Naga Panchami Today Episode మోక్ష గుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ పంచమి పడుకొని ఉండటం చూసి పంచమి కడుపును టచ్ చేస్తాడు. దాంతో పంచమి లేస్తుంది. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు ఏడుస్తూ హత్తుకుంటారు. సుబ్బు ఇద్దర్ని చూస్తాడు. పంచమి మోక్షకు క్షమాపణలు చెప్తుంది. 


పంచమి: నన్ను క్షమించండి మోక్షాబాబు. మీపై మీ అమ్మకు ఉన్న ప్రేమ నా తల్లి ప్రేమను చంపేసింది.
మోక్ష: మా అమ్మది ప్రేమ కాదు పంచమి భయం. ఎవరో మాటల్న నమ్మి నీకు ఏదో అయిపోతుందని భయపడింది. 
పంచమి: మిమల్ని నాగలోకం నుంచే కాపాడుకున్నాను. నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడు మోక్షాబాబు.
మోక్ష: నాకు ఏం కాదు పంచమి. నువ్వు గర్భం తీయించుకోవడానికి ఒప్పుకోవడంతో నాకు చాలా బాధ వేసింది. ఎంత మధన పడి ఉంటే నువ్వు కడుపులో బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. 
పంచమి: అదే కానీ జరిగిఉంటే నేను నా ముఖాన్నికూడా మీకు చూపించలేకపోయేదాన్ని మోక్షాబాబు.  
మోక్ష: మన బిడ్డని కాపాడి నువ్వు చాలా మంచి పని చేశావ్ పంచమి. ఇంటికి వెళ్దాం రా..
పంచమి: నేను రాను మోక్షాబాబు ఇక్కడే ఉంటాను. ఇంతలో సుబ్బు అక్కడికి వస్తాడు. మోక్షాబాబు మన బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే నేను ఇక్కడే ఉంటాను. నా ప్రాణం పోయిన సరే నేను నా బిడ్డను పోగొట్టుకోను. నేను రాను.
మోక్ష: నేను ఉండగా నీకు ఏం కానివ్వను పంచమి. 


ఇక సుబ్బు వచ్చి పంచమిని మోక్షతో వెళ్లమని అంటాడు. దానికి పంచమి నువ్వు నన్ను చూసుకోలేవా సుబ్బు అని అడుగుతుంది. నీ భయం కారణంగా నీ బిడ్డను తండ్రికి దూరం చేయకని అంటాడు. ఇక మోక్ష తన బిడ్డ అనాథగా పెరగకూడదని అందరి ప్రేమ పొందాలని.. ఎవరైతే మన బిడ్డను అరిష్టం అన్నారో వాళ్లే అదృష్టం అనాలని అంటాడు. పంచమిని తీసుకొని మోక్ష ఇంటికి వెళ్తాడు. పంచమి ఇంట్లోకి రావడానికి జంకితే మోక్ష ఇది నీ ఇళ్లు పంచమి ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని లోపలికి తీసుకెళ్తాడు. ఇక శబరి పంచమిని పట్టుకొని ఇక ఎప్పటికీ ఎక్కడికీ వెళ్లొద్దని అంటుంది. చిత్ర, జ్వాలలు తలో మాట పంచమిని అంటారు.


వైదేహి: నున్ను డాక్టర్ దగ్గర అవమానించడానికే కదా నువ్వు పారిపోయావ్. మళ్లీ ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చావ్.
మోక్ష: అమ్మా..
వైదేహి: నువ్వు ఏం మాట్లాడకు మోక్ష. నేను నీ భార్యని బలవంతంగా తీసుకెళ్లలేదు కదా తనే ఇష్టపడి వచ్చింది కదా. 
మోక్ష: ఇప్పుడు నేను చెప్పున్నా వినండి నా భార్య నాతో కలిసి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడే డెలివరీ అవుతుంది. నా బిడ్డ ఈ ఇంట్లోనే పెరుగుతుంది. మీ ఎవరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా జరిగేది ఇదే.
జ్వాల: ఈ ఇళ్లు సర్వనాశనం అయినా పర్లేదా..
చిత్ర: మీకు పుట్టుబోయే అరిష్టం వల్ల మేం నాశనం అయిపోవాలా..
మోక్ష: నా బిడ్డ గురించి ఇంకొక్కసారి తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను. నా భార్యని ఎవరు అగౌరవ పరిచినా మర్యాదగా ఉండదు. ఈ ఇంట్లో కొందరు కావాలని గొడవలు సృష్టిస్తున్నారు. ఇక నేను అలాంటివి సహించను. ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉండండి. పంచమి కన్నీరు పెట్టుకునేలా ఎవరు ప్రవర్తించినా నేను ఊరుకోను. వాళ్లు రక్త కన్నీరు పెట్టుకునేలా చేస్తాను జాగ్రత్త. 


ఇక పంచమిని మోక్ష గదికి తీసుకెళ్తాడు. పంచమిని అన్నీ మర్చిపోయి నవ్వమని చెప్తాడు. పంచమి నవ్వకపోతే చక్కిలి గింతలు పెడతాడు. ఇక భోజనం తీసుకొచ్చి పంచమికి తినిపిస్తాడు.తర్వాత పంచమిని తన ఒడిలో పడుకోపెడతాడు.  


మరోవైపు కరాళి రగిలిపోతుంది. ఇక గాయాలతో ఫణేంద్ర అక్కడికి వస్తాడు. ఏమైందని అని కరాళి అడిగితే ఫణేంద్ర జరిగింది చెప్తాడు. తనని శపించి శక్తులు లాక్కున్న నాగదేవతకు బుద్ధిరావాలి అని అందుకు నాగ లోకం నాశనం అవ్వాలి అని అందుకు ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు. అయితే కరాళి తన కున్న శక్తులతో అంది సాధ్యం కాదని పంచమి కడుపులో ఉన్న విశాలాక్షి చనిపోవాలని అంటుంది. ముందు నాగేశ్వరి పని పట్టాలని అంటుంది. 


కరాళి: నాగలోకం నాశనానికి గురుడ లోకం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకు ఓ పని చేస్తా. నాకున్న వశీకరణ శక్తితో గురుడ లోక రాజును వేడుకొని గురుడ శక్తి సంపాదిస్తాను. అని కరాళి దీక్షలో కూర్చొంటుంది.


మరోవైపు వైదేహి మోక్ష మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చిత్ర, జ్వాలలు అక్కడికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: లిప్‌స్టిక్‌తో ముద్దులు పెట్టుకొని సత్యని ఇరికించేసిన క్రిష్‌.. నలుగులో కారం కలిపి రివేంజ్ తీర్చుకున్న సత్య!