Meghasandesham Serial Today Episode: నక్షత్ర వచ్చి గగన్‌ను సపోర్టు చేసి మాట్లాడుతుంది. అపూర్వ కోపంగా కొత్తగా వాణ్ని సపోర్టు చేసి మట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతుంది. దీంతో సపోర్టు చేయడం కాదు మమ్మీ. అలా చేయడం గగన్ తప్పు కాదు కదా అంటుంది. దీంతో ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు వెళ్లు అంటూ తిడుతుంది. నక్షత్ర వెళ్లిపోతుంది. మరోవైపు కృష్ణప్రసాద్ ఉదయం జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో చెర్రి వస్తాడు.
చెర్రి: ఏంటి నాన్నా కూల్ డ్రింక్ తాగుతున్నాడా?
ప్రసాద్: మరేం చేయనురా? నా ముఖం కూడా ఇష్టపడని వాడితో నేను ఏం చేయాలిరా? తప్పు చేయని వాడితో సారీ చెప్పమని ఎలా అడగాలి.
చెర్రి: ఇలాంటి విషయాలు ఆలోచించాలి అంటే తాగాల్సింది ఇది కాదు నాన్నా ఇంకోటి తాగాలి. అది నీకు రాదు.
అంటూ కూల్ డ్రింక్ తాగి బయటకు ఉమ్మేస్తాడు.
చెర్రి: ఏంటి నాన్నా ఏం కలిపావు ఇందులో..
ప్రసాద్: అది కొంచెం ధైర్యం కోసం మందు కలిపానురా? వాడు తప్పు చేయడని చెప్తుంటే ఈ ఇంట్లో ఎవ్వరూ నా మాట వినరురా? అందుకే వాణ్నే బతిమాలుకుంటే సరిపోతుంది. నువ్వే వాడి దగ్గరకు వెళ్లి కన్వీన్స్ చేయ్.
అని ప్రసాద్ చెప్పగానే చెర్రి నేను వెళ్లను అంటాడు. నువ్వు పెద్దవాడివి నిన్ను నాలుగు మాటలు అని వదిలేస్తాడు. నన్నైతే ఏకంగా కొట్టేస్తాడు. అంటాడు. ప్రసాద్ బలవంతంగా చెర్రిని గగన్ దగ్గరకు పంపిస్తాడు.
చెర్రి: సోదరా.. అది ఇందును పెళ్లి చేసుకోబోయేవాడిని కొట్టావట కదా?
గగన్: తప్పు చేశాడు కొట్టాను. అయితే
చెర్రి: నువ్వు వచ్చి సారీ చెప్తే కానీ పెళ్లి చేసుకోను అంటున్నాడు. అది సారీ చెప్పకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉందని అందరూ బాధపడుతున్నారు.
గగన్: సరే సారీ చెప్తే పెళ్లి చేసుకుంటాడా?
చెర్రి: అంతే కదా మరి.. అంతే సోదరా..!
గగన్: సరే చెప్పేద్దాం.. దానికి నువ్వు ఇంతలా బయపడాలా?
అంటూ చెర్రిని కొడతాడు. వాడికి నేను సారీ చెప్పాలన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇది అంటాడు. ఇదంతా చెర్రి కలగంటాడు. రానంటూనే ప్రసాద్ చెర్రిని కారు దగ్గరకు తీసుకెళ్తాడు. కారు ఎక్కిన తర్వాత చెర్రి కారులోంచి ఎస్కేప్ అవుతాడు. ప్రసాద్ ఒక్కడే గగన్ ఇంటికి వెళ్తాడు.
గగన్: ఏమైంది అమ్మా.. ఎందుకు వచ్చాడంట..
పూరి: ఏమో అన్నయ్యా..
గగన్: మనతో ఈ ఇంటితో అవసరం లేనివాళ్లు దారి తప్పి వచ్చినట్లున్నారు. మనకెందుకు పద అమ్మా..
ప్రసాద్: గగన్.. నాముఖం చూడటమే కాదు. నేను ఇక్కడికి రావడం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నీ కోపం నామీదే కానీ పిల్లల మీద కాదని నాకు తెలుసు. అయినా నీతో మాట్లాడుదామని ఇక్కడికి వచ్చాను. ఇందుకు మంచి సంబంధం వచ్చింది పెళ్లి ఘనంగా జరగబోతుంది అని అందరూ సంతోషపడుతుంటే నువ్వు వాణ్ని కొట్టావు. వాళ్లిప్పుడు పెళ్లి జరగదు అంటున్నారు. పెళ్లి జరగాలి అంటే నువ్వు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.
గగన్: ఏంటి క్షమాపణ చెప్పాలా? నేను వాడికి క్షమాపణ చెప్పాలా? అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఇందును రూంకి తీసుకెళ్లి తన జీవితం నాశనం చేయాలని చూశాడు. అందుకే కొట్టాను.
ప్రసాద్: అంటే వాడికి కాబోయే భార్య కదా?
గగన్: కాబోయే భార్యనే ఇంకా కాలేదు కదా? పెళ్లి కాకముందే అలా బయటికి పంపించడమే తప్పు. అలాంటిది వాడు అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తుంటే వాణ్ని తన్నకుండా నన్నొచ్చి సారీ చెప్పమంటున్నావా?
ప్రసాద్: ఓరేయ్ నువ్వు క్షమాపణ చెప్పకుంటే ఇప్పుడు ఆ పెళ్లి జరగదురా?
గగన్: తండ్రివేనా నువ్వు.. కన్నకూతురు జీవితం నాశనం చేయబోయాడు అని తెలిశాక. పెళ్లి వద్దు అని నువ్వు చెప్పాలి కానీ వచ్చి క్షమాపణ చెప్పమని నన్ను అడుగుతున్నావా?
ప్రసాద్: అందరికీ ఆ సంబందం నచ్చింది నీ వల్లే ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అంటున్నారురా?
అనగానే గగన్ కోపంగా నేను సారీ చెప్పడం జరగదు అని చెప్పి లోపలికి వెళ్లిపోతాడు. ప్రసాద్ బాధగా చూస్తుండిపోతాడు. భూమి వచ్చి ఓదారుస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా అంటాడు. తర్వాత గగన్‌కు జ్యూస్ తీసుకెళ్లిన భూమి అతన్ని కొట్టడం తప్పేం కాదు కానీ ఆ ఇంట్లో వాళ్ల బాధ పడలేక వచ్చి అంకుల్ అడిగినట్లు ఉంది అంటుంది. అమ్మాయి కష్టంలో ఉంటే వెళ్లి కాపాడారు చూడండి అందుకే మీరంటే నాకు ఇష్టం అంటుంది భూమి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు