Meghasandesham Serial Today Episode: తన పర్సనల్ అసిస్టెంట్ ఇంటర్వూ కి వచ్చిన అమ్మాయి గగన్ చూసి రొమాంటిక్‌గా ఫీలవుతూ మాట్లాడుతుంటే గగన్ కోపంగా తిట్టి అక్కడి నుంచి పంపించి వేస్తాడు. అమ్మాయి వెళ్తుంటే చెర్రి ఎదురుగా వస్తాడు. అమ్మాయి డాష్ ఇవ్వగానే సారీ సిస్టర్ అంటాడు. గగన్ విచిత్రంగా చూస్తుంటాడు.
చెర్రి: సోదర ఈరోజు మన ఇంట్లో పసుపు దంచడంతో ఇందు పెళ్లి పనులు మొదలైనట్టే.. నువ్వు వచ్చి ఉంటే చాలా బాగుండేది.
గగన్: నేను రాకపోతేనే ఆ పెళ్లి హ్యాపీగా జరుగుతుందిరా.. నేను వచ్చి అందరి ఆనందాలను పాడు చేయడం ఎందుకులే కానీ నువ్వేంట్రా కొత్తగా కనిపిస్తున్నావు.
చెర్రి: నేనా కొత్తగానా? ఏం లేదే..? అదే పాత టీషర్ట్ అదే పాత ప్యాంటూ అందులోనూ మళ్లీ పాత నేను .
గగన్: వాటి గురించి కాదు ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అనడం విన్నాను.
చెర్రి: అది ఒక అమ్మాయి మార్చింది.
గగన్: నిన్ను ఇంతలా మార్చిందంటే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్ రా.
చెర్రి: ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా తెలుసు.
గగన్: నీతో చాలా మంది అమ్మాయిలను చూశాను వాళ్లలో ఎవర్రా..?
అని గగన్ అడగ్గానే ఇప్పుడు కాదులో తర్వాత చెప్తాను ముందు నీకే చూపించి నీ ఆశీర్వాదం తీసుకుని పెళ్లి చేసుకుంటాను అంటాడు. దీంతో గగన్, చెర్రీని విచిత్రంగా చూస్తుంటాడు. తర్వాత భూమి ఇంట్లో వాళ్లందరికీ డాన్స్ నేర్పిస్తుంది.
భూమి: మీరు చేయండి.
ప్రసాద్: అంటే భూమి నువ్వు చేసినట్టుగా మమ్మల్ని చేయమంటే ఎలా కుదురుతుందమ్మా..
భూమి: ట్రై చేస్తే ఏదైనా కుదురుతుంది అంకుల్.
మీరా: భూమి ఈ డాన్స్ నావల్ల కాదు.
భూమి: అంకుల్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు చేస్తారు.
అని చెప్పి డాన్స్ నేర్పిస్తుంది భూమి. దూరం నుంచి నక్షత్ర, ఇందు చూస్తూ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటారు.
ఇందు: ఇంట్లో అందరితో డాన్స్ చేయిస్తుంది. నీతో కూడా చేయిస్తుందేమో..
నక్షత్ర: నాకు రాకపోతే కదా అది నాకు నేర్పించడానికి. ఈ పెళ్లిలో అందరిలో స్పెషల్ అట్రాక్షన్ నేనే అవుతాను చూడు.
ఇందు: పెళ్లిలో నువ్వు అవ్వడం తర్వాత. అక్కడ చూడు ఇంట్లో అందరి దగ్గర ఆ భూమి మార్కులు కొట్టేస్తుంది.
నక్షత్ర: మార్కులు కొట్టేయడం కాదు. మంచాన పడేటట్లు చేస్తాను చూడు.
అంటూ నక్షత్ర అరటిపండు తిని భూమి డాన్స్ చేసే దగ్గర అరటి తొక్క వేస్తుంది. అప్పుడే అటుగా వచ్చిన అపూర్వ అరటితొక్క మీద కాలు వేసి కింద పడిపోతుంది. అందరూ డాన్స్ ఆపి షాక్ అవుతారు. అరటి తొక్కను చూసిన అపూర్వ దీనంతటికీ ఇదే కారణం అని మనసులో అనుకుంటుంది.
భూమి: ఈరోజుకు నేను నేర్పించిన స్టెప్స్ ప్రాక్టీస్ చేయండి నేను రేపు వస్తాను.
శరత్: అప్పుడే వెళ్లిపోతున్నావేంటమ్మా..
మీరా: అదేంటి అందరికీ డాన్స్ నేర్పించి మా అన్నయ్య, వదినకు డాన్స్ నేర్పించవా..?
శరత్: మీరందరూ చేస్తున్నారు కదా? నేనెందుకులే అమ్మా..
మీరా: అదేం కుదరదు మీరు చేయాలి అన్నయ్యా..
శరత్: సరే నువ్వు అంతలా అడిగితే కాదంటానా?
అపూర్వ: ఆహా నాకు కుదరదు. నాకు అసలే నడుం నొప్పిగా ఉంది.
శరత్: సరేలే అమ్మా ఆంటీకి బాగా లేదంటుంది కదా రేపు చూద్దాం లే..
అని ఎలా వెళ్తున్నావు అని అడిగి కారులో వెళ్లు అని చెప్తాడు. సరే అని భూమి వెళ్లిపోతుంది. నువ్వు వెళ్లేది ఇంటికి కాదే స్మశానానికి. నీకోసం నీ చావు ఎదురుచూస్తుంది అని మనసులో అనుకుంటుంది. రౌడీలకు ఫోన్ చేసి భూమిని చంపమని చెప్తుంది. భూమిని కారులో వెళ్లనీయకుండా నక్షత్ర కారులో వెళ్తుంది. ఒక దగ్గర రౌడీలు ప్లాన్ ప్రకారం నక్షత్రను కిడ్నాప్ చేస్తారు. అపూర్వ ఫోన్ చేసి దాని దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని చంపేయండి అని చెప్తుంది. రౌడీలు సరే అని ఫోన్ కట్ చేస్తారు. పాడుబడిన క్వారీ దగ్గరకు నక్షత్రను తీసుకెళ్తారు. మరోవైపు అపూర్వ డాక్టర్ దగ్గరకు వెళ్దామని కారు ఎక్కగానే భూమి వచ్చి కారు ఎక్కుతుంది. భూమిని చూసిన అపూర్వ షాక్ అవుతుంది. నువ్వు ఆ కారులో పోలేదా? అంటూ అడగ్గానే ఆ కారులో నీ కూతురే పోయింది అని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు, శరీరంపై ఎక్కడ ఉంటే ఏం ప్రయోజనమో తెలుసా?