Seethe Ramudi Katnam Today Episode సుమతి ఇంట్లో అందరికీ బట్టలు కుట్టి ఇస్తుంది. శివకృష్ణ ఎమోషనల్ అయిపోతాడు. నువ్వు నా బంగారం అంటూ చెల్లిని అక్కున చేర్చుకుంటాడు. సుమతి కూడా అదే రేంజ్‌లో అన్నని పొగిడేస్తుంది. ఇక సుమతి తల్లి సుమతి ఫొటో పట్టుకొని ఏడుస్తుంది. ఫొటో పట్టుకొని నీ ప్రేమ వారసత్వం నీ పెద్ద మేనకోడలు మధుమితకు వస్తే బట్టలు కుట్టే నీ నైపుణ్యం నీ చిన్న మేనకోడలు సీతకు వచ్చిందని అంటుంది. మరోవైపు సీత మధుమిత గదికి వెళ్తుంది.
సీత: హాయ్ అక్క ఈరోజు నుంచి నువ్వు నేను కలిసి పడుకుంటున్నాం.
మధు: ఎందుకు..
సీత: ఒకవారం పాటు నేను మా ఆయన కలిసి పడుకోకూడదు. మహాలక్ష్మి గారు ఆర్డర్ వేశారు. చిన్నప్పుడు మనం కలిసి పడుకునే వాళ్లం. మళ్లీ అలాంటి రోజు ఇప్పుడు వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితిలో కలిసి పడుకుంటాం అని నేను అనుకోలేదు అక్క. నేను ఇలా నీ గదిలోకి రావడం నువ్వు ఇబ్బంది పడటం. నీకు అర్థం కాని విషయాలు నేను నీకు చెప్పాల్సి వస్తుంది అని నేను అనుకోలేదు. దీని అంతటికి కారణం ఆ మహాలక్ష్మి. తను నన్ను నా భర్తను విడదీస్తుంది. నిన్ను నన్ను శత్రువులిగా మార్చుతుంది.
మధు: ప్రతీ దానికి ఆవిడని ఎందుకు అంటావ్ సీత. నువ్వే కావాలి అని ఆవిడకు శత్రువు అవుతున్నావ్.
సీత: నీకు అంతే అర్థమైంది అక్క. అసలు విషయం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు.
మధు: నాకు అంతా తెలుసు. ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకు నువ్వే కారణం. రామ్ గారితో ఏదో గొడవ పడి ఉంటావ్. అందుకే నిన్ను ఇలా పంపించారు.
సీత: భార్యభర్తల గొడవ పడకగది దాటదు అక్క. నేను బయటకు వచ్చాను అంటే మా మధ్య మూడో వ్యక్తి వచ్చారని అర్థం చేసుకో అక్క. వాళ్లని నమ్ముతావు కానీ నీ సొంత చెల్లిని నమ్మవా అక్క.
మధు: కట్టుకున్న భర్తే నిన్ను బయటకు పొమ్మన్నాడు అంటే నువ్వు ఏం చేసుంటావో నేను ఊహించగలను. నీ భర్తతో గొడవ పడి నా దగ్గరకు వచ్చావ్ ఇప్పుడు నాతో కూడా గొడవ పడాలి అనుకుంటున్నావా.
మరోవైపు రామ్ సీత తన గదిలో పడుకొని తననే చూస్తున్నట్లు ఊహించుకుంటాడు. సీత తనతో సరదాగా మాట్లాడి కబుర్లు చెప్పి నిద్ర పుచ్చేది అని ఇప్పుడు సీత లేకపోవడంతో నిద్ర రావడం లేదు ఏం చేయాలి అని రామ్ అనుకుంటాడు. ఇక అప్పుడు అక్కడికి సీత వస్తుంది. రామ్ కళ్లు తెరిచిన, కళ్లు మూసుకున్నా నువ్వే కనిపిస్తున్నావ్ సీత అని చెప్తాడు. తనకి కాసేపు కబుర్లు చెప్పి నిద్ర పుచ్చమని అడుగుతాడు.
సీత: నేను అంటే నీకు అంత ప్రేమా మామ.
రామ్: చెప్పలేని అంత ప్రేమ నా మనసు అంతా నువ్వే ఉన్నావు.
సీత: మనసులో నామీద ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను ఎందుకు బయటకు పంపావ్ మామ.
రామ్: నువ్వెక్కడికి వెళ్లలేదు సీత. నా చెవులకు నీ మాటలే వినిపిస్తున్నాయి. నా కళ్లకు నువ్వే కనిపిస్తున్నావ్. నువ్వు లేకుండా నాకు క్షణం కూడా గడవదు సీత. నిన్ను ఇలాగే కౌగిలించుకొని ఉండిపోవాలి అనిపిస్తుంది. అని హగ్ చేసుకుంటాడు.
మహాలక్ష్మి: మనసులో.. రామ్ నిద్ర పోయాడో లేదో నాకు తెలీకుండా ఆ సీత ఏదైనా తింగరి పని చేస్తుందా ఏంటి అని రామ్ గది దగ్గరికి వచ్చి సీత, రామ్‌లు హగ్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది.
రామ్: నన్ను ఎప్పటికీ వదలకు సీత ఎప్పుడూ నాతో ఇలాగే ఉండు.
మహాలక్ష్మి: రామ్.. నువ్వేం చేస్తున్నావ్ రామ్.. తను నీ గదిలో ఉండకూడదు అని చెప్పాను కదా ఎలా రానిచ్చావ్. పైగా తనని హగ్ చేసుకొని మాట్లాడుతున్నావ్.
రామ్: మీరు పొరపడుతున్నారు పిన్ని ఇక్కడ ఎవరూ లేరు.
మహాలక్ష్మి: నీ పక్కనే ఉంది రామ్..
రామ్: ఇదినా ఊహ పిన్ని.
మహాలక్ష్మి: ఊహా ఏంటి రామ్ తను నిజంగానే వచ్చింది.
రామ్: అంటే నీకు కూడా సీత కనిపిస్తుందా.. ఏయ్ నువ్వు నిజంగానే వచ్చావా.. అంటే ఇది నా ఊహ కాదా.. ఎందుకు వచ్చావ్.
సీత: ఇందాక నా ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయాను నా ఫోన్ తీసుకెళ్లడానికి వచ్చాను.
మహాలక్ష్మి: సీత వెంటనే ఇక్కడి నుంచి వెళ్తావా లేదా..
సీత: వెళ్తాను అత్తయ్య మీరు బీపీ తెచ్చుకోకండి..
మహాలక్ష్మి: ఇదంతా నీ తప్పే రామ్ లోపలి నుంచి డోర్ లాక్ చేసుకో నేను నాక్ చేసేవరకు ఓపెన్ చేయకు.
మళ్లీ రామ్ సీతని ఊహించుకుంటాడు. నువ్వు నా ఊహల్లోకి కూడా రాకు అని చెప్తాడు. ఇక రామ్ గదిలోకి వెళ్లొద్దని సీతకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో సీత గదిలో నుంచి తరిమేగలరు కానీ తన మనసులో నుంచి తొలగించలేరు అని అంటుంది. వారం రోజుల్లో నిన్ను రామ్‌కి దూరం చేసి మధుని దగ్గర చేస్తుందని మహాలక్ష్మి అంటుంది. ఇక సీత అయితే ఇదే వారంలో నేను రామ్ విడదీయలేని బంధంగా మారుతాము అని అంటుంది. దీంతో మధుమిత ఈ ఇంటి కోడలు అయితే ఎలా ఉంటుందో నీకు రేపు ఉదయం చూపిస్తాను అని మహాలక్ష్మి చెప్పి వెళ్లిపోతుంది.
ఉదయం మధుమిత చక్కగా పూజ చేస్తుంది. రేవతి, చలపతి షాక్ అవుతారు. మహాలక్ష్మి బ్యాచ్ హ్యాపీగా ఫీలవుతారు. అర్చన మధుమితని పొగుడుతుంది. ఇక రేవతి ఈ ఇంట్లో పూజ చేస్తే కోడలిగా సీత, అత్తగా నువ్వు చేయాలి మధుమిత చేయడం ఏంటి అని ప్రశ్నిస్తుంది. మధుమిత కూడా ఇంటి మనిషి లాంటిదే అని అంటుంది. మధుమిత పూజ చేసినా మాకు అభ్యంతరం లేదు అని మహాలక్ష్మి అంటుంది. ఇక సీత చూసి షాక్ అవుతుంది. ఇక రామ్ కూడా దేవుడి పూజ అందరూ చేయొచ్చని అంటాడు. మహా మధు దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో నువ్వు పూజ చేయడం కొందరికి ఇష్టం లేదు అని సీతకు కూడా ఇష్టం లేదు అని సీత బుద్ధి నీకు తెలిసి పోతుంది అని మహాలక్ష్మి మధుమితతో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.