Naga Panchami Today Episode: మోక్ష పంచమిని కలుస్తాడు. నా ప్రాణం నీ ఒడిలోనే పోవాలి అని.. అంతవరకు నన్ను వదిలిపెట్టకు పంచమి అని ప్రాధేయ పడతాడు. దీంతో పంచమి మోక్షని హగ్ చేసుకుంటుంది. అయితే అందంతా పంచమి కన్న కల అని తెలుసుకొని తన తల్లిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది.
గౌరి: పంచమి నువ్వు పేరుకే ఇక్కడ ఉన్నావు. మనసు, ప్రాణం మొత్తం మోక్షబాబు దగ్గరే తిరుగుతాయి.
పంచమి: కానీ తప్పదు అమ్మ దేవుడులాంటి మోక్షాబాబుకి నా కారణంగా అన్యాయం జరగకూడదు. తను పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలమ్మా.. మరోవైపు కొందరు ఆడవాళ్లు వచ్చి పంచమిని మోక్ష వదిలేశాడు అని అంటారు. ఇక ఫణేంద్ర పంచమి క్లోజ్‌గా మాట్లాడుతున్నారని ఆ అబ్బాయి ఎవరు అని అడిగి సూటిపోటి మాటలు అంటారు.
గౌరి: అమ్మా పంచమి లోకులు అనే మాటలు నువ్వు భరించలేవు. నువ్వు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలమ్మా. నా మనసు చంపుకొని చెప్తున్నా నువ్వు నీ నాగలోకం వెళ్లిపో తల్లీ. అక్కడైనా సంతోషంగా ఉండు. నా గురించి ఆలోచించకు తల్లీ. నువ్వు వెళ్లిపో పంచమి.
పంచమి: ఈలోకంలో నేను చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి అమ్మా.. అవి పూర్తి చేసి అప్పుడు నువ్వు చెప్పినట్లు చేస్తాను అమ్మా. నీ బిడ్డ ఎప్పుడూ నీకు తల వంపులు తెచ్చి పెట్టదమ్మా..
మరోవైపు మేఘన బ్యాగ్ పట్టుకొని కిందకి వస్తుంది. అందర్ని పిలిచి తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నా అని చెప్తుంది. పంచమి లేని ఇంట్లో ఉండనని అంటుంది. జ్వాల, చిత్రలు అయితే ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని అనుకుంటారు.
శబరి: నువ్వు పంచమి ఫ్రెండ్‌వి. మంచిదానివి అప్పుడప్పుడు వస్తూ ఉండు మేఘన.
మేఘన: చూస్తుంటే నిజంగానే పంపించేసేలా ఉన్నారే..
భార్గవ్: మేఘన మా మోక్షని కాపాడినందుకు చాలా థ్యాంక్స్.
వరుణ్: ఎక్కడైనా డ్రాఫ్ చేయాలి అంటే చెప్పు మేఘన నేను డ్రాఫ్ చేస్తా..
వైదేహి: మేఘన చేసిన సాయానికి మనం ఏం చేసినా తక్కువే.
మేఘన: మోక్షాబాబు నేను నా ఫ్రెండ్ తీసుకొస్తే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు తను లేని ఇంట్లో నేను ఉండటం బాగోదు కదా.అందుకే నేను వెళ్తున్నా మోక్షాబాబు. మళ్లీ మనం కలుస్తామో లేదో తెలీదు.
మోక్ష: మేఘన నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఇష్టం అయితే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా..
మేఘన: మోక్షాబాబు..
మోక్ష: అమ్మా నాకు వేరే పెళ్లి చేయాలి అనుకున్నావ్ కదా తనకు అభ్యంతరం లేకపోతే నేను మేఘనను పెళ్లి చేసుకుంటాను.
మేఘన: అదికాదు మోక్షాబాబు పంచమి నా ప్రాణ స్నేహితురాలు. తనకు..
వైదేహి: ఇంకా ఏం చెప్పకు మేఘన మా మోక్ష పెళ్లికి ఒప్పుకున్నాడు అది చాలు. ఇక మాకు ఆ పంచమి పీడ పోయినట్లే.
వరుణ్: మోక్షా నీ మాటలు నేను నమ్మను. పంచమి అంటే నీకు ఎంత ఇష్టమో మాకు బాగా తెలుసు.
వైదేహి: వాడి పెళ్లి వాడి ఇష్టం మధ్యలో మీకు ఎందుకు.
శబరి: మనవడా నీ నిర్ణయం నాకు నచ్చలేదు. బాగా ఆలోచించుకో.
మోక్ష: ఒక నిర్ణయానికి వచ్చే ఇలా చెప్తున్నా శబరి. అమ్మా తనకి కూడా ఇష్టమైతే ఇక్కడే ఉండమని చెప్పు.
మేఘన: నా మాటల్ని మోక్ష పూర్తిగా నమ్మేశాడు. ఇక వీళ్ల ఎవ్వరి మాటలు చెల్లవు.
వైదేహి: ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్ మా మోక్ష మాటలు విన్నావు కదా..
మేఘన: ఎంతో అదృష్టముంటే తప్ప మోక్ష లాంటి వ్యక్తి భర్తగా దొరకడు. ఆంటీ ఒక్కసారి ఆ గుడికి వెళ్లి మొక్కుకొని వస్తాను.
చిత్ర: అక్కా ఇదంతా చూస్తుంటే ఈ మేఘన పక్కా ప్లాన్‌తోనే మన ఇంటికి వచ్చినట్లుంది.
జ్వాల: ఆ పంచమినే దరిద్రం అనుకుంటే మేఘన పరమ దరిద్రంది. పైసా కట్నం తేకుండా పెళ్లి చేసుకొని మనతోపాటు ఈ కోట్ల ఆస్తికి వాటాకు వస్తుంది. ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలి..
ఫణేంద్ర: నాగసాధువుతో.. స్వామి నాకు మీరు ఓ సాయం చేయగలరా..
నాగసాధువు: సాధువులం మాట సాయం తప్ప మరేం చేయలేం.
ఫణేంద్ర: నాకు కావాల్సింది మాటసాయమే స్వామి. మీరు పంచమికి ఒక మాట చెప్పి నాతో నాగలోకం రావడానికి ఒప్పించాలి. మీ మాట మీద పంచమికి గొప్ప గురి.
నాగసాధువు: ఆ శివయ్య మాట తప్ప పంచమికి మరెవ్వరి మాట చెల్లదు ఫణేంద్ర.
ఫణేంద్ర: మోక్ష బతికితే నాతో వచ్చేస్తా అంది స్వామి. కానీ ఇప్పుడు మోక్ష సంతోషంగా ఉంటే కానీ రాను అంటోంది.
నాగసాధువు: పంచమి మాట తప్పుదు నాయనా..
ఫణేంద్ర: ఎంత కాలం నేను ఇక్కడ తిరుగుతూ ఉండను స్వామి.
నాగసాధువు: పంచమి పక్కన తిరుగుతూ పంచమికి సాయం చేయడం ఆ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావించు ఫణేంద్ర.
ఫణేంద్ర: అలాగే స్వామి అంతకు మించి నేను చేయగలిగేది కూడా ఏం లేదు.
నాగదేవత: నాగలోకానికి పెద్ద ఉపద్రవం వచ్చి పడింది ఫణేంద్ర. యువరాణి మన నాగలోకానికి తప్పక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫణేంద్ర: నేను అదే పనిలో ఉన్నాను మాతా. నాగలోకానికి యువరాణి రూపంలో వచ్చింది కరాళి అనే ఓ మంత్రగత్తే అని తెలిసిపోయింది. అందులో నా పాత్ర యువరాణి పాత్ర కొంచెం కూడా లేదు మాతా.
నాగదేవత: నేను ఇప్పుడు తప్పొప్పుల గురించి విచారించడానికి రాలేదు. నీకు యువరాణిని నేను పెట్టిన ఆంక్షలు వెనక్కి తీసుకుంటున్నాను. మీరు ఇద్దరూ ఇప్పటికి ఇప్పుడే నాగలోకానికి వచ్చేయొచ్చు. ఆలస్యం అయితే నాగలోకానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ముంచుకొస్తుంది ఫణేంద్ర. యువరాణి చేతుల మీదుగా నాగమణికి పూజలు జరిపించాలి లేదంటే నాగమణి వైభవం కోల్పొయి మన లోకం అంధకారంలో కూరుకుపోతుంది.
ఫణేంద్ర: అర్ధమైంది మాతా. యువరాణిని నాగలోకం రప్పించడానికి ఒప్పించాను కానీ కొన్ని కారణాల వల్ల కాలయాపన జరుగుతోంది మాతా.
నాగదేవత: వీలైంత తొందరగా యువరాణిని నాగలోకం తీసుకొచ్చి నాగలోకాన్ని కాపాడే కార్యంలో భాగం పంచుకో ఫణేంద్ర.
ఫణేంద్ర: ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నేను యువరాణిని తీసుకెళ్లి నాగలోకాన్ని కాపాడలేకపోతే నా జన్మ వృథా అయినట్లే. ఎలా అయినా తీసుకెళ్లిపోవాలి అని ఫణేంద్ర అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.