Naga Panchami Serial Today Episode పంచమి, మోక్ష, మేఘన మాట్లాడుకుంటారు. మేఘన పంచమితో ఎప్పటికీ మీరిద్దరే భార్యభర్తలు, నువ్వు తన పక్కన లేవు ఇక ఎప్పటికీ రావు అని నేను నమ్మినప్పుడే మోక్ష పక్కన నాకు స్థానం ఉంటుందని మేఘన అంటుంది. ఆరోజు త్వరలోనే వస్తుందని పంచమి అంటుంది. 


పంచమి: మీ పెళ్లి అయిన మరుక్షణం నేను ఎవరికీ కనిపించను. నాగలోకం వెళ్లిపోతాను.
మోక్ష: అబద్ధం. మేఘనకు అలాంటి ఆశలు కలిపించకు పంచమి.. నిన్ను నేను మామూలు మనిషిగా మార్చుకుంటానని చెప్పాను కదా.. మేఘన నువ్వు ఇంతకు ముందు చెప్పిందే కరెక్ట్ నేను పంచమి ఎప్పటికీ భార్యాభర్తలం. మేఘన పంచమిని మార్చుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. 
పంచమి: మోక్షాబాబు కొంచెం నేను చెప్పేది వినండి నేను చెప్పిందే జరుగుతుంది మేఘన. మీ పెళ్లి జరగడం ఖాయం. నేను నాగలోకం వెళ్లడం నిజం.. మీరిద్దరే కాబోయే భార్యభర్తలు.. 
మేఘన: ఇద్దరూ వెళ్లిపోయిన తర్వాత.. పిచ్చి పంచమి, పిచ్చి మోక్ష. మా పెళ్లి చూడటానికి నువ్వు ఉండవు. నాతో కాపురం చేయడానికి మోక్ష ఉండదు. ఇద్దరూ చస్తారు. ఇదే నిజం. 


జ్వాలని కూర్చొపెట్టి చిత్ర, వరుణ్, భార్గవ్‌లు నిలదీస్తారు. మేఘనకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అడుగుతారు. మీరు చెప్పేది వింటుంటే నాకు ఏదో జరుగుతుందని అర్థమవుతుందని జ్వాల అంటుంది. ఇక వరుణ్ ఆ టైంలో నీకు ఎక్కడలేని శక్తి వస్తుంది. నన్ను కొడితే పడిపోయాను అని అంటాడు. దీంతో జ్వాల రేపు ఇంట్లో ఏదైనా మర్డర్ జరిగినా నా మీద తోసేస్తావు అని జ్వాల అంటుంది. తన మీద ఏదో ప్రయోగం చేస్తున్నారు అని అంటుంది. ఇక అందరూ కలిసి పంచమిని ఇంటి నుంచి తరిమేయాలి అని అనుకుంటారు. 


మరోవైపు మేఘన పూజ చేస్తుంటుంది. అది చూసిన పంచమి మేఘన మోక్షకు సరైన భార్య అవుతుంది అని అనుకుంటుంది. ఇంత భక్తి ఉన్న మేఘన మోక్షాబాబుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది అని వాళ్ల పెళ్లి అయిపోగానే తాను ప్రశాంతంగా నాగలోకం వెళ్లిపోవచ్చు అని అనుకుంటుంది. 


మీనాక్షి: నీ స్థానంలో మరొకరిని చూస్తేంటే నీకు బాధగా లేదా పంచమి.
పంచమి: ఆ స్థానంలో నాకన్నా మేఘనే మెరుగమ్మా..
శబరి: నువ్వు ఎవరో పంపితే ఈ ఇంటికి రాలేదు పంచమి ఆ శివయ్యే నా మనవడిని కాపాడటానికి నిన్ను పంపించాడు. 
చిత్ర: నువ్వు బామ్మ మాటలు విని ఆశలు పెంచుకోకు నిశ్చితార్థంతోనే నీ చీటీ చిరిగిపోయింది. రేపో మాపో జరగబోయే పెళ్లితో ఈ ఇంటికి నీకు ఉన్న సంబంధం పూర్తిగా చెరిగిపోతుంది. అప్పుడు నువ్వు మా ఇంటి గడప కూడా తొక్కలేవు. 


ఇక మేఘన పూజ పూర్తి చేస్తే వైదేహి, రఘురాం హారతి తీసుకుంటారు. మోక్షకి కూడా తీసుకోమని వైదేహి చెప్తుంది. తర్వాత మేఘన ఆశీర్వదించమని వైదేహి కాళ్లమీద పడుతుంది. మోక్షకి కూడా దండం పెట్టబోతే మోక్ష వెనక్కి వెళ్లిపోతాడు. ఇక గుడికి వెళ్తానని మేఘన వైదేహికి చెప్తుంది. మోక్షకి కూడా వెళ్లమంటే పనులు ఉన్నాయని చెప్తాడు. దీంతో మేఘన ఒంటరిగా వెళ్తుంది. 


శబరి: ఇప్పటికీ మించిపోయింది లేదు పంచమి. నా మనవడి మనసు నాకు తెలుసు. వాళ్ల అమ్మ పోరు పడలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. 
మీనాక్షి: అవును పంచమి. కావాలి అంటే నువ్వు మోక్ష ఎక్కడికైనా వెళ్లిపోండి. 
వైదేహి: అసలు మీ మీటింగ్ ఏంటి ఇక్కడ.
జ్వాల: పంచమి, మోక్షలను కలపడానికి మళ్లీ ప్రయత్నం చేస్తున్నారు.
వైదేహి: మీకు ఏం పనిలేదా అత్తయ్య రేపో మాపో పెళ్లి పెట్టుకొని మళ్లీ దీనికి ఆశలు పెంచుతున్నారా. 
పంచమి: మీరేం భయపడకండి అత్తయ్య ఎవరెన్ని చెప్పినా ఈ పెళ్లి ఆగదు. 
వైదేహి: ఆ విషయం నాకు తెలుసుగానీ నువ్వు ఎంత దూరంలో ఉండాలో అంత దూరం ఉండు. లేదంటే వెళ్లిపోయి పెళ్లి రోజు రా.. 
మోక్ష: అమ్మా పంచమిని ఏమైనా అన్నారు అంటే నన్ను అన్నట్లే. పంచమి ఇక్కడే ఉంటుంది. నా పెళ్లి తన ఇష్టప్రకారమే తన అనుకున్నట్లు జరిపిస్తుంది. ఆ కండీషన్‌తోనే నేను పెళ్లికి ఒప్పుకున్నాను.
వరుణ్: మోక్ష ఇది కరెక్ట్ కాదు మధ్యలో పంచమి మనసు మారి పెళ్లి ఆపేయ్ మంటే ఆపేస్తావా. 
పంచమి: నేను ఆపను ఆరు నూరు అయినా ఈ పెళ్లి జరుగుతుంది. 


పంచమి ఫణేంద్ర కోసం వెతుకుంది. ముఖ్యమైన చోటుకు వెళ్లాలి అని ఫణేంద్రకు చెప్తుంది. తోడుగా ఉంటే మంచిది అని అంటుంది. దీంతో ఫణేంద్ర ఎక్కడికైనా వస్తాను పంచమి నిన్ను క్షేమంగా నాగలోకం తీసుకెళ్లాలి అంత వరకు నీకు రక్షణగా ఉండి తీరాలి అని అంటాడు.


పంచమి: నేను భయంతో రమ్మని చెప్పడం లేదు ఫణేంద్ర. నువ్వు ఎప్పుడూ కరాళిని చూడలేదు కదా.ఈ రోజు నీకు చూపించడానికే తీసుకెళ్తాన్నా..  ఏంటి ఫణేంద్ర అలా అయిపోయావు. కరాళి అనగానే భయం పుట్టిందా.. 
ఫణేంద్ర: నాకెందుకు భయం అలాంటి వంద మంది కరాళిలు వచ్చినా నాకు ఏం కాదు. అయినా నీకు ఆ కరాళి కోసం తెలుసా..
పంచమి: కరాళి నాకు ఈ పెళ్లి జరగనిస్తుంది అని నమ్మకం లేదు. 
ఫణేంద్ర: కచ్చితంగా జరగనిస్తుంది పంచమి. కరాళి కోరిక కూడా మోక్ష మేఘనల పెళ్లి జరగాలి అనే. 
పంచమి: పేరు వినడం తప్పా కరాళిని నువ్వు ఎప్పుడూ చూడలేదు కదా. అలాంటిది కరాళి కోరిక నీకెలా తెలుసు ఫణేంద్ర. 
ఫణేంద్ర: నువ్వు కరాళి దగ్గరకు వెళ్లి గొడవ పడకూడదు అని అలా అన్నాను పంచమి. పెళ్లి వరకు తనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 
పంచమి: ఒకసారి వెళ్లి కలిసి మాట్లాడితే తన ప్లాన్ ఏంటో మనకు తెలుస్తుంది. ఏంటి ఫణేంద్ర ఆలోచిస్తున్నావ్.. నువ్వు రాను అంటే నేను ఒక్కదాన్నే వెళ్లి వస్తా.  
ఫణేంద్ర: నువ్వు రావొద్దు అన్నా రావడం నా ధర్మం పంచమి. పద వస్తాను. 


మేఘన మహాంకాళి దగ్గర పూజకు ఏర్పాటు చేసి తనకు నిశ్చితార్థం అయిపోయింది అని చెప్తుంది. పెళ్లి కూడా జరుగుతుంది అని ఆరోజే మోక్షని బలి ఇవ్వబోతున్నాను అని చెప్తుంది మేఘన. మరోవైపు పంచమి, మోక్ష అక్కడికి వస్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: డీ51 టైటిల్ లుక్: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్‌ ఇండియా మూవీ టైటిల్‌ ఇదే - ఆసక్తి పెంచుతున్న హీరో లుక్‌