Naga Panchami Serial Today Episode: పంచమి తన చితిని తానే పేర్చుకొని దాని చుట్టూ తిరిగి ప్రదక్షణలు చేసి నిప్పు పెడుతుంది. మోక్షతో తాను గడిపిన క్షణాలు గుర్తు చేసుకొని ఏడుస్తుంది. ఇక ఓం నమఃశివాయ అంటూ దండం పెడుతూ.. అగ్నిలోకి దూకేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు పౌర్ణమి గడియలు రావడంతో పంచమి పాముగా మారుతుంది. అగ్నిని చూస్తూ నాగుపాములా డాన్స్ వేస్తుంది. ఇక మోక్ష ఒంటరిగా గుడిలో కూర్చొని పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.


మోక్ష: తనలో తాను.. పంచమి ఈపాటికే పాములా మారిపోయింటుంది. నన్ను చేరుకోలేని అంత దూరం వెళ్లి ఉంటుంది నన్ను కాపాడుకోవడం కోసం పంచమి ఎంత నరకం అనుభవిస్తుందో పాపం. 
మోహిని: (మోక్ష దగ్గరకు వెళ్లాలి అని చూస్తుంది కానీ పంచమి వేసిన విభూది కారణంగా లోపలికి వెళ్లలేకపోతుంది.) మోక్షను పిలుస్తుంది. మోక్ష ఈ గీత ఏంటి మోక్ష
మోక్ష: ఈ గీత పంచమి గీసింది. దీన్ని దాటి రావొద్దు అని చెప్పింది. అవును ఇంత సేపు నువ్వు ఎక్కడికి వెళ్లావు
మోహిని: నేను పంచమి వెనకే కొంత దూరం వెళ్లాను మోక్ష. తను అడవి వైపు వెళ్తొంది. ఈ సమయానికి పాముగా మారి నీ కోసం వస్తుంది
మోక్ష: పంచమి పాము ఇక్కడికి చేరుకోలేదు మోహిని. ఇక్కడికి రాలేను అంత దూరం వెళ్లిపోతాను అని పంచమి నాతో చెప్పింది
మోహిని: ఎంత దూరం వెళ్లినా పగ పట్టిన పాము శత్రువుని వదిలిపెట్టదు. ఎంత దూరం అయినా సరే వచ్చి కాటేసి పగ తీర్చుకుంటుంది
మోక్ష: ఆ విషయం పంచమికి కూడా తెలిసే ఉంటుంది. కచ్చితంగా తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది
మోహిని: అలాంటప్పుడు మనం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. పామును బంధించి విషం తీయలేం కదా. 
మోక్ష: నువ్వు పంచమిని అనుసరించి వెనుకే వెళ్లుంటే సరిపోయేది కదా.. 
మోహిని: పంచమి పాముగా మారి ఎలా అయినా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా అని ఇక్కడే ఎదురుచూస్తున్నాను. ఈ అవకాశం పోతే మళ్లీ వచ్చే పౌర్ణమి వరకు మనం ఎదురుచూడాలి మోక్ష. అప్పుడు ఆ విషానికి విరుగుడు వేయడం బాగా ఆలస్యం అవుతుంది. అలా జరిగితే నీకే బాగా నష్టం. 
మోక్ష: నిజమే మోహిని ప్రతీ పౌర్ణమికి ఇలా భయపడేకంటే ఆ విషానికి విరుగుడు కనిపెడితే ఏ బాధ ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం ఆలోచించు
మోహిని: మనద్దరం పంచమి వెళ్లిన వైపు వెతుక్కుంటూ వెళ్లాలి. మరోమార్గం లేదు. 
మోక్ష: నేను పంచమి మాట కాదు అని ఈ గీత దాటి బయటకు రాలేను. నువ్వే వెళ్లు మోహిని
మోహిని: మోక్ష ఒక పని చేద్దాం. మా అన్న నంబూద్రీ నాకు మంత్ర తంత్రాలు నేర్పించారు. నేను ఎప్పుడూ వాటిని ప్రయోగించలేదు. ఒకసారి ప్రయత్నించి చూసి పంచమి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో చూస్తాను. 
మోక్ష: నిజంగా కనిపిస్తుందా మోహిని
మోహిని: అంచనా వేసి చూడొచ్చు మోక్ష. ఈ విద్య చాలా సాధారణమైన విద్య. మా ఊరిలో చాలా మందికి ఈ విద్య వచ్చి ఉంటుంది. నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను.. అని మోహిని తమలాపాకులలో పంచమి చితికి నిప్పు పెట్టుకోవడం.. పాములా మారే సీన్ చూపిస్తుంది. అది చూసి మోక్ష షాక్ అవుతాడు. 
చూడు మోక్ష పంచమి పాము మంట మధ్యలో మండిపోతుంది. 
మోక్ష: నో అలా జరగడానికి వీలు లేదు మోహిని
మోహిని: నీ దగ్గరకు రాకుండా ఉండటానికి ముందుగానే ఆలోచించినట్లుంది
మోక్ష: అయ్యో నన్ను రక్షించడం కోసం నువ్వు బలి అవ్వాలి అనుకుంటున్నావా పంచమి.. వద్దు పంచమి నువ్వు బతకాలి. నేను పోయినా పరవాలేదు.. నువ్వు ఉండాలి పంచమి. 
మోహిని: ఏంటి మోక్ష నువ్వు మాట్లాడేది.. 
మోక్ష: నన్ను రక్షించడం కోసం తాను ఆత్మహత్య చేసుకుంటుంది. నా పంచమి బతకాలి
మోహిని: పంచమి చనిపోతే నేను ఇక ఆ నాగమణిని మర్చిపోవాల్సిందే.. నేను ఇక మా అన్నను బతికించుకోలేను. నా శక్తులు నాకు రావు. మంట వేడికి పంచమి పాము బాగా అలసిపోయింది. వెళ్లి చాలా సులభంగా బంధించొచ్చు. వెంటనే నేను వెళ్లి పంచమిని పామును కాపాడుతాను
మోక్ష: నేను వస్తాను మోహిని
మోహిని: ఈ గీత దాటొద్దని నీకు పంచమి చెప్పింది కదా మోక్ష
మోక్ష: పర్వాలేదు మోహిని. పంచమి కన్నా నాకు నా ప్రాణం ఎక్కువ కాదు. నేను పోయినా పర్లేదు నా భార్య బతకాలి
మోహిని: మనసులో.. మోక్ష వస్తే పంచమి పాముని నా వెంట తీసుకెళ్లలేను. అక్కడ మోక్షని మూర్ఛపోయేలా చేసైనా సరే పంచమి పాముని తీసుకెళ్లిపోవాలి. పర్వాలేదు మోక్ష నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి కాపాడుతాను
మోక్ష: లేదు మోహిని నేను వస్తాను.. మోక్ష గీత దాటేస్తాడు..


మరోవైపు మృత్యుంజయ యాగం జరుగుతూ ఉంటుంది. ఇక నాగ దేవత నాగలోకంలో హోమం చేస్తూ ఉంటుంది. ఇక పంచమి పాము అగ్నిలో మంటకు ఇబ్బంది పడుతుంటుంది. దీంతో మంటకు కేకలు వస్తుంటుంది. దాన్ని నాగ దేవత వింటుంది. ఏమైందా అని చూస్తుంటుంది. నాగ దేవత కేకలు భరించలేక చెవులు మూసుకుంటుంది. దీంతో ఆమెకు పంచమి పాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. 


నాగదేవత: యువరాణి ఆత్మాహుతి చేసుకొని నాగలోకానికి మోసం చేయాలి అనుకుంటున్నావా.. జరగనివ్వను. నీ కల నెరవేరదు. ఈ రాత్రికి ఎలా అయినా సరే నువ్వు మోక్షను కాటేయాల్సిందే.. యువరాణి పీఠం అధిరోహించాల్సిందే.. అది జరగకపోతే ఈ నాగలోకానికే అవమానం. ఈ నాగదేవత విశ్వరూపం నీకు చూపిస్తాను.. అంటూ నాగ దేవత ఆగ్రహానికి గురై నృత్యం చేస్తుంటుంది. ఇక మోక్ష, మోహిని కూడా పంచమి దగ్గరకు వస్తుంటారు. ఇక ఐదు తలల పాము పంచమి ఆత్మహత్య చేసుకుంటున్న దగ్గర ప్రత్యక్షమవుతుంది. మరోవైపు అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాగకన్యలు, ఫణేంద్ర పాములుగా మారి యాగంపై దాడి చేయడానికి వెళ్లి మరోసారి విఫలం అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 



Read Also: 73వ వసంతంతోకి రజనీకాంత్, తలైవా గురించి 9 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!