Naga Panchami Today Episode వైదేహి నవ్వుతూ పంచమి, మోక్షలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది. జ్వాల, చిత్రలు షాక్ అవుతారు. మిగతా అందరూ హ్యాపీగా ఫీలవుతారు. పంచమి మోక్షలు కూడా సంతోషంగా ఇంట్లోకి వస్తారు. పంచమి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని అత్తని హగ్ చేసుకుంటుంది. వైదేహి ప్రేమతో పంచమిని దగ్గరకు తీసుకుంటుంది.  


పంచమి: చాలా సంతోషంగా ఉంది అత్తయ్య నా కడుపులోని బిడ్డ పుణ్యమా అని మీ మనసులో చోటు దక్కించుకున్నాను. 
వైదేహి: పాత విషయాలు ఏవీ మనసులో పెట్టుకోకు పంచమి. నీ కడుపులో పెరుగుతుంది మా వంశాంకురం. నువ్వు సంతోషంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. 
మోక్ష: చాలా థ్యాంక్స్ అమ్మ.
వైదేహి: ఏంట్రా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి దాన్ని చేస్తున్నావు నువ్వు తండ్రివి అవుతున్నావు అంటే నీ కంటే నాకే ఎక్కువ సంతోషంగా ఉంది. రేపు పది మంది ముత్తయిదువులను పిలిచి వాళ్ల చేత మీకు ఆశీర్వాదాలు ఇప్పించాలి. అప్పుడే మీకు పండండి బిడ్డ పుడుతుంది. శబరి అందరి నోళ్లు తీపి చేస్తుంది. ఫణేంద్ర, నాగేశ్వరి పాములు వారి సంభాషణ వింటుంటాయి. 
జ్వాల: ఏంటి సడెన్‌గా మారిపోయారు అత్తయ్య.
శబరి: నా కోడల్ని తనకు కాబోయే మనవులు మార్చేశారు.
వైదేహి: మీరు కూడా ఈ సంతోషాన్ని పంచుకోండి రేపు జరగబోయే ఫంక్షన్‌లో పాలు పంచుకోండి.


నాగేశ్వరి: ఏం యువరాజా మీకు ఏమైంది ఇలా ప్రవర్తిస్తున్నారు. పంచమికి హాని తలపెడితే ఎవరినీ నేను వదిలిపెట్టను. ఇది మీకు చెప్పడం రెండో సారి. ఈసారి చెప్పను యువరాజా. నాగకన్యల శక్తి ఏంటో మీకు తెలుసు. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోండి.
ఫణేంద్ర: ఏంటి బెదిరిస్తున్నావా..
నాగేశ్వరి: మిమల్ని కారు దగ్గరే వదిలేయడం తప్పు అయింది. ఈ సారి అలా జరగదు. వెంటనే వెళ్లిపోకపోతే నేను ఏంటో చూపిస్తాను. 
ఫణేంద్ర: తొందర పడకు నాగేశ్వరి త్వరలోనే నీకు పంచమికి సరైన గుణపాఠం చెప్తాను. 


మోక్ష పంచమిని ఎత్తుకొని తిప్పుతాడు. ఇక పంచమి కోసం భోజనం తీసుకొని వచ్చి తినిపించాలి అని ముద్ద నోటిలో పెడుతుండా వైదేహి ఇంకో ప్లేట్‌తో భోజనం తీసుకొని వచ్చి పంచమిని ఆపుతుంది. పంచమి కడుపులో మన ఇంటి వారసుడు అని నీ కంటే ఎక్కువ అధికారం నాకు ఉందని నేను తినిపిస్తాను అని పంచమికి గోరు ముద్దులు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇక పంచమి కోసం తాను స్పెషల్‌గా చేశాను అని పంచమిని చంటి పాపలా చూసుకోవాలి అని పంచమిని తానే స్వయంగా చూసుకుంటాను అని తిని పించబోతే మోక్ష తల్లిని అడ్డుకుంటాడు.


వైదేహి: ఏమైంది మోక్ష..
మోక్ష: వద్దమ్మా నువ్వు పెట్టొద్దు. 
వైదేహి:  అర్థమైంది మోక్ష ఇన్ని రోజులు నా కోడల్ని సరిగా చూసుకోలేదు. ఇన్ని రోజులు ప్రేమ చూపించలేదు. ఈ రోజు సడెన్‌గా ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అనే కదా నీ అనుమానం. మోక్ష ఏరోజు అయినా నేను కొట్టినా తిట్టినా నీ మీద ప్రేమ తోనే. పంచమి మీద కోపంతో కాదు. ఇప్పుడు నా కోడల్ని దగ్గరుండి చూసుకోవాల్సిన సమయం ఇది. చూడమ్మా ఇన్ని రోజులు నిన్ను సరిగా చూసుకోలేదు. నిన్ను బాధ పెట్టినా నీ బాధ నీలోనే పెట్టుకున్నావు. అందరం తిట్టినా నీ భర్త ప్రాణాలు నీ గుప్పెట్లో పెట్టుకొని వచ్చావ్. అందుకే నా కొడుకు అనుమానిస్తున్నాడు. నీకు  పెట్టే భోజనంలో విషం కలిపాను ఏమో అని అనుమానిస్తున్నాడు. ఇది విషం కాదమ్మా. ప్రేమ.. 
పంచమి: అత్తయ్య మీ కళ్లలో తెలుస్తుంది నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో నేను నమ్ముతున్నాను అత్తయ్య మీరు తినిపించండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. తినిపించండి..
మోక్ష: అమ్మా నీలో ఈ స్వచ్ఛమైన ప్రేమను నేను ఇప్పుడు చూస్తున్నా ఇది చాలమ్మా నాకు పుట్టుబోయే బిడ్డను మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో.
రఘురాం: మోక్ష తల్లి ప్రేమను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. 
మోక్ష: థ్యాంక్యూ డాడీ. ఇంత అందమైన ఫ్యామిలీని ఇచ్చినందుకు. నా పంచమి బాగుంటుంది. ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. మంచి బిడ్డకు జన్మనిస్తుంది అని నాకు నమ్మకం ఉంది.
పంచమి: అత్తయ్య నా భర్త ప్రాణాలు కోసం అలా మీమీద సీరియస్ అయ్యాను కానీ మీ మీద కోపం కాదు. నా బిడ్డ మీద దగ్గర సంతోషంగా ఉంటుంది. మా అమ్మ లేని లోటు మీరు తీర్చారు అత్తయ్య ఇది చాలు. 


ఫణేంద్ర కరాళి దగ్గరకు వచ్చి నాగేశ్వరి గురించి చెప్తాడు. మోక్ష వాళ్ల ఇంట్లో రేపు ఫంక్షన్ ఉంది అని ముత్తయిదువులు వస్తారని చెప్తాడు. దీంతో కరాళి మనం నాగేశ్వరి కళ్లు కప్పి ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. వాళ్ల జీవితంలో అలజడి సృష్టిస్తాను అని ఫణేంద్ర అంటాడు. ఇక కరాళి అది  మంచి అవకాశం అని మన పని చక్కబెట్టుకుందామని అంటుంది. 


పంచమి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాగేశ్వరి పాము అక్కడికి చాటుగా వస్తుంది. మోక్ష వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే తన అత్త ప్రేమ దక్కడంతో సంతోషంగా కన్నీళ్లు వస్తున్నాయి అని చెప్తుంది. ఇక మోక్ష ముందు ముందు మా అమ్మ నీ కాళ్లు కింద పెట్టుకుండా చూసుకుంటుందని  అంటాడు. ఇక పంచమి మన ఇద్దరి ప్రాణాలు కలిపితే మన బిడ్డ అని తనని సంతోషంగా చూసుకోవాలి అని అంటుంది. ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: నందినిని దూరం పెట్టిన హర్ష.. క్రిష్, సత్యల బాగోతం తెలిసి రచ్చ చేసిన భైరవి!