Meghasandesham Serial Today Episode: చీకట్లో గగన్ ను చూసి శారద అనుకుంటుంది భూమి. వెనక నుంచి హగ్ చేసుకుని మీరు ఎంతో అదృష్టవంతులు ఆంటీ ఎంత మంచి కొడుకుకు మీరు జన్మనిచ్చారు అని చెప్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ముద్దు పెట్టుకుంటుంది. ఇదేంటి ఏదో గరుకుగా తగులుతుంది అంటూ తిరిగి చూస్తుంది. ఇంతలో కరెంట్ వస్తుంది. గగన్ ను చూసిన భూమి సిగ్గుతో భయపడుతూ దూరంగా వెళ్తుంది. ఇంతలో శారద వచ్చి ఏమైందమ్మా అని అడుగుతుంది. గగన్ నిజం చెప్పబోతుంటే చెప్పొద్దని గగన్ కే సైగ చేస్తుంది భూమి. శారదను తీసుకుని లోపలికి వెళ్తుంది. తర్వాత కారులో వెళ్తున్న గగన్‌కు అడ్డుగా చెర్రి వస్తాడు.
గగన్: అరేయ్ ఉరుములు లేని మెరుపులా సడెన్ గ వచ్చావేంట్రా..
చెర్రి: సోదరా.. ఆనందం సోదరా.. ఇంట్లో వాళ్ల ఆనందాన్ని నీ ముందు కుమ్మరిద్దామని వచ్చాను.
గగన్: ఆ ఇంటి ఆనందాలతో నాకేం పని ఉంది.
చెర్రి: దానికి కారణమే నువ్వు కదా సోదరా..?
గగన్: నేను చేసే పనులకు వాళ్లు ఆనందం పడటం కూడానా?
చెర్రి: మామూలు ఆనందం కాదు సోదరా. వరద పొంగినట్టు.. సునామీ తీరం ఎగిసిపడినట్టు పొంగి పోతున్నారు అందరూ. అసలు ఆ వంశీ చేసిన పనికి నువ్వు క్షమాపణ చెప్తావని నేను అసలు ఊహించలేదు సోదర.
ఇంతలో కారులోంచి బయటకు వచ్చిన ప్రసాద్ ను చూస్తాడు గగన్. కోపంగా ఏదో అనబోతుంటే గగన్ డైలాగ్, ప్రసాద్ డైలాగ్ అన్నీ చెర్రి చెప్తాడు. దీంతో గగన్ కోపంగా ప్రసాద్ ను తిడతాడు. నేను క్షమాపణ చెప్పింది మా అమ్మకోసం చెప్పాను.. ఇలా ప్రతిదీ అవకాశంగా చేసుకుని వద్దన్నా నా చుట్టు తిరగడం చేయోద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
చెర్రి: సారీ నాన్నా అలా అంటేనన్నా సోదరుడి మనసు మారుతుందేమోనని నేను అనేశాను. అయినా ఆ కోపం నీ మీద కాదు నాన్నా.. నా మీద.
ప్రసాద్: అయినా వాడు అనడానికి నేను వినడానికి అలవాటు పడిపోయానురా. వాడి ప్రేమను చంపేసి ఆ కోపానికి ప్రాణం పోసింది నేనేరా..? పడాల్సి అవసరం నాకు ఉంది. నన్ను వాడు ఎన్ని మాటలు అన్నా నా పిల్లలు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ ఆనందం చాలు నాకు.
చెర్రి: నాన్నా ఏంటి నాన్నా ఆ మాటలు.
ప్రసాద్: రేయ్ అంత తొందరగా ఏమీ పోనులేరా? చేసిన పాపాలకు అనుభవించాలిగా..
అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు శారద వంట చేస్తుంటే పూరి వచ్చి కూరగాయలు అంత లావుగా కాదు అమ్మా సన్నగా తరుగు అని చెప్తుంది. దీంతో వంట చేయడం రాదు కానీ నాకే చెప్తున్నావా? అంటుంది. ఇంతలో భూమి వచ్చి వంట చేస్తున్నారా?అంటూ అడుగుతుంది. అవునని పూరికి ఇష్టమని కూరలు చేస్తున్నాను అని చెప్తుంది. అయితే మీ అబ్బాయికి ఇష్టమైనవి చేయరా? అని అడుగుతుంది భూమి. గగన్ కు ఇష్టమైన వంటలు కనుక్కుని వంట నేను చేస్తాను మీరు వెళ్లండి ఆంటీ అని భూమి వంట చేస్తుంది. తర్వాత గగన్ కు క్యారియర్ పంపిస్తుంది. మరోవైపు ఇందు హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. ఫంక్షన్‌లో గగన్ ను వెనకేసుకొస్తుంది నక్షత్ర. దీంతో శరత్, అపూర్వ షాక్ అవుతారు. అపూర్వ కోపంతో నక్షత్రను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం