ్‌తో పాటు తన భర్త చంద్రకాత్ కూడా ఉన్నారు. కానీ చంద్రకాంత్ పలు గాయాలతో బయటపడగలిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రకాంత్.. యాక్సిడెంట్‌కు సంబంధించిన వివరాలను బయటపెట్టడానికి అందరి ముందుకు వచ్చాడు.


షాక్‌కు గురయ్యింది..


పవిత్ర జయరామ్ అసలు యాక్సిడెంట్‌లో గాయాలు అవ్వడం వల్ల మరణించలేదని షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు చంద్రకాంత్. తాము కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ఆర్టీసీ బస్సు తమరిని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు తమ డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పాడని, దాని వల్ల కారు డివైడర్ ఎక్కిందని చెప్పుకొచ్చాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత చంద్రకాంత్‌కు తగిలిన గాయాలను చూసి పవిత్ర షాక్‌కు గురయ్యారని, అదే సందర్భంలో తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని పేర్కొన్నాడు. పవిత్రకు హార్ట్ ఎటాక్ రాగానే అంబులెన్స్‌కు ఫోన్ చేశామని తెలిపాడు. కానీ అంబులెన్స్ 20 నిమిషాలు లేట్‌గా వచ్చిందని చంద్రకాంత్ వాపోయాడు. ఒకవేళ ఆంబులెన్స్ సమయానికి వచ్చుంటే పవిత్ర బ్రతికేదని అన్నాడు.


ప్లీజ్ వెనక్కి రా..


పవిత్ర జయరామ్‌తో కలిసి తాను దిగిన చివరి ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు చంద్రకాంత్. దాంతో పాటు ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ‘పాప నీతో దిగిన లాస్ట్ ఫోటో. నువ్వు నన్ను ఒంటరిగా వదిలేశావన్నది నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఒక్కసారి మామ అని పిలువే ప్లీజ్. వెనక్కి రా ప్లీజ్. నా పవి ఇక లేదు’ అని చెప్పుకొచ్చారు చంద్రకాంత్. ‘నన్ను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయావు’ అంటూ వీరిద్దరు కలిసి చేసిన రీల్స్‌ను కూడా షేర్ చేశాడు. యాక్సిడెంట్ వల్ల చంద్రకాంత్ చేతికి, తలకు గాయాలు అయ్యాయి. తను షేర్ చేసిన వీడియోలో యాక్సిడెంట్ వల్ల పవిత్ర మొహానికి కూడా గాయాలు అయ్యాయని తెలుస్తోంది. కానీ దాని వల్ల తను మరణించలేదని, హార్ట్ ఎటాక్ వల్లే పవిత్ర మృతిచెందిందని క్లారిటీ ఇచ్చాడు చంద్రకాంత్.






ఎమోషనల్ పోస్టులు..


పవిత్ర జయరామ్ అని చెప్తూ బుల్లితెర ప్రేక్షకులు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ‘త్రినయని’ సీరియల్ తిలోత్తమగా తను సంపాదించుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే తనను బుల్లితెరపై చాలా మిస్ అవుతామంటూ తన ఫ్యాన్స్ అంతా పోస్టులు షేర్ చేయడం మొదలుపెట్టారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని అన్నారు. తన జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోతుందని ఊహించలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టమైన వ్యక్తిని కోల్పోయిన చంద్రకాంత్ బాధను చూస్తూ చాలామంది నెటిజన్లు ఎమోషనల్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు సైతం పవిత్రను ఎప్పటికీ మర్చిపోలేమని తమ బాధను షేర్ చేసుకుంటున్నారు.


Also Read: అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలనుకున్నా - ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ చివరి ఇంటర్వ్యూ