Naga Panchami Today Episode నాగసాధువు పంచమి ప్రెగ్నెంట్ అని చెప్తారు. వైదేహి అది జరగదు అని అంటుంది. నాగసాధువు తాను చెప్పేది నిజం అని అంటారు. ఇదంతా శివయ్య లీల అని చెప్తాడు. ఆ మాట విన్న కరాళి తన ఆశ్రమం దగ్గర కుప్పకూలిపోతుంది. పంచమి, మోక్షలు నాగసాధువు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.


కరాళి: ఆ పంచమి గర్భవతా.. అలా జరగడానికి వీల్లేదు. తన జీవితంలో సంతోషం అనేదే ఉండకూడదు. 
శబరి: స్వామి ఆశలు వదులుకున్న టైంలో మాకు ఆయువు పోశారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం.
నాగసాధువు: అంతా ఆ శివయ్య మాయ. ఇక మేం బయల్దేరుతాం అమ్మ. 
గౌరి: పంచమిని కౌగిలించుకొని.. అమ్మా పంచమి నువ్వు పండంటి బిడ్డకు జన్మనిస్తావు. నీకు ఏ కష్టం రాదమ్మా.. 
శబరి: అమ్మా గౌరి నీ బిడ్డను మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. పంచమి మా ఇంటి కోడలు కాదు. మా కోసం ఆ శివయ్య పంపించిన దేవతమ్మ. 
పంచమి: వెళ్లొస్తాం అమ్మా.. 
ఫణేంద్ర: పంచమి గర్భవతి అంటే ఇక నాగలోకం రాదు. నన్ను మోసం చేశావు పంచమి. నన్ను మోసం చేశావు. నిన్ను సంతోషంగా ఉండనివ్వను. 


కరాళి: నేను చేసిన ఏ ప్రయత్నం ఫలించడం లేదు అన్నయ్య. పంచమిని అడ్డుకోవడానికి నా శక్తులు సరిపోవడం లేదు. 
నంబూద్రీ: మనసు ఉంటే మార్గం ఉంటుంది కరాళి. ఆలోచనా శక్తి కోల్పోయినప్పుడే మనకు ఏ మార్గం కనిపించదు. 
కరాళి: ఎటు చూసినా నాకు నిరాశే కనపడుతోంది అన్నయ్య. మోక్ష బతకడమే కాదు ఆ పంచమి గర్భవతి కూడా. అన్ని సౌభాగ్యాలు పంచమికి దగ్గరవుతున్నాయి. నేనే ఏకాకిలా మిగిలాను. నిన్ను కాపాడుకోలేకపోయాను. నా శక్తులను కోల్పోయాను. సంతోషంగా ఉండబోతున్న పంచమిని చూస్తూ నేను బతకలేను అన్నయ్య. ఆ పంచమి కన్నా నేను ఒక మెట్టు పైన ఉండాలి. పంచమి స్థానం నేను పొందితేనే నాకు మొదటి విజయం లభిస్తుంది. ఈ కరాళి ప్రాణాలతో ఉండగా పంచమికి ఎలాంటి ఆనందం దక్కనివ్వను.


సుబ్బు (సుబ్రహ్మణ్య స్వామి) దీక్షలో ఉండగా స్వామి వాహనం నెమలి అక్కడికి వస్తుంది. పంచమి గర్భవతి అని, మోక్ష ప్రాణగండం తప్పిపోయింది అని భార్యభర్తలు కలిసిపోయారు అని మీరు తలచుకుని ఉంటే ఇదంతా ఎప్పడో జరిగేది అని నెమలి అంటుంది. దానికి సుబ్బు పంచమి మోక్ష ఒకర్ని ఒకరు గెలుచుకున్నారు ఆ బంధం చాలా స్ట్రాంగ్ అని ముందు ముందు ఇంతకంటే పెద్ద సమస్యలు వచ్చినా కలిసే ఎదుర్కొంటారు అని అంటాడు. దీంతో నెమలి స్వామి వాళ్ల సమస్యలు ఇంకా అయిపోలేదా అని ప్రశ్నిస్తుంది. దీంతో సుబ్బు పంచమి మోక్షలు కలిసి బతకడం శత్రువులకు నచ్చదు అని అంటాడు. 


మరోవైపు పంచమి మోక్షలు ఇంటికి వస్తారు. ఫణేంద్ర పాము కూడా వాళ్ల వెంట వస్తుంది. వాళ్లని చూసి మోక్ష అన్నలు సంతోషిస్తే వదినలు షాక్ అవుతారు. మీనాక్షి ఇద్దరికీ హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది.  


శబరి: అమ్మా పంచమి నువ్వు అందరి కంటికి సామాన్యమైన ఆడపిల్లలా కనిపించొచ్చు. కానీ నా కంటికి నువ్వు ఎప్పుడు ఒక దేవకన్యవి అమ్మ. మా మోక్షకు పునర్జన్మను ప్రసాదించావు. మా వంశం నీకు ఎప్పుడూ రుణపడి ఉంటుందమ్మ.
చిత్ర: మీరు ఇలా పొగిడే మా కొంప ముంచుతున్నారు బామ్మ. అది మనిషి రూపంలో ఉన్న పాము. దాని మాయ మీకు అర్థం కావడం లేదు.
రఘురాం: చిత్రా ఇదా సమయం. ఇంకెవరూ ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు.
చిత్ర: మాట్లాడుతాం ఇంత జరిగినా మళ్లీ దీన్ని ఇంటికి తీసుకురావడం కరెక్ట్ కాదు.  
మోక్ష: వదినా ప్లీజ్ మీరు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు. నా భార్యను అవమానిస్తే నన్ను అవమానించినట్లే. మళ్లీ మళ్లీ చెప్తున్నా నేను కంట్రోల్ తప్పే పరిస్థితి రానివ్వకండి. 
భార్గవ్: మా బాధ నీ గురించే మోక్ష. నిన్ను చూసి డాక్టర్ కూడా లాభం లేదు అని చెప్పేశారు. ఆల్‌ మోస్ట్ డెత్ పొజిషన్. దానంతటికి పంచమే కారణం అని మేం నమ్ముతున్నాం. 
శబరి: మీ నమ్మకాలు మీ దగ్గరే ఉంచుకోండి. పంచమినే లేకపోతే మళ్లీ మోక్షని ఇలా ప్రాణాలతో చూసేవాళ్లమే కాదు. మనందరం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ దేవత రుణం తీర్చుకోలేము.
వైదేహి: మోక్ష, పంచమిలోపలికి వెళ్తుంటే. నా అనుమానం తీర్చాకే మీరు లోపలికి వెళ్లాలి. నీకు సంతానయోగం లేదు అని నీ అంతట నువ్వే చెప్పావు. అలాంటిది ఇప్పుడు నువ్వు గర్భవతివి అంటే మేం ఎలా నమ్మాలి. జ్వాల, చిత్రలు షాక్ అయిపోతారు.
శబరి: నాగసాధువులు సామాన్యులు కాదు వైదేహి. వారు చెప్పారు అంటే అది నూరుకు నూరు పాళ్లు నిజమే అయింటుంది.
వైదేహి: నేను అడిగేది అదే అత్తయ్య గారు. అసలు సంతాన భాగ్యమే లేనప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది. 
శబరి: ఇక లేదు అనుకున్న మన మోక్షకు తిరిగి ప్రాణం ఎలా వచ్చింది వైదేహి. ఆ శివయ్య తలచుకుంటే ఏదైనా సంభవమే. 
వైదేహి: మోక్షకు, మేఘనకు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది ఇప్పుడు ఆ పెళ్లి ఆగిపోతే ఎవరు పాపం మూటకట్టుకుంటారు. 
చిత్ర: చివరి నిమిషంలో ఈ మాయలాడికి ఇలాంటివి చేయడం అలవాటే కదా. పెళ్లికి దగ్గరుండి తనే అన్ని చేసి ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ డ్రామా ఆడి పెళ్లి ఆపించేసింది. 
జ్వాల: ఈ పెళ్లి జరగదు అని మేఘనకు అనుమానం వచ్చినట్లు ఉంది. అందుకే పాపం చెప్పాపెట్టకుండా తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోయింది. 
పంచమి: భగవంతుడి సాక్షి చెప్తున్నా ఇలా జరుగుతుంది అని నేను కలలో కూడా అనుకోలేదు. 
వైదేహి: మేఘన ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. ఎవరు నమ్మినా నువ్వు గర్భవతివి అని నేను నమ్మను. 
రఘురాం: వైదేహి నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా. మోక్ష తిరిగి బతికొచ్చినందుకు సంతోషపడు. మోక్ష పంచమిని లోపలికి తీసుకెళ్లు.  


పంచమి: మళ్లీ తిరిగి నేను ఈ ఇంట్లోకి అడుగుపెడతాను అని అనుకోలేదు మోక్షాబాబు. 
మోక్ష: నా ప్రాణాల మీదకు వచ్చినా మనకు ఓ మంచి పనే జరిగింది పంచమి. ఇక నువ్వు భూలోకం వదిలి వెళ్లలేవు. నాగలోకానికి నీకు సంబంధం తెగిపోయింది. మనల్ని ఎవరూ విడదీయలేరు.
పంచమి: అదే ఏదైనా జరిగే ఉంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. నేను చనిపోయి మీతో వచ్చేదాన్ని. 
మోక్ష: మన కోరిక నెరవేరింది. మనం అనుభవించిన మనోవేధన అంతా ఇంతా కాదు. నా పంచమిని నా నుంచి ఇంకా ఎవరూ వేరు చేయలేదు. 
పంచమి: మన జీవితంలో ఇవి అత్యంత మధురమైన క్షణాలు. మన బిడ్డ రూపంలో మనకు మళ్లీ కష్టాలు మొదలవుతాయి. 
మోక్ష: అలా అనకు పంచమి మన బిడ్డకు ఎలాంటి కష్టాలు లేవు రావు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీక దీపం 2 ప్రివ్యూ: 'కార్తీక దీపం 2'లో అదే దీప, కార్తీక్‌.. అవే ఎమోషన్స్ చూస్తారు - కానీ ఇది కొత్త కథ