Naga Panchami Telugu Serial Today Episode : సప్త రుషులు మోక్ష కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పి యాగం ప్రారంభిస్తారు. ఇక నాగలోకం నుంచి నాగ కన్యలు, ఫణేంద్ర యాగాన్ని ఆపేందుకు అక్కడికి వస్తారు. అందరూ యాగంలో పూర్తిగా లీనమైనప్పుడు పాములుగా మారి ఒక్కసారిగా దాడి చేయాలని ఫణేంద్ర నాగకన్యలకు సూచిస్తాడు. భయంతో వారంతా అక్కడి నుంచి పారిపోవాలని చెప్తాడు. హోమాన్ని భగ్నం చేసి వెంటనే యువరాణి దగ్గరకు వెళ్లి ఆమెను నాగలోకానికి తీసుకెళ్లి పోవాలని ఫణేంద్ర చెప్తాడు. మరోవైపు నాగ దేవత మిగతా నాగులతో సమావేశం అవుతుంది.
నాగదేవత: ఈరోజు కార్తీకపౌర్ణమి మన నాగలోకానికి ప్రత్యేకమైన రోజు. మనం ఆరాధించే చంద్రుడు మనకు ప్రత్యేకమైన శక్తులను ప్రసాదించే రోజు. ఈ రోజు మరో విశేషం కూడా జరగనుంది. మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువరాణి మన లోకానికి రానుంది. ఈ రాత్రికే పట్టాభిషేకం జరిపించి రాణి పీఠం మీద కూర్చొపెట్టాలి. అందుకే ఈ రోజు మనకు ఒక అద్భుతమైన రోజు కానుంది. ఏ ఆటంకం కలగకుండా.. యువరాణి రాకను ఏ శక్తి ఆపకుండా ఒక మహా పూజ జరిపిస్తాను. ఆ పూజ పూర్తి అయ్యేలోగా యువరాణి ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు నాగలోకం అంతా పండగ చేసుకుంది. పూజ ప్రారంభిస్తాను. అంటూ నాగదేవత హోమం చేస్తుంది.
పంచమి: మీరు ఇక్కడే ఉండండి మోక్షబాబు. నేను స్వామి గారు ఇచ్చిన విభూదిని గుడి చుట్టూ వేసి వస్తాను.
మోక్ష: అలాగే పంచమి
పంచమి: విభూది చల్లిన తర్వాత మనసులో.. శివయ్య నన్ను ఎందుకు పుట్టించావో తెలీదు కానీ అర్ధాంతరంగా నాకు ముగింపు పలుకుతున్నావు. ఇంకొన్ని నిమిషాల్లో నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నా దేహాన్ని పంచభూతాలు తనలో కలిపేసుకుంటాయి. పరమాత్మా.. నా ఆత్మను మాత్రం మీలో ఐక్యం చేసుకోండి. మా అమ్మకు గుండె ధైర్యం ఇచ్చి నా భర్తను కాపాడుకునే బాధ్యత నీదే శివయ్య. ఇంకెప్పుడు ఈ పంచమి మీకు కనిపించదు. మోక్షా బాబు చీకటి పడనుంది నేను త్వరగా వెళ్లాలి
మోక్ష: పంచమి.. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు పంచమి.
పంచమి: చాలా దూరం మోక్షాబాబు తిరిగి మిమల్ని చేరుకోలేని అంత దూరం
మోక్ష: అంత దూరం వెళ్లడం ఎందుకు పంచమి. నిన్ను నువ్వు ఓ గదిలో బంధించుకుంటే సరిపోతుంది కదా
పంచమి: అలా ఊపిరి ఆడకే మోక్షబాబు ఈ దారి ఎంచుకున్నాను. నాకు వేరే ఏ మార్గం కనిపించకే చివరికి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది
మోక్ష: నువ్వు ఒక్కదానివే అంత దూరం వెళ్లొద్దు పంచమి
పంచమి: అప్పుడే నేను మీ దగ్గరకు వచ్చి కాటేయలేను. నాకు ఇప్పుడు నా గురించి ఎలాంటి దిగులు భయం లేదు మోక్ష బాబు.. నా దిగులు అంతా మీ గురించే
మోక్ష: ఈ రాత్రి గడిస్తే చాలు పంచమి. మళ్లీ నిన్ను వదలను నువ్వు శాశ్వతంగా ఈ భూమ్మీద ఉండిపోయేలా చేస్తాను
పంచమి: ఇప్పటికే మీ గుండెల్లో మీ భార్యగా శాశ్వతంగా ఉండిపోయాను మోక్షాబాబు. ఆ స్థానాన్ని ఇంకెవ్వరూ చెరిపేయలేరు. ఈ జన్మకి ఇది చాలు మీరు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విభూది గీత దాటి బయటకు రాకూడదు.
మోక్ష: నువ్వే నా దగ్గరకు రాలేనప్పుడు నాకెందుకు పంచమి భయం. నాకు ఏం కాదు. నిన్ను నువ్వు కాపాడుకో పంచమి. నాకు నీ క్షేమం ముఖ్యం
పంచమి: నేను చాలా క్షేమంగా ఉండే చోటుకే వెళ్తున్నా మోక్షాబాబు. ఇక మీరు నా గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. మీరు మిమల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎవరికి కోపం తాపం వచ్చినా జీవితం మీద విరక్తి కలిగినా అవి రెండు నిమిషాలే. నమ్మక నమ్మక మీరు దేవుడిని నమ్మారు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోండి
మోక్ష: ఇప్పుడు నేను దేవుడ్ని పూర్తిగా నమ్ముతున్నా పంచమి
పంచమి: అలా నమ్ముకుంటే ఆ స్వామి మిమల్ని కాపాడుతారు. దేనికి అధైర్య పడకండి. ఎవరు ఉన్నా లేకున్నా తోడుగా ఎవరు రాకున్నా జీవితం ముందుకు సాగిపోవాల్సిందే. ఈ లోకంలో ఎవరూ ఏదీ శాశ్వతం కాదు
మోక్ష: ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు పంచమి
పంచమి: మనసుకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్పేయాలి. తర్వాత చెప్పాలి అనుకున్నా చెప్పలేం
మోక్ష: నీ ఆందోళన నాకు తెలుసు పంచమి. నాకు ఏం కాదు. నువ్వు భయపడిపోతున్నావ్
పంచమి: శాశ్వతంగా వదిలి వెళ్లిపోతున్నాను. ఇదే చివరి వీడ్కోలు. అందుకే నా ఆవేదన అంతా. నన్ను క్షమించండి మోక్షాబాబు
మోక్ష: ఏడవకు పంచమి తెల్లవారగానే అందరం హ్యాపీగా ఉంటాం. నాకోసం నువ్వు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నవు. ఇక నాకు ఏం కాదు
పంచమి: వెళ్తా మోక్షాబాబు మీరు ఈ గీత దాటి బయటకు రాకండి
ఇక పంచమి మోక్షకు జాగ్రత్తలు చెప్పి అడవికి వచ్చేస్తుంది. అయితే మోహిని పంచమికి తెలీకుండా తనని ఫాలో అవుతుంటుంది. ఇక మధ్యలో పంచమి మోహినికి కనపడదు. దీంతో మోహిని ఎక్కడికి వెళ్లినా పాముగా మారిన తర్వాత మోక్షను కాటేయడానికి గుడి దగ్గరకే వస్తుంది. దగ్గర్లోనే కాపు కాసి ఉండాలి అనుకుంటుంది. మోక్షకు కూడా తెలీకుండా పంచమి పామును గుట్టుగా తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది. మరోవైపు హోమం దగ్గర నాగకన్యలు, ఫణేంద్ర కాపు కాసి ఉంటారు. నాగ కన్యలు, ఫణేంద్ర పాములుగా మారి హోమం దగ్గరకు వెళ్లాలి అని ప్రయత్నిస్తారు. కానీ హోమం శక్తికి వెళ్లలేకపోతాయి. దీంతో వెనక్కి వెళ్లి పోతారు. మరోవైపు పంచమి మోక్షతో తన పెళ్లి గుర్తుచేసుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.