Meghasandesam Serial Today Episode: శోభా చంద్ర మర్డర్‌ జరిగిన కెమెరాను ఎలాగైనా దొరికించుకోవాలని అపూర్వ ప్లాన్‌ చేస్తుంది. అందుకోసం సుజాతను తీసుకుని గగన్‌ ఇంటికి వెళ్తుంది. ఇంట్లో సుజాత అపూర్వ మొత్తం వెతుకుతారు. కెమెరా ఎక్కడా దొరకదు.

అపూర్వ: పిన్ని దొరికిందా వీడియో రికార్డర్‌

సుజాత: లేదు అమ్మాయి నీకు దొరికిందా..?

అపూర్వ: లేదు పిన్ని  అది చచ్చే ముందు కూడా పకడ్బందీగా కెమెరాను ఎక్కడ దాచిందో

సుజాత: లేదు అమ్మాయి బుల్లెట్‌ దిగినప్పుడు కెమెరా తన చేతుల్లోనే ఉందని ఆ రౌడీ చెప్పాడు కదా..? అంతే ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది.

అపూర్వ: ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా పిన్ని.. నిజమే ఇక్కడే వెతుకుదాం..

సుజాత: అవును అమ్మాయి ఇక్కడే వెతుకుదాం..

అంటూ ఇద్దరూ హాల్లో కెమెరా వెతుకుతారు. సోపా కింద ఉన్న కెమెరా అపూర్వ కంట పడుతుంది. కిందకు వెళ్లి అపూర్వ కెమెరా తీసుకుంటుంది.

అపూర్వ: కెమెరా దొరికింది.. నాకే దొరికింది.. ఈ వీడియో సాక్ష్యం నన్ను ఎంతో భయపెట్టింది. ఈ సాక్ష్యం లేకపోతే నన్ను అసలు ఎవ్వరూ ఏమీ చేయలేరు..

సుజాత: అవును అమ్మాయి.. ఇక వెళ్దాం పద ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే బాగోదు..

అనగానే సుజాత, అపూర్వ ఇద్దరూ కలిసి కెమెరా తీసుకుని వెళ్లబోతుంటే.. అప్పుడే ఇంట్లోకి భూమి వస్తుంది. భూమిని చూసిన అపూర్వ భయంతో చేతిలో ఉన్న కెమెరాను దాచే ప్రయత్నం చేస్తుంది. భూమి కోపంగా అపూర్వను చూస్తుంది.

భూమి: అపూర్వ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసు.. నువ్వు కచ్చితంగా కెమెరా కోసం వస్తావని నాకు తెలుసు. అందుకే నేను వెంటనే ఇక్కడికి వచ్చాను..

అపూర్వ: అబ్బో బలే గెస్ చేశావే కానీ కెమెరా నాకు దొరికింది.. ఇక ఏం చేస్తావే నన్ను..

భూమి: అవునా కెమెరా తీసుకుని నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తాను.. మా అమ్మను చంపిందే కాకుండా.. మా అత్తయ్యను కూడా చంపాలని చూసింది నువ్వే అన్నమాట.. నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను అపూర్వ..

అపూర్వ: అవునే మీ అమ్మను చంపింది నేనే.. ఇప్పుడు ఈ వీడియో రికార్డర్‌ కోసం మీ అత్తయ్యను చంపాలనుకున్నది కూడా నేనే.. ఇప్పుడు నాకు ఎదురొస్తే నిన్ను కూడా చంపేస్తాను.. ఏం చేస్తావే..

భూమి: అవునా చంపేస్తావా..? మా అమ్మను చంపినంత ఈజీ అనుకున్నావా.. నన్ను చంపడం అపూర్వ. ఆరోజు మా అమ్మ నిన్న నమ్మింది కాబట్టి నీ మోసానికి బలై పోయింది. కానీ ఇవాళ నీ అసలు రంగు మొత్తం తెలుసు నాకు నువ్వు నన్ను చంపడం కాదు నువ్వు మా నాన్న చేతిలో చావకుండా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను.. ప్రతి మనిషికి ఒక ముగింపు ఉంటుంది. నీకు ముగింపు నేను పలుకుతా..! 

అంటూ అపూర్వ చేతిలో కెమెరా లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. చివరకు అపూర్వ చేతిలోని కెమెరాను భూమి లాగేసుకుంటుంది.

అపూర్వ: ఏయ్‌ కెమెరా ఇవ్వవే లేదంటే నిన్ను చంపేస్తాను..

భూమి: ఏంటి బెదిరిస్తున్నావా..? అపూర్వ.. కెమెరా ఇవ్వడం కుదరదు.. ఈ వీడియో లో ఉన్న నిజాన్ని మా నాన్నకు చూపించి.. మా అమ్మను చంపింది నువ్వేనని ప్రూవ్‌ చేసి నిన్ను జైళ్లో పెట్టిస్తా..

అంటూ భూమి కెమెరా తీసుకుని వెళ్లబోతుంటే.. అపూర్వ లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది.

అపూర్వ: ఏయ్‌ భూమి కెమెరా ఇవ్వవే..

సుజాత: అమ్మాయి గట్టిగా పట్టుకో.. లాగేసుకో..

అపూర్వ: ఆగవే.. ఏయ్‌ భూమి దొరికితే నిన్ను చంపేస్తా.. ఆగవే…

అంటుండగానే భూమి అపూర్వను సుజాత మీదకు తోసేసి  కెమెరాతో పారిపోతుంది. భూమి కెమెరా తీసుకుని శరత్‌ చంద్ర దగ్గరకు రోడ్డు మీద పరుగెడుతుంటే.. వెనకాలే అపూర్వ కారులో వస్తుంది. భూమిని పట్టుకుని కెమెరా లాక్కోవాలని ట్రై చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!