Chinni Serial Today Episode మ్యాడీ చిన్ని కోసం చాలా చాలా ఏడుస్తాడు. వరుణ్‌ మ్యాడీకి ధైర్యం చెప్తాడు. కచ్చితంగా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఇంకెప్పుడూ ఇలా ఏడ్వకు నీ కంట్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను అని వరుణ్ అంటాడు. ఇక మ్యాడీ వరుణ్‌తో కంగ్రాట్స్ బావ నీకు మంచి సంబంధం కుదిరింది.. మీ జంట చాలా బాగుంది అని మహి అంటాడు. వరుణ్ మనసులో నీ బాధలో నువ్వు ఉంటే నా బాధ నేను చెప్పలేను బావ అని వెళ్లిపోతాడు.

కాలేజ్‌లో మధు, స్వప్నలు డ్యాన్స్ ప్రాక్టీస్ గదికి వస్తారు. ఇంతలో ఇంకో ఫ్రెండ్ వచ్చి మా చెల్లికి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఉంది.. కొంచెం డ్యాన్ చేయవే వీడియో తీసి పంపిస్తా వాళ్లు ప్రాక్టీస్ చేస్తారు అని అంటుంది. మధు సరే అని డ్యాన్స్ చేస్తే వాళ్ల ఫ్రెండ్ వీడియో తీస్తుంది. మ్యాడీతో పాటు అందరూ అక్కడికి వస్తారు. మధు డ్యాన్స్‌కి ఫిదా అయిన మ్యాడీ మధుని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. లోహిత షాక్ అయిపోతుంది. స్వప్న చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక మ్యాడీ వరుణ్‌ని తీసుకొచ్చి మా బావకి మంచి సంబంధం ఫిక్స్ అయింది రేపు నిశ్చితార్థం.. రేపు అందరూ వచ్చేయండి అని అంటాడు. లోహిత ముఖం మాడిపోతుంది. వరుణ్ కూడా డల్ అయిపోతాడు.  ల్యాబ్‌లో చిన్న పని ఉందని లోహిత వెళ్లిపోతుంది.

శ్రేయ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి వస్తా అని వరుణ్‌ కూడా లోహిత వెనకాలే జారుకుంటాడు. మధుని మ్యాడీ ఏడిపిస్తాడు. లేడీ మైకిల్ జాక్సిన్‌ అంటూ అనడంతో మధు మహిని కొట్టడానికి పరుగులు పెడుతుంది. వరుణ్ లోహిత దగ్గరకు వస్తాడు. ఏంటి వరుణ్‌ ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయావ్ అని అడుగుతుంది. మెల్లగా మాట్లాడు ఎవరైనా వింటారు అని వరుణ్ అంటే ఎవరైనా వింటారు అనే నీ బాధ కానీ నా గురించి నీకు ఏం బాధ లేదని అంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటే శ్రేయ అతిథితో వస్తుంది. 

వరుణ్‌, లోహిత షాక్ అయిపోతారు. నువ్వేంటి అతిథి అంటే నిన్ను చూడకుండా ఉండలేక వచ్చిందని అంటుంది. లోహితకు పరిచయం చేసి నిశ్చితార్థానికి రమ్మని చెప్తుంది. అతిథి ఐఫోన్ 17ప్రోని వరుణ్‌కి గిఫ్ట్‌గా వస్తుంది. నువ్వు లక్కీ బ్రో నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుంది అని శ్రేయ అంటుంది. నాకు వరుణ్‌ కంటే ఏదో కాస్ట్లీ కాదని అతిథి అంటుంది. వరుణ్‌తో శ్రేయ వదినతో షాపింగ్‌కి రా అన్నయ్య అని పిలుస్తుంది. వరుణ్ వస్తా అంటాడు. ఇక లోహిత నేను చచ్చిపోతా అని వెళ్తుంటే వరుణ్‌ వెనకాలే వెళ్తాడు. లోహిత, వరుణ్‌ మాట్లాడుకోవడం మధు చూస్తుంది. వరుణ్‌ ఏంటి లోహితను బతిమాలుతున్నాడు ఇంత చనువుగా ఏం మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. ఇంతలో స్వప్న పిలవడంతో మధు వెళ్లిపోతుంది. 

నిశ్చితార్థం ఆపేస్తా నన్ను నమ్ము అని వరుణ్ అంటాడు. ఇక ఇంట్లో అందరూ వరుణ్‌ కోసం డ్రస్ సెలక్ట్ చేస్తుంటారు. ఫైనల్‌గా మ్యాడీ ఓ డ్రస్ సెలక్ట్ చేస్తాడు. లోహిత వరుణ్‌కి కాల్ చేస్తూ ఉంటుంది. అందరూ ఉండటంతో వరుణ్ కట్ చేస్తాడు. మాట్లాడటం కుదరదు అని మెసేజ్ చేస్తాడు. లోహిత చాలా భయపడుతుంది. జరుగుతుంది నీ డ్రస్‌ సెలక్షనే నువ్వేంటి అదోలా ఉన్నావ్ అని దేవా వరుణ్‌ని అడుగుతాడు. ఇంతలో మినిస్టర్ దేవాకి కాల్ చేసి నిశ్చితార్థానికి సీఎం వస్తారు అని చెప్తాడు. దేవా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీలవుతారు. దేవా వరుణ్‌ని దగ్గరకు తీసుకొని థ్యాంక్యూ వరుణ్‌ ఈ మామయ్య రేంజ్‌ని ఇంకోంత పైకి పెంచావ్ అని అంటాడు. వరుణ్‌కి మంచి సంబంధం వచ్చిందని మధు, స్వప్న మాట్లాడుకుంటారు. ఇద్దరూ మెకానిక్ షాప్‌ దగ్గర ఆఫ్ టికెట్‌ని చూసి పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.