Naga Panchami Today Episode కరాళి ప్రయోగించిన తేనెటీగలు సుబ్రహ్మణ్య స్వామి మహిమకు వెనుదిరుగుతాయి. దీంతో కారళి షాక్ అయి గండు చీమల్ని ప్రయోగిస్తుంది. దాన్ని గమనించిన నాగేశ్వరి కరాళి ఏవో దుష్ట శక్తులను ప్రయోగిస్తుందని యువరాణిని కాపాడుకోవాలని అనుకొని పాములా మారి గండు చీమలకు ఎదురెళ్తుంది. దీంతో కరాళి చీమల ప్రయోగం కూడా ఫ్లాప్ అవుతుంది.
పంచమి: స్వామి నన్ను ఆహుతి తీసుకొని నా భర్తని బతికించు. అని పంచమి ప్రార్థిస్తుంది. నాగేశ్వరి పాము అక్కడకి వస్తుంది. హోమం పూర్తి అవుతుంది. ఫణేంద్ర కూడా చూస్తుంటాడు. అయినా మోక్ష లేవడు. ఇప్పటికి కూడా నీ మనసు కరగలేదా శివయ్య నన్ను బలి తీసుకో మోక్ష బాబుని బతికించు నా మాటను నిలబెట్టు తండ్రీ. నన్ను నీలో కలుపుకో శివయ్య. పంచమి మోక్షను లేపుతుంది. మోక్ష లేకపోవడంతో తాను ఆహుతి అవుతుంది. అని తన ప్రాణాలు తీసుకొని తన భర్తను బతికించు అని పంచమి శివుడిని వేడుకొని అగ్నిలో దూకడానికి వెళ్తుంది.
గౌరి: అమ్మా పంచమి వద్దు అమ్మ. పంచమి..
పంచమి అగ్నిలో దూకడానికి వెళ్తుంది. ఇంతలో నాగేశ్వరి పాము పంచమి కాళ్లకు అడ్డు పడుతుంది. అందరూ షాక్ అవుతారు.
పంచమి: శివయ్య నన్ను వెళ్లనివ్వు అడ్డు తప్పుకో. శివయ్య నీకే చెప్పేది అడ్డు తప్పుకో. నన్ను ఆపొద్దు శివయ్య. నన్ను బలి తీసుకో. మోక్షాబాబుని బతికించు. నా మాట నిలబెట్టు తండ్రి. నన్ను నీలో కలుపుకో.
శివుడి విగ్రహం నుంచి శక్తి వచ్చి మోక్షలో చేరుతుంది. దీంతో మోక్షలో చలనం వస్తుంది. ఇక పంచమి తండ్రి మోక్ష కళ్లు తెరిచాడు అని చెప్తాడు. పంచమితో పాటు అందరూ చాలా సంతోషిస్తారు. అందరూ శివుడికి వేడుకుంటారు. పంచమి శివుడికి వేడుకుంటుంది. ఇక నాగేశ్వరి పాము శివుడు దగ్గరకు వెళ్లి పంచమిని చూస్తుంటుంది. సరిగ్గా అప్పుడే పంచమి తల్లి ఆత్మ పంచమి కడుపులోకి చేరుతుంది. దాన్ని నాగేశ్వరి పాము చూస్తుంది. పంచమి కడుపులోకి తల్లి ఆత్మ చేరడంలో పంచమి కడుపు పట్టు కొని కళ్లు తిరిగి పడిపోతుంది.
మోక్ష లేచి పంచమి కోసం వెతుకుతాడు. పంచమి కళ్లు తిరిగి పడిపోవడం చూసి మోక్ష కంగారు పడతాడు. ఇక నాగసాధువు పంచమి దగ్గరకు వెళ్లి పంచమి కళ్లు తెరిచేలా చేస్తారు. ఇక మోక్ష పంచమి ఇద్దరూ ఒకర్ని ఒకరు హగ్ చేసుకుంటారు. ఇద్దరూ శివయ్యను దండం పెట్టుకుంటారు.
నాగసాధువు: అమ్మ పంచమి నువ్వు నిజంగా ఆ శివయ్య వర పుత్రికవే. నువ్వు దేవకన్యవే. ఒక్క సారి నీ చేయి ఇలా ఇవ్వు అమ్మ. అమ్మ పంచమి నువ్వు ఇప్పుడు గర్భవతివి. త్వరలో మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు.
ఆ వార్త విని కరాళికి కళ్లు తిరిగినంత పని అవుతుంది. ఫణేంద్ర కూడా షాక్ అయిపోతాడు.
వైదేహి: స్వామిజీ మీరు ఏం తెలీకుండా చెప్పకండి. అలాంటి అవకాశమే లేదు.
నాగసాధువు: అంతా శివమయం. ఆ స్వామి తలచుకుంటే జరగని దంటూ ఏం ఉండదు. నా మాట అబద్ధం కాదు. పంచమి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవతుంది.
Also Read: రామ్ గోపాల్ వర్మ: ‘నా పెళ్లాం దెయ్యం’ అంటున్న ఆర్జీవీ - అందరి పెళ్లాలు అంతేనంటున్న నెటిజన్స్